Anagha Media

Anagha Media Videos , Stories And Messages

వెయ్యికాళ్ళ మండపం, తిరుమల లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురు గా ఉండేది ఒకపుడు ...చారిత్రక ఆధారాల ప్రకారం, తిరుమలలోని ఈ వెయ్...
08/06/2026

వెయ్యికాళ్ళ మండపం, తిరుమల లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురు గా ఉండేది ఒకపుడు ...

చారిత్రక ఆధారాల ప్రకారం, తిరుమలలోని ఈ వెయ్యి కాళ్ళ మండపాన్ని సాళువ మల్లయ్య దేవ మహారాయ నిర్మించారు. ఈయన విజయనగర సామ్రాజ్యానికి చెందిన సాళువ వంశపు రాజులలో ఒకరు. క్రీ.శ. 1464 (సుమారు 561 ఏళ్ల క్రితం).
ఆనాటి శాసనాల ప్రకారం, భక్తుల సౌకర్యార్థం మరియు ఆలయ ఉత్సవాల నిర్వహణ కోసం దీనిని అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు.

ఈ మండపంలో వెయ్యి స్తంభాలు ఉండటం వల్ల దీనికి "వెయ్యి కాళ్ళ మండపం" అనే పేరు వచ్చింది. ఈ స్తంభాలపై హిందూ పురాణ గాథలు, దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో సుందరంగా చెక్కబడి ఉండేవి.

ప్రాచీన కాలంలో స్వామివారి ఊంజల్ సేవ, ఇతర ధార్మిక కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి. భక్తులు సేదతీరడానికి కూడా ఇది ప్రధాన ఆశ్రయంగా ఉండేది. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, ఘంటసాల వంటి మహనీయులు ఇక్కడ తమ సంగీత కచేరీలు నిర్వహించేవారు. స్వామివారి ప్రసాదాలు కూడా ఇక్కడే ఇచ్చేవారు.

2003లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 'మాస్టర్ ప్లాన్'లో భాగంగా భక్తుల రద్దీని నియంత్రించడానికి, మరియు బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాలు మాడవీధులలో సులభంగా తిరిగదానికి,భద్రతా కారణాల దృష్ట్యా ఈ చారిత్రక మండపాన్ని తొలగించింది.

ఎంతమంది భక్తులు ఈ మండపం చూశారు..దయచేసి మీ ఆనందాన్ని ఇప్పటివారితో పంచుకోండి

బంగారువాకిలి తాళాలుఅర్చకులు, జియ్యంగార్, ఆలయ అధికారులు , తాళ్లపాకవారు, సన్నిధిగొల్ల, సుప్రభాతసేవా భక్తులు ...... వీళ్లంద...
08/06/2026

బంగారువాకిలి తాళాలు

అర్చకులు, జియ్యంగార్, ఆలయ అధికారులు , తాళ్లపాకవారు, సన్నిధిగొల్ల, సుప్రభాతసేవా భక్తులు ...... వీళ్లందరూ బంగారువాకిలి ముందు చేరి సిద్ధంగా వున్న సమయంలో, ముందుగా అర్చకులు తమ దగ్గరవున్న 'కుంచెకోల'తో బంగారు వాకిలికి గల చిన్నరంధ్రం ద్వారా లోపల వేసివున్న గడియను బయటినుంచే తీస్తారు. పిమ్మట వాకిలి మధ్యలో గడియకు వేయబడియున్న తాళాన్ని అర్చకులు తమ వద్దగల తాళంచెవితో తీస్తారు.

అటు తర్వాత సన్నిధిగొల్ల పేష్కారు దగ్గరగల సీలువైసిన చిన్నసంచి (తిత్తిని) అందరికీ చూపించి దానిని విప్పి, అందులో వున్న తాళంచెవులతో, బంగారు వాకిలికి సీలు వేయబడియున్న మూడు పెద్ద తాళాలను, సీళ్లను అందరికీ చూపించి తీస్తాడు. అర్చకులు జియ్యంగారు ఆలయ అధికారులు - ఈ ముగ్గురి సమక్షంలో గొల్ల బంగారు వాకిళ్లకు వున్న తాళాలను తీస్తాడు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా బంగారు వాకిలి తాళాలు తీయడంకానీ, వేయడంకానీ జరగదు.

08/06/2026

అలిపిరి టోల్‌గేట్ వద్ద అత్యాధునిక స్కానర్లు

కొత్త స్కానర్ల ఏర్పాటు: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల బ్యాగుల తనిఖీల కోసం అలిపిరి టోల్‌గేట్ వద్ద అధునాతన స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి: మొత్తం 6 స్కానర్లకు గాను, ప్రస్తుతానికి 4 స్కానర్లను అమర్చారు.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం, ప్రస్తుతం ఉన్న పాత స్కానర్ల వల్ల తనిఖీలకు ఎక్కువ సమయం పడుతుండటంతో టోల్‌గేట్ వద్ద అప్పుడప్పుడు వాహనాలు నిలిచిపోతున్నాయి.

ఈ సమస్యను అధిగమించడానికి టీటీడీ (తితిదే) 6 స్కానింగ్ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన స్కానర్ల ఏర్పాటుకు ఉపక్రమించింది.

