26/12/2022
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 37వ డివిజన్ లో గురుదత్త పీఠం నిర్వాహకులు ఉరిమెళ్ల కృష్ణప్రసాద్ గారు మరియు డా.మాదిరాజు నందనందన్ గారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా శిభిరాన్ని డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ ఉచిత కంటి పరీక్షా శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది కావున 37వ డివిజన్ లో దీర్ఘకాలంగా ఎదురుకుంటున్న కంటి సమస్యలు మరియు తరచూ తలనొప్పితో బాధ పడుతున్న వారు దయచేసి ఈ అవకాశన్ని ఉపయోగించుకోగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. మాదిరాజు అశోక్ గారు,గురుదత్త పీఠం నిర్వాహకులు లక్ష్మి గారు,ట్రస్ట్ సభ్యులు సుగ్గల రాజారావు, సుజాత, సుగ్గల రాము, పొట్టిమూర్తి జనార్ధన్,గఫార్, జయంతి కోటాచారి,గంట ముత్తయ్య, దేవిశెట్టి హనుమంతరావు, రామ్మూర్తి అంగన్వాడీ టీచర్స్ ధనలక్ష్మి,గీతాభవాని మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 37వ డివిజన్ లో గురుదత్త పీఠం నిర్వాహకులు ఉరిమెళ్ల కృష్ణప్రసాద్ గ...