Janam mata

Janam mata Janammata monthly magazine is fight for people problems.it is platform of that.it is also fight on d

వ్యవస్థ కంపులో బతుకుతున్న జీవులం.. బొద్దింకలం -----------------------------------------------------------------------భార...
22/05/2026

వ్యవస్థ కంపులో బతుకుతున్న జీవులం.. బొద్దింకలం
-----------------------------------------------------------------------
భారతదేశంలో నిరుద్యోగులను బొద్దింకలు, పారాసైట్స్ అన్నాడు భారత ప్రధాన న్యాయమూర్తి. నిరుద్యోగులు ఊరక ఉండకుండా మీడియాలలో సోషల్ మీడియాలలో,సమాచార హక్కు చట్టం అని తిరుగుతూ సిస్టంపై దాడి చేస్తున్నారని అన్నాడు.పారసైట్స్ గా బతుకుతున్నారని అసహనం వ్యక్తం చేసాడు.ఒక భారత ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులను అలా అనవచ్చా.. ఇప్పుడు భారతదేశం అంతా ఇదే చర్చ జరుగుతోంది.నిరుద్యోగ యువత ఊరక ఉంటుందా.. కాక్ రోచ్ జనతా పార్టీ అని పెట్టి రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇండియాలో నిరుద్యోగం పెరగడానికి కారణమైన వారిని న్యాయస్థానాలు ప్రశ్నించాలి.వారిని ప్రశ్నించకుండా మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని మీడియా, సోషల్ మీడియా, ఆర్టిఐ ద్వారా ప్రశ్నిస్తే మాత్రం బొద్దింకలు, పారాసైట్స్ అంటున్నారని యువత అంటోంది.ప్రశ్నించడం, హక్కులు అడగడం, మాట్లాడడం, బ్రతకడం ఇలా అన్నీ కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు.ఆ హక్కులలో భాగంగా మాట్లాడితే నేరమంటే ఎలా. భారతదేశ జనాభా 147కోట్లు. దాదాపు 50కోట్ల మందికి ఉద్యోగాలు లేవు.నిరక్షరాస్యులుగా దాదాపు 28కోట్ల మంది,తీవ్ర పేదరికంలో ఉన్నవారు 7 నుండి 9కోట్ల మంది దాకా ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. దేశంలో పేదరికానికి, నిరుద్యోగ సమస్యకు ఏమి పరిష్కారం చూపుతారని వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారు పాలకులను ప్రశ్నించకుండా, వాటి బారినపడి బాధపడే వారిని బొద్దింకలు, పారాసైట్స్ అంటే భారత యువత ఊరక ఉంటుందా.. తన ఆవేదనను ఆవేశంగా మార్చింది. అవును మేము బొద్దింకలమే.. ఈ ఫాసిజం కంపులో బతుకుతున్న జీవులం..బొద్దింకలం అంటోంది. అందుకే బొద్దింకల పార్టీ పెట్టి వ్యవస్థలో పేరుకుపోయిన కంపును శుభ్రం చేస్తామని అంటోంది.

-------------(సత్యన్న, ఎడిటర్, జనంమాట )

రూపాయి పెంచుతాం.. పావలా తగ్గిస్తాం.. తగ్గించి మేలు చేసాము కదా సంబరాలు చేసుకొండని.. చెపుతాం..
11/10/2025

రూపాయి పెంచుతాం.. పావలా తగ్గిస్తాం.. తగ్గించి మేలు చేసాము కదా సంబరాలు చేసుకొండని.. చెపుతాం..

Address

Kurnool
518002

Alerts

Be the first to know and let us send you an email when Janam mata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janam mata:

Shortcuts

Share