01/04/2023
*మహనీయుల జయంతి’ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి*
*సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్*
*రామగుండం, ఏప్రిల్ 1: మహనీయుల జయంతి ఉత్సవాలను కుల,మత భేద తారతమ్యం లేకుండా పార్టీలకతీతంగా అందరూ భాగస్వాములై ఘనంగా జరుపుకోవాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు . శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం మజీద్ కార్నర్ లో నిర్వహించిన మొదటి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ నవభారత నిర్మాణం కోసం ఎంతో శ్రమించి ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు .కానీ పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల త్యాగాల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఏప్రిల్ 5న బాబుజగ్జీవన్ , ఏప్రిల్14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 3న రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నరసయ్య సమత సైనిక దళ్ పెద్దపల్లి జిల్లా నాయకులు దూట రాజు, దుర్గం కిరణ్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం హౌసింగ్ బోర్డ్ కాలనీ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్,కమిటీ సభ్యులు ఆరుముళ్ళ దుర్గాప్రసాద్, శ్రీనివాస్, ఆరుముళ్ల బాపు, ఆరుముళ్ల సదానందం,గొట్టే తిరుపతి,కల్వల మహేందర్, ముల్కల రాజయ్య,అరుముళ్ల రాజయ్య,ఈదునూరి పోచం, ఒడ్డెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు*