భగవద్గీత

భగవద్గీత కృష్ణం వందే జగద్గురూమ్

భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము. ఇది పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

భగవద్గీత పేజీ సభ్యులకు నమస్కారం..🙏 ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ పిల్లల శ్రీ కృష్ణుని అలంకరణ ఫోటోలు మాకు పంపగ...
15/08/2025

భగవద్గీత పేజీ సభ్యులకు నమస్కారం..🙏
ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ పిల్లల శ్రీ కృష్ణుని అలంకరణ ఫోటోలు మాకు పంపగలరు. వాటిలో క్లారిటీగా ఉన్నవి మన భగవద్గీత Instagram & Facebook పేజీలల్లో పోస్ట్ చేయబడతాయి..

మీ అబ్బాయి/అమ్మాయిల మంచిగా ఉన్న ఫోటో ఒకటి మాత్రమే పంపండి.

ముఖ్య గమనిక: ఫొటోతో పాటు పేరు, ఊరు తప్పక రాసి పంపినవి మాత్రమే స్వీకరించడం జరుగుతుంది.

జన్మాష్టమి శుభాకాంక్షలు..💐💐💐🚩🚩

జన్మాష్టమి శుభాకాంక్షలు..💐💐💐🚩🚩

కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తుంది. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దే...
15/08/2025

కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తుంది. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారు. అయితే కొన్ని ఆలయాలలో జన్మాష్టమి, మరింత సంబరంగా సాగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా తపించిపోతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు ఇవిగో...

ఉడిపి

ఉడిపి (కర్ణాటక)లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. అందుకని ఎక్కడెక్కడి వైష్ణవులో ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇక జన్మాష్టమి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు.

ద్వారక

ద్వారక అంటే మోక్షాన్ని కల్పించే ద్వారం అన్న అర్థమట. సాక్షాత్తు ఆ కృష్ణుడు పాలించిన ఈ రాజ్యంలో ‘ద్వారకాధీశుని’ పేరుతో కృష్ణుని ఆలయం ఉంది. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలోని స్వామివారికి షోడశోపచారాలు చాలా వేడుకగా జరుగుతాయి. అర్థరాత్రి 11 గంటలకు స్వామివారిని ఉత్సవభోగం పేరుతో ఆడంబరంగా అలంకరిస్తారు. ఆ సమయంలో భక్తులు ఎవ్వరినీ దర్శనానికి అనుమతించరు. ఆ భోగం ముగిసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం లబిస్తుంది. ఇక ఆలయం వెలుపల కూడా భక్తుల దర్శనాదర్థం, బాలకృష్ణుని ఊయలలో ఉంచుతారు.
గోవా
గోవాలో పోర్చుగీసు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హిందువుల శాతం కాస్త తక్కువే! కానీ కృష్ణాష్టమి వచ్చిందంటే మాత్రం... గోవా యావత్తూ రంగులమయం అయిపోతుంది. అందుకు కారణం లేకపోలేదు. గోవాలో ఉండే కొద్దిమంది హిందువులకూ అక్కడి కృష్ణాలయం అంటే చాలా ఇష్టం. శతాబ్దాల తరబడి ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ఆ ఆలయంలోని విగ్రహాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు. గోవా రాజధాని పానాజీకి సమీపంలోని మాషెల్‌ అనే పట్నంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే... ఇక్కడ అంతరాలయంలో విగ్రహం దేవకీమాత కృష్ణుని ఎత్తుకున్నట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం ఉండే ఆలయం ఇది ఒక్కటే!

బృందావన్‌

కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిందీ, రాసలీలలు సాగించిందీ ఇక్కడే. జన్మాష్టమి సందర్భంగా ఈ బృందావనం అంతా రాసలీలల ప్రదర్శనలతో సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా బృందావనం సమీపంలోని మధువన్ అనే యమునాతీరంలో కృష్ణుడు రాసలీలలు చేశాడని నమ్మకం. ఇప్పటికీ అక్కడ రాత్రివేళలలో ఆ కన్నయ్య రాసలీలలు చేస్తూ దర్శనమిస్తాడట. జన్మాష్టమి సందర్భంగా ఈ మధువన్‌ అంతా నృత్యసంగీతాలతో హోరెత్తిపోతుంది. కానీ రాత్రివేళ మాత్రం కృష్ణుని ఏకాంతానికి భంగం కలగకుండా నిశ్శబ్దంగా మారిపోతుంది.

