11/12/2025
🌎 LN – US Tour Day - 5
📰 Press Release – 1
ఆంధ్రప్రదేశ్‌లో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించండి – మంత్రి నారా లోకేష్
బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేష్ భేటీ
టొరంటో (కెనడా):
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (Business Council of Canada – BCC) అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో టొరంటోలో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
లోకేష్ గారు మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ పాలనా అనుభవం, సైబరాబాద్ వంటి నగరాల నిర్మాణంలో చూపిన దూరదృష్టి, మంచి పాలన వల్ల గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు ₹20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర పెట్టుబడి వాతావరణాన్ని వివరించిన లోకేష్ గారు ముఖ్యాంశాలు:
• 1053 కిమీ విస్తీర్ణ తీరరేఖ, సమగ్ర లాజిస్టిక్స్ నెట్వర్క్
• విశాలమైన రోడ్లు, రైల్వే కనెక్టివిటీ
• 6 ఆపరేషనల్ పోర్టులు + 6 ఎయిర్‌పోర్టులు
• త్వరలో ప్రారంభం కాబోయే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, కొత్తగా పూర్తవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు
• VCIC – Visakhapatnam–Chennai Industrial Corridor లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైన భూమి & మౌలిక సదుపాయాలు
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి గ్లోబల్ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని,
టీసీఎస్, కాగ్నిజంట్ వంటి ఐటి సంస్థలు, డేటా సెంటర్లు రావడంతో విశాఖపట్నం విశ్వనగరం స్థాయికి ఎదుగుతోందని తెలిపారు.
“ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం” అని పేర్కొంటూ, కెనడియన్ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు.
⸻
గోల్డీ హైదర్ స్పందన
గోల్డీ హైదర్ మాట్లాడుతూ…
తమ సంస్థ కెనడాలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల సీఈవోలు, వ్యాపారవేత్తలతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థ, పోటీతత్వం, గ్లోబల్ ప్రతిష్ట బలోపేతానికి కృషి చేస్తోందని తెలిపారు.
150కు పైగా సంస్థలు BCCలో భాగస్వాములుగా ఉన్నాయని, ఇవి కలిపి 1.7 మిలియన్ కెనడియన్లకు ఉపాధి కల్పిస్తూ, దేశ GDPలో గణనీయమైన వాటా కలిగి ఉన్నాయని వివరించారు.
BCC ప్రధాన ఫోకస్ రంగాలు:
• పన్ను సంస్కరణలు
• ఆర్థిక క్రమశిక్షణ
• పెట్టుబడుల ఆకర్షణ
• వాణిజ్యం & అంతర్జాతీయ సంబంధాలు
• USMCA, CPTPP వంటి వాణిజ్య ఒప్పందాల పురోగతి
• సరఫరా దారుల బలోపేతం
• AI వినియోగం, సైబర్ సెక్యూరిటీ, టెక్ ఆధారిత ఉత్పాదకత
• క్లీన్ టెక్నాలజీ, కార్బన్ ప్రైసింగ్ ఫ్రేమ్‌వర్క్
• నిలకడైన వనరుల అభివృద్ధి
అలాగే G7, B20, World Economic Forum వంటి వేదికల్లో కెనడియన్ వ్యాపార ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కెనడియన్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తమవంతు సహకారం అందిస్తామని గోల్డీ హైదర్ భరోసా ఇచ్చారు.