09/10/2025
వర్ల రామయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన బోనాసి జాన్ బాబు
- క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని వినతి
- పార్టీ కి సేవలు అందిస్తున్న వారికి క్రైస్తవ కమిటీల లో ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థన
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు గురువారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పార్టీ అనుబంధ కమిటీ ల ఎన్నికల చైర్మన్ వర్ల రామయ్య ను మదనపల్లి క్రైస్తవ విభాగం నాయకులు, మాజీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాసి జాన్ బాబు మర్యాద పూర్వకంగా కలుసు కున్నారు. అలాగే ఆయనకు శాలువ కప్పి, పుష్ప గుచ్చం అందించి సన్మానించారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎండి డాక్టర్ అమ్మలపూడి శేఖర్ ను మర్యాదపూర్వకంగా కలుసు కున్నారు. వారికి పుష్ప గుచ్చం అంద జేశారు. క్రైస్తవుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి వాటిపై సానుకూలంగా స్పందిస్తూ పరిష్కారం చేయాలని కోరారు. ఈ సందర్బంగా జాన్ బాబు మాట్లాడుతూ క్రైస్తవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వర్ల రామయ్య దృష్టి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. మదనపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహాయ సహకారాలతో క్రైస్తవులు అన్ని విధాల అభివృద్ధి కి నోచుకోవడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల చేయాలని, క్రైస్తవులకు సమాధుల తోట లకు స్థలాలను కేటా యించాలని అభ్యర్థించారు. అదే క్రమంలో చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే విధంగా సహక రించాలని, పవిత్ర
ఎరుషలేము యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అనుబంధ విభాగాలలో క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి క్రైస్తవులను చేరువ చేయడానికి మదనపల్లి నియోజకవర్గంలో గట్టి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం లో క్రైస్తవులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రయోజనాలను తెలియజేస్తు అవగాహన పెంచుతున్నట్లు చెప్పారు. కాగా తమ అభ్యర్థన పైన వర్ల రామయ్య సాను కులంగా స్పందిస్తూ క్రైస్తవ విభాగం లో సమస్యలను ప్రభుత్వము మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా క్రైస్తవ అనుబంధ కమిటీల నియామకాలలోను పార్టీ విధేయులకే ప్రధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారన్నారు.