మధుర

దేశమంతా కృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిగితే... ఆయన జన్మించిన ప్రదేశంలో ఇంకెంత వేడుకగా సాగాలి. మధురలో ఆయన జన్మించిన చోటుగా భావించే ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ ఆలయంలో ఈ పండుగ చాలా ఆర్భాటంగా జరుగుతుంది. జన్మాష్టమి సందర్భంలో మధురలోని ఆలయాలు అన్నింటికీ ఒకే రంగుని వేస్తారట. ఈ పండుగనాడు స్వామివారికి 56 నైవేద్యాలు (చప్పన్నభోగం) అందించడం మరో విశేషం.

ఇవే కాదు... గురువాయూరు, నవద్వీప్, పూరీ వంటి అనేక పుణ్యక్షేత్రాలలో జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏



జై శ్రీకృష్ణా!

రేపు జరగబోయే జన్మాష్టమి పండగ (16-08-2025) సందర్భంలో, శ్రీకృష్ణుడిని ఇంటి చంటిబిడ్డగా భావించి జన్మాష్టమి వేడుకలు జరపాలి. ...
15/08/2025

రేపు జరగబోయే జన్మాష్టమి పండగ (16-08-2025) సందర్భంలో, శ్రీకృష్ణుడిని ఇంటి చంటిబిడ్డగా భావించి జన్మాష్టమి వేడుకలు జరపాలి. శ్రీకృష్ణుడి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం వలన ఈ పండగ కళ మరింత పెరుగుతుంది. కృష్ణుడు తన అవతారంలో స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్తగా భారత సంస్కృతిని, మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేసాడు. అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా..
పలు రకాల పేర్లతో శ్రీ కృష్ణుడిని మనం పిలుస్తూ ఉంటాం. చెడును అంతమొందించి, మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు.

తన అల్లరి చేష్టలతో విసుగుపుట్టించినా ఆ చిలిపి కృష్ణుడంటే వయసులో ఉన్న ఆడపిల్లలకు, పెద్దవాళ్లుకు, చిన్నవాళ్లకు సైతం అందరికీ ఇష్టమే.
ఆ అల్లరి కృష్డుడు అవతరించిన రోజే "శ్రీ కృష్ణాష్టమి". ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు, అప్పుడు ఆయనకు నచ్చే పెట్టే నైవేద్యాలు, పూజలు, అలంకరణలు ముఖ్యమైన వాటిని తెలుసుకోని ఆయన కృపకు పాత్రులు అవుదాం.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏



జై శ్రీకృష్ణా!

స్వాతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు..  Happy Independence Day 💐💐💐 🇮🇳 💐💐 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳                                 ...
15/08/2025

స్వాతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలు..

Happy Independence Day

💐💐💐 🇮🇳 💐💐
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

అప్పు (ఋణం) అనేది ఆర్థిక భారం. దీనిని పూర్తిగా తీర్చకుండా కొంత మిగిల్చితే, అది వడ్డీతో మళ్లీ పెరిగి మరింత భారం అవుతుంది....
14/08/2025

అప్పు (ఋణం) అనేది ఆర్థిక భారం. దీనిని పూర్తిగా తీర్చకుండా కొంత మిగిల్చితే, అది వడ్డీతో మళ్లీ పెరిగి మరింత భారం అవుతుంది. కాబట్టి, అప్పును పూర్తిగా తీర్చేయాలి.

రోగం, వ్యాధిని పూర్తిగా నయం చేయకుండా కొంత శేషం వదిలితే, అది మళ్లీ తీవ్రమవుతుంది. వ్యాధిని అశ్రద్ధ చేస్తే అది దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. అందుకే పూర్తి చికిత్స అవసరం.

విరోధులు, శత్రుత్వాన్ని పరిష్కరించకుండా వదిలేస్తే, అది మళ్లీ ఎదురుదెబ్బ తగిలించే అవకాశం ఉంటుంది. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించడం లేదా శత్రుత్వాన్ని పూర్తిగా అంతం చేయడం చాలా ముఖ్యం.

జ్ఞాతులు ఇక్కడ "జ్ఞాతులు" అంటే బంధువులు లేదా సన్నిహితులను సూచిస్తుంది. బంధుత్వంలో సమస్యలు లేదా అపార్థాలను పూర్తిగా పరిష్కరించకపోతే, అవి మళ్లీ పెరిగి సంబంధాలను దెబ్బతీస్తాయి.

