
16/09/2025
*విద్యార్థులకు పండగే పండుగ.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం*
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతి పెద్ద పండగ. ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం చాలా వెయిట్ చేస్తుంటారు.
ఈ క్రమంలో వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు.
ఇటు తెలంగాణలోనూ ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అధికారికంగా మొత్తం 13 రోజులపాటు పండగ సెలవులిచ్చారు. వచ్చే నెల 4న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. పెద్ద మొత్తంలో సెలవులు ఉండటంతో హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లి హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేస్తారు....