Kavali Today

Kavali Today THE KANAKAPATNAM OF ANDHRA PRADHESH. Kavali is a city in Nellore district of Andhra Pradesh.

*వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకుందాం..!* *గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి..**జలదంకి ఎస్సై గద్ద...
08/09/2026

*వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకుందాం..!*

*గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి..*

*జలదంకి ఎస్సై గద్దె వీరేంద్రబాబు..*

*జలదంకి మండలంలోని 17 పంచాయతీల లోని ఆయా గ్రామాల ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జలదంకి ఎస్సై గద్దె వీరేంద్రబాబు కోరారు..*

*వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ganeshutsav.net పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సింగిల్ విండో అనుమతులు పొందాలని సూచించారు. దరఖాస్తులో ఐదుగురు నిర్వాహకుల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని, మండపం వద్ద జరిగే సంఘటనలకు వారే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. డిజేలకు ఎలాంటి అనుమతి లేదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ సిస్టమ్స్ పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు కాకుండా సరైన వైరింగ్ చేసుకోవాలని, రాత్రి వేళల్లో కనీసం ముగ్గురు వాలంటీర్లు నిద్రించాలని కోరారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం నిషేధమని హెచ్చరించారు..*

08/09/2026
08/09/2026
07/09/2026

*n3news.in*

*హోరాహోరీగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు*

_అల్లూరులో 3రోజులుగా అంతర జిల్లాల
బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు_

_విజేతలకు బహుమతులు అందజేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి_

_subscribe for more videos_

_ap fiber channel

*https://youtu.be/LxLHTmZmEkM*

07/09/2026

*కొత్త ఫించన్ దరఖాస్తుకు కావలసిన పత్రాలు:*

▪️ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.
▪️వృద్ధాప్య పింఛన్లకు వయో నిర్ధారణ సర్టిఫికెట్. లేదా ఆధార్.
▪️వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్. భర్త ఆధార్.
▪️వివాహిత ఒంటరి మహిళలు విడాకుల సర్టిఫికెట్.
▪️అవివాహిత ఒంటరి మహిళలు తహసీల్దార్ సర్టిఫికెట్.
▪️దివ్యాంగులకు(40% వైకల్యం) సదరం సర్టిఫికెట్.
▪️చేనేత కార్మికులు జౌళిశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
▪️మత్స్యకారులు మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
▪️డప్పుకళాకారులు, చర్మకారులు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన ధ్రువపత్రం.
▪️కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్.
▪️ట్రాన్సో జెండర్లు జిల్లా వైద్య బోర్డు ఇచ్చే ధ్రువపత్రం

*ఇదీ.. షెడ్యూల్!*

▪️దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబరు 7 నుంచి 16 వరకు.
▪️ఎవరికి ఇవ్వాలి: గ్రామ/వార్డు సచివాలయంలోని డిజి టల్ అసిస్టెంట్
▪️ఈ-కేవైసీ: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ తనిఖీ బాధ్యత డిజిటల్ అసిస్టెంట్లే.
▪️అర్హత పరిశీలన: స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు, ఆర్టీజీఎస్, సెర్చ్ విభాగాలు చేస్తాయి.
▪️క్షేత్రస్థాయి పరిశీలన: ఈ నెల 17 నుంచి 21లోగా పూర్తి.
▪️అర్హత నిర్ణయం: ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్/జి ల్లా/రాష్ట్రస్థాయి అధికారులు.
▪️అర్హత నిర్ణయానికి పట్టే సమయం: ఈ నెల 22-24వ తేదీ వరకు.
▪️తుది ఆమోదం: ఈ నెల 25 నుంచి 26వ తేదీలోగా సెర్చ్ తుది ఆమోదం.

06/09/2026

*కావలి టోల్‌ప్లాజా వద్ద ACB అధికారుల ఆకస్మిక తనిఖీలు*.

*అర్ధరాత్రి దాడులు చేపట్టిన ACB అధికారులు.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ గోపీనాయక్ అదుపులోకి.*

*ఎంవీఐ నుంచి రూ. 2.48 లక్షల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు.*

*ఎంవీఐతో పాటు లారీ డ్రైవర్, ఇద్దరు హోంగార్డులను అదుపులోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ.*

*జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఎంవీఐపై ఫిర్యాదులు.*

*ఫిర్యాదులపై నిఘా పెట్టి, నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో రంగంలోకి దిగి పట్టుకున్న అధికారులు.*

https://youtu.be/uDgmLhcDSX0?si=1dKpfqqXQPc1en33

Address

Kavali
524201

Alerts

Be the first to know and let us send you an email when Kavali Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kavali Today:

Shortcuts

Share