ఈ విషయాలన్నింటినీ పూర్తిగా తొలగించకపోతే, అవి తిరిగి పెరిగి మరింత హాని కలిగిస్తాయి. ఉదాహరణకు, ఒక చిన్న అప్పు పెద్ద అప్పుగా, చిన్న వ్యాధి తీవ్ర వ్యాధిగా, చిన్న విరోధం పెద్ద శత్రుత్వంగా మారవచ్చు.
ఈ సమస్యలను పూర్తిగా తొలగించాలి, ఏదీ మిగలకుండా చూసుకోవాలి. సగం సగం పరిష్కరించడం వల్ల సమస్యలు మళ్లీ తలెత్తుతాయి.

🙏 జై శ్రీ కృష్ణ 🚩

🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
.......................................
:: 👇 ::

:
💕

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

Jai SriKrishna 🪈🚩
14/08/2025

Jai SriKrishna 🪈🚩

13/08/2025

Jai SriKrishna 🪈🚩

నిజంగా ఇక్కడ బ్రహ్మ  జగత్తు అనేవి రెండు లేవు. ఉన్నదొక్కటే. అదే సరైన దృష్ఠితో చూస్తే బ్రహ్మ. భ్రమలో ఉండి చూస్తే జగత్తు. వ...
13/08/2025

నిజంగా ఇక్కడ బ్రహ్మ జగత్తు అనేవి రెండు లేవు. ఉన్నదొక్కటే. అదే సరైన దృష్ఠితో చూస్తే బ్రహ్మ. భ్రమలో ఉండి చూస్తే జగత్తు. వెలుగులో చూస్తే అది త్రాడే. కాని చీకటిలో చూచినప్పుడు పాము అని భ్రమ పడతాం. అంతేగాని అక్కడ రెండు లేవు. నిజంగా మనం పామును చూస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నది త్రాడే. త్రాడు సత్య వస్తువు. పాము మిధ్యా వస్తువు.

అలాగే ఇక్కడ మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ అసలు సత్యం అది బ్రహ్మమే. బ్రహ్మము అనేది ఎటువంటి మార్పులు లేనిదీ, అంతటా వ్యాపించియున్నది. అన్నింటా వ్యాపించియున్నది - చావు - పుట్టుకలు లేనిది; అయితే ఉన్నది ఉన్నట్లు చూచే దృష్ఠి లేనప్పుడు మనం దీనిని *ప్రపంచంగా* భావిస్తున్నాం. దీనిని చూచే మన ఇంద్రియాలు మార్పులతో కూడుకున్నవి గనుక అవి స్థిరమైన సత్యాన్ని తెలుసుకోలేక - మార్పులతో కూడిన జగత్తుగా చూస్తున్నవి. మారుతూ ఉండే ఈ జగత్తుని - ఇందులోని మార్పులు చెందే వస్తువులను, పరిమిత వస్తువులను చూస్తూ వాటి మోహంలో బుద్ధి ఇరుక్కుపోయి అసలు సత్యాన్ని గమనించటం లేదు.

🙏 జై శ్రీ కృష్ణ 🚩

🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
.......................................
:: 👇 ::

:
💕

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

అనాటి క్యాలండర్..🤗మన దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 సంవత్సరం నాటి క్యాలండర్ 78 సంవత్సరాల క్రితం ఇదే రోజు మాత్రమే కాక నేల...
10/08/2025

అనాటి క్యాలండర్..🤗
మన దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 సంవత్సరం నాటి క్యాలండర్ 78 సంవత్సరాల క్రితం ఇదే రోజు మాత్రమే కాక నేలంతా రోజులు, వారాలు అన్ని ఇప్పటి క్యాలండర్ లో అప్పటి లాగే ఉంది.

అవమానం చేసిన వారిని, అవహేళన చేసినా వారిని సమయం సరిగ్గా ఎంచుకుని, సంయమనం పాటించి బుద్ధిపూర్వకంగా సమాధానం చెప్పడం ముఖ్యం. ...
10/08/2025

అవమానం చేసిన వారిని, అవహేళన చేసినా వారిని సమయం సరిగ్గా ఎంచుకుని, సంయమనం పాటించి బుద్ధిపూర్వకంగా సమాధానం చెప్పడం ముఖ్యం. ఇది మనలోని వివేకం యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది.

