
27/01/2024
ఈ చిత్రము లోని నందీశ్వరుడు తన స్వామి కొరకు వందల ఏళ్ల గా ఎదురుచూస్తున్నాడు . ఇదే కాశీ విశ్వేశ్వర ఆలయం లో జ్ఞాన వాపి మసీదు వైపు చూస్తున్న నంది విగ్రహం . ప్రతి శివాలయం లో నంది విగ్రహం శివుని చూస్తూ ఉంటుంది . మరి ఇక్కడ నంది చూస్తున్న శివయ్య మసీదు నిర్మాణం లో మాయమయ్యాడా ?
ఇప్పటి ఇరాన్ ప్రాంతాలలో వచ్చిన కరువు కాటకాల బారి నుండి హిందూ కుష్ పర్వత శ్రేణులు దాటి వచ్చిన ప్రజలు ఇక్కడ భారత భూమిలో గణ సమూహ రాజ్యాలను క్రమేపీ ఆక్రమించుకొంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని ఏర్పరిచారు .అదే వేద సంస్కృతిగా చెపుతారు . ఈ జంబూక ద్వీప భూమిలో గల శక్తివంతమైన , విజ్ఞాను లైన , పరిపాలనా దక్షులై న ప్రభువులను తమ కుయుక్తులతో హతమార్చి వారందరూ రాక్షసులుగా చిత్రీకరించి అనేక పురాణ కధలు ప్రచారం చేసారు . అరేబియా సముద్ర తీరం లోని పరామర వంశజుడైన పరుశురాముడు అనే చారిత్రిక రాజునూ పురాణ పురుషునిగా వర్ణించారు . .. అప్పటికే వున్న బౌద్ధ జైన ఆజీవక మతస్తుల ఆరామాలను ద్వాంసం చేసి ఆలయాలుగా పంచారామాలుగా మార్చేశారు . నిలువు మరియు అడ్డ నామాల శక్తి సమాన ముగా వున్న చోట హరిహర సుతులను ఆరాధించారు . .. ఆ క్రమములో వీరిపై ఎడారి మతాల వారు దాడి చేసి ఆలయాలు కొల్లగొట్టి నాశనం చేసారు . వారి ప్రార్ధన మందిరాలు నిర్మించుకున్నారు . చరిత్ర పునరావుత్తమైనది .నర జాతి చరిత్ర సమస్తం పర జాతి పీడనం .