Pinnelli Digital Army

Pinnelli Digital Army YSR Congress Party Social Media Macherla

26/08/2026

ఏం బ్రహ్మారెడ్డి…! 😏

మేము చేసిన అభివృద్ధి చూడటానికి నువ్వు రెడీనా?
చూపించడానికి మేము రెడీ! 🔥

అంత ఎందుకు బ్రహ్మారెడ్డి… నిన్నగాక మొన్న మా జగనన్న ప్రభుత్వంలో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గంలో నిర్మించిన గ్రామ సచివాలయాలు గుర్తులేవా?

గ్రామ సచివాలయాల పేరు మార్చింది మర్చిపోయావా? 😏

రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరో మర్చిపోయావా?

ఇప్పుడు నువ్వు ఊరు వాడ తిరుగుతూ ప్రయాణిస్తున్న రోడ్లు… సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన నేషనల్ హైవేలు… ఇవన్నీ మర్చిపోయావా బ్రహ్మారెడ్డి? 😂

పేర్లు మార్చడం సులువు…

కానీ అభివృద్ధి చేసి ప్రజలకు చూపించడం అంత సులువు కాదు..! 💥

ఎవరు పనిచేశారు… ఎవరు పేరు మార్చుకున్నారు! 🫵🔥

మాచర్ల ప్రజలకు తెలుసు..!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన వై.యస్.ఆర్ సీ...
25/08/2026

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన వై.యస్.ఆర్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తనయుడు శ్రీ పిన్నెల్లి గౌతమ్ రెడ్డి గారు.!




ఓం నమః శివాయ 🙏తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారిని(శివుడు) శ్రీ అపీతకుచాంబ...
23/08/2026

ఓం నమః శివాయ 🙏

తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారిని(శివుడు) శ్రీ అపీతకుచాంబ (ఉన్నాములై అమ్మన్) అమ్మ వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వై.యస్.ఆర్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తనయుడు శ్రీ పిన్నెల్లి గౌతమ్ రెడ్డి గారు.!




మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన కేతావత్ శీను నాయక్ కుమార్తె శాలిని వివాహ ...
21/08/2026

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన కేతావత్ శీను నాయక్ కుమార్తె శాలిని వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తనయుడు శ్రీ పిన్నెల్లి గౌతమ్ రెడ్డి గారు..!!




ఇంకెన్నాళ్లు ఈ చిల్లర, శవ రాజకీయాలు చేస్తావు బ్రహ్మారెడ్డి..?👉నువ్వు పెంచి పోషించే నెల జీతగాళ్లతో ఇంకెన్ని రోజులు తప్పుడ...
13/08/2026

ఇంకెన్నాళ్లు ఈ చిల్లర, శవ రాజకీయాలు చేస్తావు బ్రహ్మారెడ్డి..?

👉నువ్వు పెంచి పోషించే నెల జీతగాళ్లతో ఇంకెన్ని రోజులు తప్పుడు ప్రచారం చేయిస్తావు..?

👉ఈ హత్య ఘటనతో ఎటువంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరులపై బురద చల్లడమే పనిగా పెట్టుకుని గత ఐదు రోజులుగా తప్పుడు ప్రచారం చేయిస్తున్న జులకంటి..!

👉అయ్యా బ్రహ్మారెడ్డి...ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది కదా. ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉందో తేల్చి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రయత్నించు.

👉అంతేకానీ, చేతకాని దద్దమ్మలా నీ జీతగాళ్లతో ఎలాంటి నిజాలు, ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయిస్తూ పబ్బం గడుపుకోవడం ఎందుకు బ్రహ్మారెడ్డి?

👉నువ్వు, నీ అనుకూల ఎల్లో మీడియా, నువ్వు పెంచి పోషించే జీతగాళ్లు ఎంత విషప్రచారం చేసినా మాచర్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.

👉ఈ హత్యకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి. అప్పుడు మాట్లాడుకుందాం బ్రహ్మారెడ్డి.నువ్వు చేసిన ప్రతి తప్పుడు ప్రచారానికి తగిన సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది.