కొత్త స్కానర్ల ద్వారా బ్యాగులలోని సామాగ్రిని అన్ని వైపుల నుండి స్పష్టంగా స్కాన్ చేయవచ్చు. సంచి లోపల ఏ వస్తువులు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.

స్కానర్ కోసం సుమారు రూ. 45 లక్షలు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు.

Tirumala updates18 న శ్రీవారి సేవా టికెట్స్ విడుదల👉తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా...
09/05/2026

Tirumala updates

18 న శ్రీవారి సేవా టికెట్స్ విడుదల

👉తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 18న విడుదల చేయనుంది.

👉 శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.

👉 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం అవకాశం ఉంటుంది. లాటరీలో ఎంపికైన భక్తులు 20వ తేదీనుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరు అవుతాయి.

👉21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవల టికెట్లు విడుదల అవ్వనున్నాయి.

👉23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా అందుబాటులోకి రానుంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోటా.. మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులోకి రానున్నాయని TTD అధికారులు తెలిపారు.

🙏 దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళుతున్నారా…?🎫 ఫ్రీ దర్శనం పూర్తి గైడ్ 2026తిరుపతి వెళ్లే భక్తులకు చాలా ఉపయోగపడే సమాచ...
28/04/2026

🙏 దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళుతున్నారా…?

🎫 ఫ్రీ దర్శనం పూర్తి గైడ్ 2026
తిరుపతి వెళ్లే భక్తులకు చాలా ఉపయోగపడే సమాచారం ఇది. ముందుగా టికెట్ బుక్ చేయకపోయినా ఎలా దర్శనం పొందాలో తెలుసుకోండి 👇

🎫 ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు?

1️⃣ విష్ణు నివాసం (Railway Station దగ్గర)
⏰ ఉదయం 5 AM నుంచి టోకెన్స్ ఇస్తారు.

2️⃣ శ్రీనివాసం (Bus Stand దగ్గర)
⏰ ఉదయం 5 AM నుంచి దర్శనం టోకెన్స్ ఇస్తారు.

3️⃣ భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి దగ్గర)
⏰ ఉదయం 5 AM నుంచి
👉 SSD టోకెన్స్
👉 దివ్య దర్శనం టోకెన్స్ (మెట్లు మార్గం భక్తులకు)

🏨 తిరుమలలో OFFLINE రూమ్స్
📍 CRO Office
⏰ ఉదయం 6 AM – రాత్రి 10 PM వరకు రూమ్స్ ఇస్తారు.

🔐 ఫ్రీ లాకర్స్ లభించే ప్రదేశాలు
• యాత్రి సదన్
• శ్రీ పద్మనాభ నిలయం
• వెంకటాద్రి నిలయం
• విష్ణు నివాసం
• శ్రీనివాసం

🪜 తిరుమల మెట్లు మార్గం సమాచారం

🛕 అలిపిరి మెట్టు మార్గం
⏰ ఓపెనింగ్ : 4 AM – 9:30 PM
👣 మెట్లు : 3550
📏 దూరం : 9 KM
⏱️ సమయం : 3 – 5 గంటలు

🛕 శ్రీవారి మెట్టు మార్గం
⏰ ఓపెనింగ్ : 6 AM – 6 PM
👣 మెట్లు : 2380
📏 దూరం : 2.1 KM

👉 దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నవారు 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించాలి

👶 సుపథం దర్శనం (చంటి పిల్లలతో)
🕛 ప్రతిరోజూ 12 PM – 6 PM వరకు ప్రత్యేక దర్శనం
తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్
• బేబీ Birth Certificate
• తల్లిదండ్రుల ఆధార్
• అన్న/అక్క ఉంటే వారి ఆధార్

🍛 శ్రీవారి నిత్య అన్నదానం
📍 శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రం
🍽️ టిఫిన్ : 8 AM – 10:30 AM
🍛 మధ్యాహ్న భోజనం : 10:30 AM – 4 PM
⏸️ విరామం : 4 PM – 5 PM
🌙 రాత్రి భోజనం : 5 PM – 11 PM

🙏 ఈ సమాచారం తిరుపతి వెళ్లే ప్రతి భక్తుడికి చాలా ఉపయోగపడుతుంది. షేర్ చేసి అందరికీ తెలియజేయండి.

15/02/2026
మాఘ పౌర్ణమి గురు దర్శనం హరిద్వార్ లో
01/02/2026

మాఘ పౌర్ణమి గురు దర్శనం హరిద్వార్ లో

శ్రీ వసంత పంచమి శుభాకాంక్షలు
23/01/2026

శ్రీ వసంత పంచమి శుభాకాంక్షలు

శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద కరకమల సంజాతులుదత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచర్యవర్యశ్రీ దత్త విజయానంద తీర్ధ స్వ...
11/01/2026

శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద కరకమల సంజాతులు
దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచర్యవర్య
శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారి జన్మదినోత్సవము

జ్ఞాన విజ్ఞాన భాస్వంతం సచ్చిదానంద లాలితం
వందే శ్రీ దత్త విజయానంద తీర్ధ గురుం సదా!!

SGS Hanuman Chalisa Parayana 2026
26/12/2025

SGS Hanuman Chalisa Parayana 2026

Address

Mysore

Alerts

Be the first to know and let us send you an email when Anagha Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share