Apna Medak

Apna Medak Everything about Medak Dist.

30/06/2024
జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులుఆందోళన చేపట్టిన జర్నలిస్టులుపుష్కర విధుల నుంచి ఇద్దరు ఖాకీల తొలగింపు?మెదక్ :...
20/04/2022

జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు

పుష్కర విధుల నుంచి ఇద్దరు ఖాకీల తొలగింపు?

మెదక్ : "మీకు పెన్‌ ఉంటే మాకు గన్‌ ఉంది.." సి ఐ వీరంగం

"ఈయన మీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయండి. పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియాలి.." అంటూ ఓ సీఐ, కాళేశ్వరం వద్ద పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద అధికారిని పుష్కరాల విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలానికి చెందిన ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల పూజలను వీడియో తీశాడు.

అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మొగిలి సదరు జర్నలిస్టును అడ్డుకొని వీడియో తీయొద్దంటూ ఆలయం ఎదుట ఉన్న సీఐ జానీ నర్సింహులు వద్దకు తీసుకొచ్చాడు. ఆలయంలో వీడియో తీయడానికి అనుమతి లేదంటూనే జర్నలిస్టు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను సీఐ బలవంతంగా లాక్కున్నాడు. తాను స్థానిక రిపోర్టర్‌నని మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులంటే ఏమనుకుంటున్నావు.. మీ దగ్గర పెన్‌ ఉంటే.. మా దగ్గర గన్‌ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు జర్నలిస్టులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడు.

దీంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లో ఉన్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫోన్‌ ద్వారా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే వివాదానికి తెరలేపిన సీఐ జానీ నర్సింహులు అక్కడికి చేరుకొని ఇగో అన్న.. నా ఫిర్యాదు.. జరిగిందంతా ఇందులో రాసిన.. వాళ్ల మీద ఎఫ్‌ఐఆర్‌ చెయ్‌ అన్నాడు. ఇందుకు డీఎస్పీ బదులిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాను.. కొద్దిసేపట్లో సార్‌ నిర్ణయం తీసుకుంటారు.. మీరు ఏదైనా చెప్పాలనుంకుంటే ఎస్పీ సంప్రదించండి అని వెల్లడించాడు.

అయినప్పటికీ వినకుండా సీఐ కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి ఫిర్యాదు అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ సురేందర్‌రెడ్డి పుష్కర విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు, ఎస్సై మొగిలిని తొలగించినట్లు అనధికారిక సమాచారం. ఇదిలా ఉండగా సీఐ జానీ నర్సింహులు తీరుపై తెలంగాణ ఆల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నిన్న మెదక్ జిల్లా అసోసియేషన్ కార్యాలయం లో సమావేశం ఏర్పాటు చేశారు. రోజు రోజుకి జర్నలిస్టు ల పై పోలీసులు మరియు రాజకీయ నాయకుల ఆగడాల పై నిరసన తెలిపారు. జర్నలిస్టులు మంచి సమాజం కోసం సమాజం లో జరిగే విషయాల్ని సమాజానికి తెలియ పరచడానికి అహర్నిశలు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నిస్వార్ధంగా సేవలను అందిస్తారు, ఎలాంటి వారి పై ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు సమంజసం అని రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశం గారు మండిపడ్డారు. ఇలాంటి వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశం గారి తి పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు శర్మ, మెదక్ జిల్లా అధ్యక్షులు శివ, జిల్లా ఉపాధ్యక్షులు సలీం, సభ్యులు పాల్గొన్నారు

జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం                                     టి ఏ డబ్ల్యు జే ఏ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేష్ ...
06/04/2022

జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం


టి ఏ డబ్ల్యు జే ఏ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేష్ మీడియా మిత్రుల సమావేశాన్ని మంగళవారం అత్యవసరంగా ఏర్పాటుచేసి ....ఆయన మాట్లాడుతూ....
ప్రజలకు. పాలకులకు మధ్య వారధిలా ఉన్న జర్నలిస్టులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టి ఏ డబ్ల్యు జే ఏయు రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. భక్తుల ఇబ్బందులు తెలుసుకోవడానికి అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టు మిత్రులు కొండపైకి వెళ్తుంటే ఆలయ ఈవో గీతా రెడ్డి అరెస్టు చేయించడం అప్రజాస్వామిక మన్నారు. కొండపైకి జర్నలిస్టులకు అనుమతి నిరాకరించడం అక్కడ జరిగే అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను అనగదొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజలకు పాలకుల పాలనను తెలియజేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే యాదగిరిగుట్ట ఆలయ ఈ ఓ గీతారెడ్డిని విధుల్లో నుండి తొలగించాలని లేని పక్షంలో జర్నలిస్టుల ఐఖ్యతను ప్రభుత్వానికి తెలియజెప్పటం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆలయ ఈ ఓ గీతారెడ్డి జర్నలిస్టుల కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేనట్లయితే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

