
03/03/2025
డీఎస్సీ నోటిఫికేషన్ పై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. గత 30ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశాం. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 మధ్య చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో 2014,18,19లలో 3 డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేయడం జరిగిందని వివరించారు.