Mulugu Social Media

Mulugu Social Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mulugu Social Media, Social Media Agency, Mulugu.

రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే   కేసిఆర్  లక్ష్యం గొప్పది పైలట్ ప్రాజెక్టు లో ములుగు జిల్లాను ఎంపిక...
26/08/2021

రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే కేసిఆర్ లక్ష్యం గొప్పది

పైలట్ ప్రాజెక్టు లో ములుగు జిల్లాను ఎంపిక చేసినందుకు సీఎం గారికి ధన్యవాదాలు
- రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్





రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్టు లో ములుగు జిల్లాను ఎంపిక చేసినందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్య, వైద్య - ఆరోగ్యం పై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు నేడు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో గౌరవ సీఎం కేసిఆర్ గారు హెల్త్ ప్రొఫైల్ చేయడానికి ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ఇందుకు సీఎం గారికి ధన్యవాదాలు. భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు పరీక్షలు చేసి వైద్యం చేయడానికి ఆలస్యం జరగకుండా హెల్త్ కార్డ్ చూసి వెంటనే వైద్యం చేసే విధంగా బాధిత వ్యక్తి సమగ్ర సమాచారం ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ లో పొందుపరుస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. వీటితో పాటు అంగన్వాడి కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. స్కూల్స్, అంగన్వాడి కేంద్రాల ప్రారంభం కోసం తీసుకునే చర్యలపై దృష్టి పెట్టాలి.
ప్రతి పాఠశాల ప్రారంభం చేయాలి.
విద్యార్థులకు రెగ్యులర్ గా ఇచ్చే అన్ని వసతులు అందించాలి. వీటికి సంబంధించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.

సమావేశంలో ఎంపి శ్రీమతి కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య అదనపు కలెక్టర్లు ఆదర్శ సురభి, రిజ్వాన్ పాషా, ములుగు ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు

26/08/2021
26/08/2021

ప్రగతి భవన్ ను అంబేద్కర్ బహుజన భవన్ గా మారుస్తా ఈ భవన్ నుండే IAS, IPS, దేశానికీ ఉపయోగ పడే అధికారులను తయారుచేపిస్తా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా సరే మొదటి సంతకం దళిత, గిరిజన అభివృద్ధి కోసమే :- రేవంత్ రెడ్డి

ఘోర రోడ్డు ప్రమాదంములుగు - 25 ఆగస్ట్ 2021:వరంగల్ జిల్లా లోని ఆరేపల్లీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వ...
25/08/2021

ఘోర రోడ్డు ప్రమాదం
ములుగు - 25 ఆగస్ట్ 2021:
వరంగల్ జిల్లా లోని ఆరేపల్లీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం పై వస్తున్న దంపతులను అరేపల్లీ వద్ద లారీ డీ కొట్టగా వనపాకల అమూల్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త వనపాకల దిలీప్ కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిరువురు
ములుగు జిల్లా లోని మల్లంపల్లి గ్రామానికి చెందిన వాస్తవ్యులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పునప్రారంభం కానున్న పాటశాలల  స్థితి గతుల పై సెల్ కాన్ఫరెన్స్జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య గారి ఆదేశాల మేరకు జిల్లా అద...
25/08/2021

పునప్రారంభం కానున్న పాటశాలల స్థితి గతుల పై సెల్ కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ నుండి సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలాల స్పెషల్ ఆఫీసర్స్ , ఎంపిడి ఓ లు,ఎంపిఒ మరియు సంబంధిత అధికారులు ఈ సెల్ కాన్ఫరెన్సు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో బాగంగా సెప్టెంబర్ 1 నుండి పునప్రారంభం కానున్న పాటశాలల పరిసర ప్రాంతాలు మరియు వాటి స్థితి గతుల పైన ఈ యొక్కసెల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు అంగన్ వాడి కేంద్రాలు, విద్యా సంస్థలు మరియు హాస్టళ్లు ప్రారంభానికి సిద్దం చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసి వాటి ఆచరణలో బాగంగా ముందు ఉండాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్స్ వారివారి పరిధిలోని పాటశాలలు నిర్వహణకు సిద్దంగా ఉన్నాయాని సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. ప్రతి పనికి ముందు పని పూర్తి ఐన తర్వాత ఫోటోలు తీసి పంపాలని అదనపు కలెక్టర్ సూచించారు.క్లాస్ రూమ్స్ ,కిచెన్ షడ్స్ మరియు డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, టాయిలెట్స్ ,మరియు పాటశాల పరిసర ప్రాంతాలు శు భ్రం చేయిoచాలని, వర్షపు నీటి నిలువలు లేకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశాలించారు. ప్రతి మంగళ,శుక్ర వారాలు డ్రై డే గా పాటించాలని వారు అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు వ్యాపించకుండా దోమల మందులను పిచికారి చేయిoచాలి అని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డియర్వో రమాదేవి, మండలాల తహాసిల్దర్స్,మండలాల ప్రత్యేక అధికారులు,ఎంపిడిఓ.,ఎంపీఓ, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

తెరాస కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక సహాయం...ఈరోజు సమ్మక్క సరలమ్మ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామం లో తె...
25/08/2021

తెరాస కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక సహాయం...

ఈరోజు సమ్మక్క సరలమ్మ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామం లో తెరాస నాయకులు వాసం రవి తల్లి అయినా వాసం రాధమ్మ (75) ఇటీవలే అనారోగ్యం తో మరణించడం తో, కాల్వపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ సిద్దబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మృతుని కుటుంబం ని పరామర్శించి, ఓదార్చారు అనంతరం అర క్వింటా బియ్యం,3 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆషాడపు మల్లయ్య, పురుషోత్తం నరసింహులు, సీతక్క యువసేన మండల చేర్ప రవీందర్ లు మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారిని స్ఫూర్తి గా తీసుకొని ఈ కార్యక్రమం చేశామని, ప్రభుత్వం మే మృతుని కుటుంబం కు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు మరియు ఉపాధి కోసం ఎస్టీ కార్పొరేషన్ నుండి ఋణం మంజూరు చేసి కుటుంబం ను ఆదుకోవాలని ప్రభుత్వం ని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడే యాదగిరి, పుల్లయ్య,పుర్రి సమ్మయ్య, సిద్దబోయిన నర్సింగరావు,పురుషోత్తం నారాయణ, రమేష్, కొప్పుల జగన్, ఓదెలు, అంబటి రవి, సుగుణ,బతకయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

25/08/2021

అన్ని వర్గాలకు బందు పథకం
- భవిష్యత్తులో ఇలాంటి పథకాన్ని తెస్తాం
- టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ భేటీలో సీఎం కేసీఆర్‌
- హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు : కేటీఆర్

Address

Mulugu
506343

Website

Alerts

Be the first to know and let us send you an email when Mulugu Social Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mulugu Social Media:

Share