11/08/2026

మా పార్టీ యువ నాయకుడు,నా తమ్ముడు నవులూరి చెన్నారెడ్డి మరణం పార్టీకి తీరని లోటు.

చెన్నారెడ్డి హత్య ఘటనను అడ్డుపెట్టుకుని ఎల్లో మీడియా,పత్రికలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయంగా పిన్నెల్లి సోదరులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదు.

ఈ హత్య వెనుక ఉన్న కుట్రను పోలీసులు ఛేదించి, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

- శ్రీ కారుమూరు వెంకట రెడ్డి గారు,
వై.యస్.ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.

మాచర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు.. కార్యకర్తల గోడు అధిష్ఠానం దాకా!మాచర్ల టీడీపీలో లోలోపల అసంతృప్తి పెరుగుతోందనే చర్చ ఇప్ప...
10/08/2026

మాచర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు.. కార్యకర్తల గోడు అధిష్ఠానం దాకా!

మాచర్ల టీడీపీలో లోలోపల అసంతృప్తి పెరుగుతోందనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లినా పెద్దగా పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.కనీసం శుభకార్యాలకు ఆహ్వానం పలికినా సరిగా స్పందించడం లేదని కొందరు కార్యకర్తలు వాపోతున్నారట.

ఇక అవినీతికి, అక్రమాలకు తావులేదని చెప్పే పార్టీ,నాయకత్వంలోనే.. మట్టి, రేషన్ బియ్యం, అంగన్వాడీ కోడిగుడ్ల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ సొంత పార్టీ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారని మాచర్లలో హాట్ టాపిక్‌గా మారింది.

స్థానికంగా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని భావించిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు చివరకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారట.మాచర్లలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఇప్పటికే చంద్రబాబు లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లామని కొందరు కార్యకర్తలు చెప్తున్నారు..

మాచర్ల టీడీపీ కి సంబంధించి త్వరలోనే మేము శుభ వార్త వింటామని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారట.

ఇదిలా ఉండగా..EVM ఎమ్మెల్యే జూలకంటి పదవీకాలం రెండేళ్లు కూడా పూర్తి అయ్యి కాక ముందే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ విషయంలో మార్పులు ఉండొచ్చనే ప్రచారం కూడా మొదలైంది. మరో ఏడాదిలో కొత్త టీడీపీ ఇన్‌చార్జిని తీసుకొస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుందట.

మరోవైపు, తమకు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా, కొన్ని పత్రికలను ఉపయోగించుకుని యరపతినేనికి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తూ రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారట.

మొత్తానికి మాచర్ల టీడీపీలో ప్రస్తుతం అసలు ఏం జరుగుతోందనే చర్చే ఎక్కువగా కనిపిస్తోంది.

కార్యకర్తల ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేస్తుంది?
ఎవరిపై చర్యలు తీసుకుంటుంది?నిజంగానే కొత్త ఇన్‌చార్జిని తీసుకొస్తారా?

ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు మాచర్ల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

10/08/2026

🚨 బిగ్ బ్రేకింగ్ | మాచర్లలో బిగ్ పాలిటిక్స్

మధుబాబుకు చంద్రబాబు ఫోన్..?

మాచర్ల రాజకీయాలపై ఆరా!

అమరావతి: మాచర్ల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత చిరుమామిళ్ల మధుబాబుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

🔴 మాచర్లలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ?
🔴 నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా?
🔴 ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై వివరాలు తెలుసుకున్న చంద్రబాబు?
🔴 స్థానిక రాజకీయాలపై మధుబాబు నుంచి సమాచారం తీసుకున్నట్లు సమాచారం

మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చంద్రబాబు–మధుబాబు ఫోన్ సంభాషణ ఇప్పుడు మాచర్ల టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

👉 అసలు ఏం జరిగింది?
👉 మాచర్లపై చంద్రబాబు ఎందుకు ఫోకస్ పెట్టారు?
👉 ఈ ఫోన్ కాల్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి?

మాచర్ల రాజకీయాల్లో తదుపరి అడుగు ఏంటి అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Address

వెల్దుర్తి
Macherla

Website

Alerts

Be the first to know and let us send you an email when Pinnelli Digital Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share