
02/11/2022
ఈరోజు విడుదల కానున్న న్యూ అవతార్ 2 ట్రైలర్ రిలీజ్...
the way of water avatar 2: ఈరోజు సాయంత్రం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు చేసిన అవతార్ సినిమా యొక్క సెకండ్ పార్ట్ న్యూ అవతార్2 ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.
ప్రపంచ ప్రజలందరూ జేమ్స్ కెమరూన్ నిర్మించిన ఈసినిమా కు ఫిదా అయిపోయారు, ఇది విజువల్ వండర్ క్రియేట్ చేసింది.
2009 లో విడుదలైన అవతార్ మూవీ ప్రపంచ థియేటర్లలో అధిక వసూళ్లు చేసింది, 13 సంవత్సరాలుగా ఈ సినిమా కలెక్షన్లను ఇతర ఏ సినిమా దాటలేకపోవడం గమనార్హం.
ఇప్పుడు అవతార్ 2 పై ప్రేక్షకుల అంచనాలు అంతేభారీగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు న్యూ అవతార్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.
"అవతార్ ది వే ఆఫ్ వాటర్" డిసెంబర్16- 2022 తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.