19/03/2025
ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం మీసేవ ఆపరేటర్లు
రాష్ట్ర మీసేవ అసోసియేషన్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం మీసేవ ఆపరేటర్లు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలాలైన శ్రీకాళహస్తి అర్బన్ అండ్ రూరల్ ఆపరేటర్లు సూర్య, కిరణ్, శ్రావణ్, షామీర్, గురవయ్య, శ్యామ్, కవిత మరియు తొట్టంబేడు ఆపరేటర్లు కిరణ్, నూతన మరియు ఏర్పేడు మధు , యుగంధర్ రేణిగుంట మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.
మీసేవ ఆపరేటర్లు మాట్లాడుతూ.... నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మీసేవ ఆపరేటర్లను మరల ఐటీ శాఖలోకి చేరుస్తామని గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తెల్పడం, రాష్ట్రంలో ఉన్న మీసేవ ఆపరేటర్ల కుటుంబమంతా ఆనందదాయకంలో మునిగింది . మరలా మీసేవ కి పూర్వవైభవం తెప్పియడం చాలా సంతోషంగా ఉందని దీని గాను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము . 2003లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ- సేవ కేంద్రాన్ని ప్రారంభించి, అనేక శాఖలోని వివిధ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా సుమారు పదివేల కుటుంబాలు , పరోక్షంగా 30 వేల కుటుంబాలు ఆధారపడి ఉందని , వీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.
అలాగే అసెంబ్లీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వారు తెలిపినప్పుడు, ఆ అసెంబ్లీలో మన శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉండడం చాలా సంతోషంగా ఉందని వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
NTR విగ్రహానికి పాలాభిషేకం చేసిన శ్రీకాళహస్తి మీసేవ ఆపరేటర్లు
NTR విగ్రహానికి పాలాభిషేకం చేసిన శ్రీకాళహస్తి మీసేవ ఆపరేటర్లు ...