
18/04/2025
గోవుల మరణాలను నిరూపించాలంటూ సవాల్ విసిరిన టీడీపీ సత్తా లేక తోక ముడిచింది. సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేక వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డుకుని గృహ నిర్బంధంలోకి తీసుకుంది. ఒకపక్క వారిని పోలీసులతో అడ్డుకుంటూ మరోపక్క గోశాల వద్దకు రావడం లేదంటూ కూటమి నేతలు పథకం ప్రకారం అ నుకూల మీడియాలో దుష్ప్రచారం చేయించారు. రోజంతా పోలీసుల ద్వారా హైడ్రామా నడిపించారు. గురువారం తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి బయటకు రాకుండా అడ్డుకున్నారు..