02/10/2025
*మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు.*
*అమరావతి:*
అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ముందు నడిచి కోట్లాది భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించిన గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తుదిశ్వాస వరకు దేశం కోసం సేవలందించిన నిస్వార్థ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అని, నీతికి, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశ అభ్యున్నతికి అందించిన సేవలను స్మరించుకుందాం అని పిలుపునిచ్చారు.