11/10/2022
*విద్యార్థులకు Special skills తాత్కాలిక బోధన సిబ్బందికి ఆర్థిక సహాయం*
11/10/2022 రోజున మంగళవారం వీణవంక మండల మోడల్ స్కూల్ లో తాత్కాలిక బోధన సిబ్బంది గౌరవ వేతనం కోసం *YuppTV CEO*
*పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారు* 42000/- పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ డా" వేణుగోపాల్ రెడ్డి కి మంగళవారం అందజేశారు
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా" వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా విద్యార్థిని విద్యార్థులకు సబ్జెక్టు పరంగా విద్య బోధన కోసం సరిపడ బోధన సిబ్బంది లేక పరిస్థితి నెలకుందని అని వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు తప్పనిసరిగా పాఠశాలలో వివిధ సబ్జెక్టుల పైన విద్యార్థిని విద్యార్థులకు అనగా గణితం, సైన్స్, ఇంగ్లీష్, తదితర సబ్జెక్టుల పైన విద్యార్థులకు స్పెషల్ స్కిల్స్ తరగతుల కోసం విద్యాబోధన చేయడానికి బోధన సిబ్బంది లేదని తాత్కాలికంగా కొంతమంది విద్యావంతులను విద్యా వాలంటరీలుగా నియమించడం కోసం ఈ మధ్యకాలంలో విజ్ఞప్తి తల్లిదండ్రులతో పాటు కొందరి దాతలను ఆర్థిక సహాయం కోసం కోరడం జరిగినది ఇందులో భాగంగా వీణవంక మండల కేంద్రానికి చెందిన
*పాడి ఉదయ్ నందన్ రెడ్డి*
*(Founder & CEO -YuppTV & Turito)* గారి సంప్రదించగా వెంటనే స్పందించిన వారు 42000/- ఆర్థిక సహాయం అందజేశారు బోధన సిబ్బంది అవసరాల కోసం ఇచ్చారు అలాగే వీణవంక మోడల్ స్కూల్ మరియు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 35 మంది స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది, విజయదశమి సందర్భంగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారు ప్రారంభించిన
*టూరితో ఛాంపియన్*(Turito champion) ద్వారా 4 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసుల ద్వారా JEE, NET, ఐఐటీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అందించడం జరుగుతుంది అందులో భాగంగా టూరిటో చాంపియన్ అను కార్యక్రమంను
ఉదయ్ నందన్ రెడ్డి సొంత మండలమైన వీణవంక మండలంలో మోడల్ స్కూల్ మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. కావున విద్యార్థిని విద్యార్థులు రోజువారీగా ఫోటో ఛాంపియన్ యాప్ ద్వారా ప్రత్యేక క్లాసులు శిక్షలు తీసుకోవాలని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఉదయ్ నందన్ రెడ్డి విద్యార్థులకు తెలియజేశారు, ఈ సందర్భంగా ప్రిన్సిపల్
డా " వేణుగోపాల్ రెడ్డి గారు
ఉదయ్ నందన్ రెడ్డి గారి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో
వెన్నంపల్లి నారాయణ, శ్రీధర్, దాసరపు లోకేష్, వంశీకృష్ణ,ప్రకాష్, చిన్నాల,శ్రీకాంత్,అఖిల్, కుమార్,, తాళ్లపెళ్లి కుమారస్వామి, తొట్లరాకేష్, మోడల్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.........