Disha Dasha News

Disha Dasha News The news lence

08/12/2025

చత్తీస్ గడ్: మావోయిస్టుల.ఆయుధ.విరమణ సందర్భంగా మీడియాతో సీఎం విష్ణు దేవ్ సాయ్ కామెంట్స్...

08/12/2025

Maoist news: చత్తీస్ గడ్: కోటి రూపాయల రివార్డు ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ సహా 12 మంది మావోయిస్టులు చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం (హోంమంత్రి) విజయ్ శర్మల ముందు ఆయుధ విరమణ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌ధేర్, తన 11 మంది సహచరులతో కలిసి ముఖ్యమంత్రి ముందు వనాలు వీడి జన జీవనంలోకి అడుగు పెట్టారు. మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్ లో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా అంతరించిపోయాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. నక్సలిజంపై పోరాటంలో భద్రతా దళాలు ఈ రోజు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయన్నారు. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు DVCMలు మరియు ఏడుగురు బాధ్యులు ఉన్నారు. ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి ఎన్ కౌంటర్ లో చనిపోయిన మాద్వి హిద్మాతో పాటు రాంధేర్ కేంద్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు.

08/12/2025

తెలంగాణ: మీరు వేసే ఓటు భావి తరాలకు బంగారు బాట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆలోచించాలంటున్న విద్యార్థి.

08/12/2025

తెలంగాణ: మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకండి... అభివృద్ధి చేసే నాయకుడిని నమ్ముకోండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆలోచించాలంటున్న విద్యార్థి.

08/12/2025

తెలంగాణ: నోటు కోసం ఓటు కాదు భవిష్యత్ కోసం వేయండి ఓటు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆలోచించాలంటున్న విద్యార్థి.

08/12/2025

తెలంగాణ: మీరు వేసే ఓటు భవిష్యత్ తరాలకు బంగారు బాట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆలోచించాలంటున్న విద్యార్థి.

08/12/2025

Maoist news: మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ముందు జన జీవనంలోకి వచ్చారు. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జయలాల్ ఆయన భార్య గంగిలు వనం వీడారు. మందుపాతర పేల్చి 76 మంది జవాన్లను బలి తీసుకున్న ఘటనలో వీరిద్దరి పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.

07/12/2025

కరీంనగర్: దుర్శేడు మరకత లింగ శ్రీ రాజ రాజేశ్వర స్వామివారికి ఆరుద్రాభిషేకం.

రామగుండం పోలీస్ కమీషనరేట్శాంతి భద్రతలు, ప్రజా భద్రతలలో  కీలకంవిధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానాలు మరువలేనివని, ప్...
06/12/2025

రామగుండం పోలీస్ కమీషనరేట్

శాంతి భద్రతలు, ప్రజా భద్రతలలో కీలకం
విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానాలు మరువలేనివని, ప్రశంసనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కితాబిచ్చారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శనివారం 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి కమాండర్ గా హోంగార్డ్ ఆర్ ఐ పెద్దన్న వ్యవహరించారు. పరేడ్ కి పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ... హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, క్రైమ్‌ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్‌, విపత్తుల సమయంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారు. మ అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు చూపే అంకితభావం ఆదర్శమని అన్నారు. బాధ్యతగా వ్యవహరించే హోమ్ గార్డుల క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకేఏ గర్వకారణం అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఏసిపి నాగేంద్ర గౌడ్, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ ఐ లు దామోదర్ శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సంపత్, ఆర్ఎస్ఐలు హోంగార్డ్ సిబ్బంది ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

06/12/2025

Address

Karimnagar
Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Disha Dasha News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Disha Dasha News:

Share