Telugu kavithalu - SP Raj

Telugu kavithalu - SP Raj 'తెలుగు కవితలు' తెలుగు కవుల గురించి మర

https://telugukavithaluspraj.wordpress.com
22/04/2018

https://telugukavithaluspraj.wordpress.com

నీవు నడిచే దారిలో నా కళలను పరిచాను జాగ్రత సూమా, అవి నీ పాదాలను గాయపరుస్తాయేమో...…

22/04/2018

ప్రేమంటే…

ప్రతి మనిషికీ జీవితంలో ప్రేమ కావాలి.

గుండెకు ఊపిరిలా మనసుకు ప్రేమ.

సప్తవర్ణాల్ని తనలో దాచుకుని పైకి మాత్రం శూన్యంలా,

వర్ణ రహితంగా కనిపించేదే ప్రేమ.

ప్రేమలో నిబంధనలు ఉండవు.

ఎల్లలు లేనిది ప్రేమ.

ఆ ప్రేమ ఒక్కలాగే ఉండదు.

ఒక్కరికే పరిమితం కాదు.

తీపి అనే పదం ప్రేమయితే ఆ తీపిలోని రకాలలాగే ప్రేమ భావాలు కూడా.

బెల్లంలోని తియ్యదనం, తేనెలోని మధురత్వం ..

వీటిలా ప్రేమ కూడా రకరకాల మధుర భావాలతో మనసుని నింపుతుంది.

ప్రేమంటే... ఉదయించే వెచ్చదనంలోని వెలుగే కాదు.. అస్తమించాక వచ్చే చల్లని చీకటి కూడా.

ఎన్నెన్నో చినుకులు..నీలాకాశపు గుండెలోని గమ్యం తెలీని వాటి పయనం ..! అవన్నీ భావాలైతే వాటిలో ఏ మూలో దాగి ఉన్న స్వాతిచినుకు ప్రేమ భావం.

ప్రేమంటే ఒక ఆర్ధ్రత. గుండెని సున్నితంగా తాకే భావావేశం..! ప్రేమంటే ఒక స్వచ్ఛత. కనుపాపల లోతుల్లోంచి హృదయాన్ని చూడగల స్పష్టత..!

ప్రేమంటే స్వేచ్చ... తనకి దగ్గరగా ఉంటూనే అంతులేని అంచుల్లోకి వెళ్ళిరాగలంత స్వాతంత్ర్యం.

ప్రేమంటే అవగాహన .. ప్రతి క్షణాన్ని ఎదుటివైపు నుంచీ చూడగల విశ్వసనీయత.

మనకే తెలియని మన ఆలోచనల అయోమాయంలో వెంటాడే ఏకాకితనంలో...మంచు కరిగి సుస్పష్టమైన ప్రకృతిలా ఓ చిరుదరహాసం మన భావోద్వేగాల్ని చీల్చుకుని మనసులో వెదికితే

ఆ గుర్తు ప్రేమదే.

- గీతిక

13/09/2017

'తెలుగు కవితలు' నేను చదివిన కొన్ని కవితల్ని మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే చదువుకోవచ్చు అని
ఇలా....!

ప్రేమ స్పర్ధ :ఒకప్పుడు  తననెంతగానో ఇష్టపడిన మనం ఇప్పుడు తనకి దూరమవ్వాలని ప్రయత్నిస్తాం. తనతో మాట్లాడడానికి సుముకంగా ఉండం...
09/09/2017

ప్రేమ స్పర్ధ :
ఒకప్పుడు తననెంతగానో ఇష్టపడిన మనం
ఇప్పుడు తనకి దూరమవ్వాలని
ప్రయత్నిస్తాం. తనతో మాట్లాడడానికి
సుముకంగా ఉండం. తను గుర్తొస్తే
బాధగా, బరువుగా అనిపిస్తుంది.
కానీ ఒకప్పుడు.. తనతో మాట్లాడాలని
రాలే చినుకులో ఉన్నంత ఆత్రం..!
తనని తలచుకుంటూనే క్షణం క్షణం..
మరి ఇప్పుడు మనమెందుకలా
మారిపోయాం..? మన ప్రేమా
మారిపోమారిపోయిందే..?
సన్నజాజిలా సున్నితంగా ఉండే తను
ఏ చిన్న సంఘటనలోనో కతినంగా
ప్రవర్తించడం మనల్ని బాధపెడుతుంది.
తనతో మన భావాల్ని పంచుకుందామను
కున్నప్పుడు ఆ కటినత్వమే పొరగా
అడ్డం పడుతుంది .
తనమీద ఇదివకటంత ఇష్టాన్ని
చూపించలేం. చూపించాపోయేంతలో ఆ
చిన్న స్పర్దే మదిలో మెదులుతుంది.
ఎగసిన ప్రేమ కరిగిపోతుంది.
మరి దానికి పరిష్కారం ..?
నేస్తం..! మనం తనతో మాట్లడటానికి
ప్రయత్నించబోయేంతలో మన మాటలకి,
మనసుకి అడ్డుపడేది ఆ స్పర్దే కాదు..
‘తనతో నేను మాట్లాడటమా ..’
అన్న అహం కూడా .
ఆ క్షణం మనలో తొంగిచూసే అహాన్నీ,
దానితో పాటూ ‘తను’ మనకు పంచిన
మధురానుభూతుల తలపుల్ని మనం
మనఃసాక్షితో చూడగలిగితే అప్పుడు
ఇక స్పర్ద అనేది ఉండదు.
ఉండేది ప్రేమ ఒక్కటే!
ఆ ప్రేమలో బాధ, బరువు, అహం,
అన్నీ మాసిపోతాయి.
ఆ తేలికైన మనసు మళ్ళీ మళ్ళీ తనని
తలుచుకుంటూనే ఉంటుంది క్షణం
క్షణం...!

