05/09/2026
4 గంటలుగా ఎదురు చూస్తున్న రోగులకు.. “ఓపిక లేదు.. వెళ్లిపొండి” అంటూ సమాధానం!
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గంటల తరబడి ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న రోగులను పట్టించుకోకుండా.. “ఓపిక లేదు, వెళ్లిపొండి” అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని.. గంటల తరబడి వేచి ఉండే పరిస్థితికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
“ఓపిక లేనప్పుడు ఆసుపత్రిలో ఎందుకు పనిచేస్తున్నారు?” అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
📢 ఈ ఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి, నిజానిజాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.