🙏 జై శ్రీ కృష్ణ 🚩

🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
.......................................
:: 👇 ::

:
💕

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

మనిషి తన జీవిత విధానాన్ని గీతలో శ్రీకృష్ణుని గొప్ప బోధనలు విని ఒక వ్యక్తి పూర్తిగా తనను తాను మార్చుకొని తన ఊరి ప్రజలందరి...
09/08/2025

మనిషి తన జీవిత విధానాన్ని గీతలో శ్రీకృష్ణుని గొప్ప బోధనలు విని ఒక వ్యక్తి పూర్తిగా తనను తాను మార్చుకొని తన ఊరి ప్రజలందరినీ ఉన్నత మార్గంలోకి నడిపించడం మొదలెట్టగలడు. కృష్ణుడు అర్జునికి గీతా సారాంశ బోధన ద్వారా ఒక విశ్వాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఎంతో మందిలో మార్పును సృష్టించాడు. అంటే ఆయన ఈ ప్రపంచంలో ఓ గొప్ప మార్పుకు నిరంతరం కారణమవుతూనే ఉంటాడు. అతని సందేశాలు యుగాలు మారినా శాశ్వతంగా ఈ ప్రపంచ గతిని ఉన్నత దిశగా నడిపిస్తూనే ఉంటాయి.
🙏 జై శ్రీ కృష్ణ 🚩

🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
.......................................
:: 👇 ::

:
💕

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

వందలకొద్దీ వేర్వేరు పేర్ల గల వ్యక్తులు మీలో ఉంటారు. మీలో ఉన్న ఆ ఇద్దరినీ, ఏ పేర్లతో మీలో దాగి ఉండి మిమ్మల్ని నడిపిస్తున్...
09/08/2025

వందలకొద్దీ వేర్వేరు పేర్ల గల వ్యక్తులు మీలో ఉంటారు. మీలో ఉన్న ఆ ఇద్దరినీ, ఏ పేర్లతో మీలో దాగి ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారో తెలుసుకోండి.
కొందరిలోని ఆ ఇద్దరి పేర్లలో ఒకటి ఆశావాది మరొకటి నిరాశావాది.
ఇంకొందరిలోని వారి పేర్లు, జ్ఞాని. అజ్ఞాని. మరికొందరిలో ఒకడి పేరు నమ్మకం మరొకడి పేరు అపనమ్మకం.
ఇంకొందరిలో ఉత్సాహవంతుడు, బద్ధకస్థుడు.
ఇలా...
వందలకొద్దీ వేర్వేరు పేర్ల గల వ్యక్తులు మీలోనూ ఉంటారు. మీలో ఉన్న ఆ ఇద్దరినీ, ఏ పేర్లతో మీలో దాగి ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారో తెలుసుకోండి. నీ బుద్ధి నీ మనసుకు ఏ పని చేస్తే అదే నీ మనసు చేస్తుంది. అదే నీ మనసు ఏ పని చెయ్యమని చెబితే అదే పనిని నీలోని ఆ ఇద్దరూ చేస్తారు. ఆ ఇద్దరి పనివాళ్ళ చేష్టలే నీ భవిష్యత్తును నిర్ధారిస్తుంది. ఈ విధంగా నీ భవిత మొత్తం నీలో నీ ఆ ఇద్దరి మీదనే ఆధారపడి ఉంటుంది. నీవు చేయాల్సిందలా నీలో ఆ ఇద్దరూ ఏ ఏ రూ పాలతో ఉన్నారో కనిపెట్టె వాళ్ళలో ఒకడిని మార్చుకోవడమే. జీవితాన్ని మార్చుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి సాధువుల దగ్గర ఉపదేశాలు వినాల్సిన అవసరం లేదు. నీ గురించిన అంతఃజ్ఞానంనీకు ఉంటే చాలు. నీవు పొందాలనుకున్న ఉన్న త విజయాలు, మహోన్నత జీవన విధానం, ఎల్లలు లేని ఆనందం. ఇవన్నీ కేవలం నీలో ఉన్న ప్రతికూలమైన 'వాడిని' మార్చుకోవడం ద్వారా లభిస్తాయి. లేదా అనుకూలంగా ఉన్నవాడిని మాత్రమే ఉపయోగించగల్గితే చాలు.. నీవుకోరుకున్నది ప్రతిదీ నీకు సిద్ధిస్తుంది. నీలోని ఆ ఒక్క దుష్టుణ్ణి ఎలా మార్చుకోవాలి, ఎక్కడి నుండి మొదలెట్టాలన్నదే భగవద్గీత సారాంశం.

🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
.......................................
:: 👇 ::

:
💕

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

Address

Jogulamba
Mathura

Telephone

+918333871818

Website

Alerts

Be the first to know and let us send you an email when భగవద్గీత posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to భగవద్గీత:

Share