30/05/2025
పప్పులుసు : (చపాతి తో బావుంటుంది)
కందిపప్పు - 1 cup
నూనె - 3-4 tbsp
ఆవాలు - 1 tsp
మెంతులు - 1/2 tsp
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
చింతపండు - 2 రెబ్బలు
బెల్లం ముక్క - చిన్నది
కందిపప్పు 1/2 గంట నానబెట్టి, ఉడకబెట్టి మెత్తగా మెదుపుకోవాలి.
పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, మెంతులు వేసి వేగాక సన్నగా, నిలువుగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి అవి కూడా మగ్గాక చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఆ తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పు, చిన్న బెల్లం ముక్క వేసి ఒక్క ఉడుకు రానివ్వాలి.
కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు.
Pappulusu : (Tastes good with chapati)
Toordal - 1 cup
Oil - 3-4 tbsp
Mustard seeds - 1 tsp
Fenugreek - 1/2 tsp
Onion - 1
Green chilli - 2
Curry leaves - a little
Salt - enough
Turmeric - 1/4 tsp
Chilli powder - 1 tsp
Tamarind - small lemon sized
Jaggery - small piece
Soak the dal for 1/2 hour, boil it and mash it until soft.
Add oil to a pan, when it is hot, add mustard seeds, fenugreek seeds, then add thinly sliced onion, green chillies, curry leaves and when they are also soft, add tamarind juice, salt, turmeric, and chillies and let it cook for 2-3 minutes.
After that, add the mashed dal and a small piece of jaggery and let it boil.
You can add coriander powder if you want.