నిన్నటంత ప్రేమమొదటిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఉన్న సిగ్గు, బిడియంఇప్పుడు ఏమైపోయాయి? నువ్వు నా చేతిని మొదటిసారి తాకిన...
07/06/2017

నిన్నటంత ప్రేమ
మొదటిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఉన్న సిగ్గు, బిడియం
ఇప్పుడు ఏమైపోయాయి? నువ్వు నా చేతిని మొదటిసారి తాకినప్పుడు
నాలో కలిగిన ఉలికిపాటు ఇప్పుడేది?
సిగ్గు, భయం, కోపంలాగే ప్రేమ కూడా ఒక భావమా?
ప్రేమ కూడా కన్నాళ్ళకి తగ్గిపోతుందా? మరికొన్నాళ్లకి రూపు మాసిపో
తుందా? నీలో నామీది ప్రేమ తగ్గుతుందా? నువ్వు నన్ను మర్చిపో
తావా?
ప్రేమలో .. ప్రేమించడంలో హెచ్చు తగ్గులుంటాయా?
అప్పుడున్నంత ప్రేమ ఇప్పుడు నీలో, నాలో తగ్గిందా? రోజులు
గడిచే కొద్దీ ఆ ప్రేమ తీవ్రత తగ్గుతుందా? ప్రేమించిన మనిషిని అసలెందుకు
దూరం చేసుకుంటాం? అలా చేసేది నిజమైన ప్రేమేనా?
మనం నిజంగా ప్రేమించామేమో ! బహుశా 'ప్రేమించాం' అనుకుంటాం.
ప్రేమించాం కాబట్టి ఇలా ఉండాలి. అలా ఉండకూడదు.ఇది చేయాలి.
అది చేయకూడదు.. అని ఆంక్షలు పెడతాం .ఆంక్షలు పెట్టె మనసులో ప్రేమ
ఉండదు.ప్రేమలేని మనసులో ఏ మధురానుభూతైనా ఎలా ఉంటుంది?
ప్రేమలోని చిన్నచిన్న ఆనందాల్ని పొందలేని మనసు స్వేచ్ఛ కోల్పోయిన
పక్షిలా నిస్సత్తువలో మునిగిపోతుంది.
ఆ నిస్సత్తువలోంచి పుట్టుకొస్తుంది ప్రేమమీద నిరాసక్తత !
కానీ మనలో ఉన్నది ప్రేమే అయితే... మనలో తన తలపులు నిత్యం నూతనంగానే ఉంటాయి. 'తన' సమక్షంలూనే కాదు .. 'తన' ఎడబాటులోనూ 'తను' మనతోనే ఉన్నట్టుంటుంది.
చల్లని ... హాయిగొలిపే చిరుజల్లుల్లోనే కాదు.. మండుటెండలోనూ గుర్తొ
స్తాడు తను.
మన మనసు తొలి సహచర్యంలోని ఉద్వేగాన్ని ఇప్పటి జ్ఞాపకాల్లోనూ
అనుభూతినిస్తుంది.
అప్పుడు నాకు నిన్నటంత .. మొన్నటంత... మన తొలినాళ్ళ తోలినాల్లంత
ప్రేమే ఎప్పటికి కావాలి అనుకోను.
ఇప్పుడు ఈ క్షణం నీ చూపుల్లోంచి. నీ పెదవుల్లోంచి. నీ చేతుల్లోంచి జారే
ప్రతి చిన్నిభావాల్ని ఏరుకుంటాను. క్షణక్షణం అదే ప్రేమ జల్లు నా మీద
కురిపించాలి అనీ, నా ప్రేమాస్వాదనలో నువ్వు తరించాలని,నా కోసం పరి
తపించాలని ఆత్రుత పడతాను
ప్రతి క్షణం ప్రేమలోనే.. ప్రేమతోనే జీవిస్తుంటే ఇక నిన్నటంత ప్రేమ..
మొన్నటంత ప్రేమ...గడిచిన ఘడియంత ప్రేమ... అంటూ ప్రేమని కొలవడా
నికి తావేక్కడ?
అదే కొలతలు లేని ప్రేమ !
-గీతిక.