11/02/2022
TAWJA (తెలంగాణ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్)  నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్ల...
26/11/2021

TAWJA (తెలంగాణ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్) నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారి పి.ఎ, మీడియా పై చేయి చేసుకున్నందుకు పీ ఏ పై తగు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

27/09/2021
07/09/2021

BBG అప్నా తెలంగాణ న్యూస్, అప్నా మహబూబాబాద్, 07/09/2021:-
మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శశాంక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితమ్మ, ఈ కార్యక్రమం లో ఆమె తో పాటు జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా గారు, తెరాస జిల్లా నాయకులు పార్కుల శ్రీనివాస్ రెడ్డి గారు, KSN రెడీ గారు, ముత్యం వెంకన్న గౌడ్ గారు, పొన్నాల యుగేందర్ గారు, సులోచన గారు, బాణోత్ రాము గారు, ప్రభాకర్ గారు తదితరులు పాల్గొన్నారు.

07/09/2021

BBG అప్నా తెలంగాణ న్యూస్, అప్నా మహబూబాబాద్, 07/09/2021:-

కేసముద్రం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతలోపం పై పోన్ లో మాట్లాడిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితమ్మ. గుప్తా..గారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో
అధికారుల పర్యవేక్షణ లోపంతో, నాణ్యత లోపంతో నిర్మాణంలో ఉండగానే ఒక రైల్వేఅండర్ బ్రిడ్జి కూలిపోయిందని కేసముద్రం యంపిపిగారు నా..దృష్టికి ఇపుడే తెచ్చారు.. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోండి.. అంటూ మాహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితమ్మ డిఆర్ఎం ఏ.కే.గుప్తను పోన్ లో ఆదేశించారు. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలోని 76 రైల్వే గేటు వద్ద నిర్మాణ దశలోనే బయటపడ్డ నాణ్యతలోపం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేసముద్రం యంపిపి మాహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్.కవితమ్మ దృష్టికి తేగా ఆమె తక్షణమే స్పందించి సత్వర చర్యలకోసం అధికారులను ఆదేశించారు.

07/09/2021

بی بی جی اپنا تلنگانہ نیوز، اپنا جگتیال _ تلنگانہ کے جگتیال ضلع میں بریج پار کرنے کے دوران باپ اور کمسن بیٹا پانی میں بہہ گئے۔جن میں بیٹے کی نعش برآمد کرلی گئی۔جبکہ باپ کی تلاش جاری ہے یہ حادثہ جگتیال ضلع کے گولہ پلی منڈل کے ترملاپور میں آج صبح پیش آیا۔تفصیلات کے مطابق گولہ پلی منڈل کے نندی پلی سے تعلق رکھنے والا 40 سالہ گنگا ملو اپنے 6 سالہ بیٹے وشنو وردھن کے ساتھ نندی پلی سے ترملاپور جا رہا تھا گذشتہ چند دنوں سے جاری بارش کی وجہ سے ترملاپور کا بریج خطرہ کے نشان سے اوپر بہہ رہا تھا گنگا ملو اپنے بیٹے کے ساتھ موٹر بائیک پر بریج پار کررہا تھا کہ پانی کے تیز بہاو میں یہ دونوں بہہ گئے۔مقامی افراد نے پولیس کو اس کی اطلاع دی۔اور پولیس نے ماہر غوطہ خوروں کی مدد سے باپ اور کمسن بیٹے کی تلاش کی۔جس میں بیٹے وشنو وردھن کی نعش برآمد ہوئی۔باپ کی تلاش جاری ہے..

Address

Medak
502248

Telephone

+919989312502

Website

Alerts

Be the first to know and let us send you an email when Apna Medak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Apna Medak:

Share