20/08/2026
రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నవులూరి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి గారి "పెద్ద కర్మ కార్యక్రమంలో" పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు & రాష్ట్ర అధ్యక్షులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం శ్రీ జక్కంపూడి రాజా గారు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు..
ఈ సందర్భంగా చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, SEC సభ్యులు శ్రీ కొమ్మారెడ్డి చలమారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కె.వి.), పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యొనుముల మురళీధర్ రెడ్డి,గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డిగార్లతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి "పెద్ద కర్మ" కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెన్నారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.