30/11/2024
కృష్ణా జిల్లా మచిలీపట్నం...
సమగ్ర కుల గణాంకై డిప్యూటి కలెక్టర్ శ్రీదేవి కి మెమొరండం అందజేసిన కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ సంఘం
బ్రిటిష్ కాలం నుంచి ఏర్పడిన కులగణన జనగణన లెక్కలను ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేయాల్సి ఉండగా జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగడం లేదని వెనుకబడిన ఓబీసీలను అణిచివేతకు గురిచేస్తూ సమాజంలో అట్టడుగుకు నెట్టివేశారన్నారు.
కులగణన వెనువెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలక్టరేట్లో మీ కోసంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి కి మెమొరాండం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అందే జగదీష్ మరియు కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ,ఈడే వెంకట దాసు,బోలెం వేంకటేశ్వర రావు, బొర్రా కాశీ,జోగి కొండా, జొన్నలగడ్డ కొండలరావు, ,యార్లగడ్డ ఆనంద్,వీరంకి రాము,పరసా సురేష్,బొగిరెడ్డి దుర్గ రావు,వెంకటేశ్వరరావు టి రాజ్యలక్ష్మి, ఎం దేవిక ఎం భాస్కర్ ఆంజనేయులు కే కిషోర్ ఎన్ వెంకట సూర్య బాబు,పెద్ది బోయీన నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.