07/05/2017
కారుమబ్బులు ఆకాశం మోతాన్నీ కమ్మేసినప్పుడు విశ్వమంతా ఆవరించినట్టనిపించే ఆ చీకటి, ఆప్తులందర్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలిన...
16/04/2017

కారుమబ్బులు ఆకాశం మోతాన్నీ కమ్మేసినప్పుడు
విశ్వమంతా ఆవరించినట్టనిపించే ఆ చీకటి,
ఆప్తులందర్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలినప్పుడు
బతకడం కూడా బారమనిపించే ఆ నిస్పృహ, తన
ప్రాణాన్ని పణంగా పెట్టి చావు బతుకులతో పోరాడే
ఓ తల్లి ప్రసవ వేదన ఎంత బారంగా ఉంటాయి !

ఆ క్షణాలు కొన్నే అయినా ఎంత దీర్ఘంగా అనిపిస్తాయి !
భారమైన ఆ క్షణాలన్నీ గడిచిపోయాక?మనం
చెప్పుకున్న కబుర్లు, ఆడుకున్న ఆటలు ఆనందాన్నే
కాదు,మన మనసుల్నీ, మనసులోని భావాల్ని
పంచాయి, పెంచాయి. ఒకరివి ఒకరికి తెలిపాయి.

కానీ ఎందుకో ఈ మద్య ఏ పని చేయ్యనివ్వనంతగా
నువ్వే నా ఆలోచనల్లో !ఎవరితో మాట్లాడుతున్నా
లేదా చదువుతున్నా నువ్వే గుర్తొస్తావ్.
అంతే ! ఇక ఏ పనీ చేయబుద్ది కాదు. ఇలాగైతే ఎలా?
ఇది ప్రేమా ? ఇదే ప్రేమైతే నీకు తెలిపేదేలా?
ఇదంతా నీకు చెప్పాలా ? వద్దా? ఈ సంఘర్షనంతా
‘నీ’ ‘నా’ మధ్యే కదా! మరి నీకు చెప్పకుండా ఉండడం ఎలా?
అలాగని నేనే నోరు తెరచి చెప్పడం ఎలా?
‘నువ్వంటే ఇష్టమని... ఇష్టానికి మించి ఇంకేదో...’అని
నీ ఎదుట నిలిచి చెప్పేంత దైర్యమా?

నాలో నీ గురించిన భావజాలాన్ని నీకు తెలపడం
ఇంత కష్టమా? ఏదో ఘర్షణ ! నాలో నాకే. మనసుకి మస్తిస్కానికి మద్య!
ప్రేమ మొలకెత్తడానికి ముందు కూడా మధనం జరుగుతుందా?
నా భావాల్ని చెప్పలేక చెప్పకుండా ఉండిపోయిన ఆ క్షణాన...
ఎదురు చూడని స్వప్నంలా నువ్వే నా ఎదుట నిలిచి
నా మనసులోని మాటల్ని నీ మాటలుగా చెప్తుంటే ఉన్న
చోటునే శిలాప్రతిమనైపోయాను నీకు నేనంటే ఇష్టమని
నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే మనసు భారం
తీరిపోయినట్లుగా ఎంత హాయి ! కమ్మిన కారు మబ్బులు
బరువు తీరేదాకా కరిగి వర్షిస్తాయి. అంతా అయ్యాక
ఓ కొత్త వెలుగు. వస్తూనే అప్పటివరకూ ఉన్న మసక ప్రపంచాన్ని
స్పష్టంగా చూపెట్టెంత తేటగా ఉంది నా మది.

నిస్ప్రుహే దిక్కై,, బతుకే బరువై ఎండిపోయిన ఆశల్లోంచి
నేనున్నానంటూ పంచే ఆత్మవిశ్వాసంలా స్థిరంగా ఉంది నా మనసు!
ప్రసవ వేదనపడ్డక కన్న బిడ్డని చూసుకున్నప్పుడు పడ్డ బాధంతా
మరపించేసేలా ఆ తల్లి కళ్ళలోకి ఆనందం...
దూది లాంటి అంతే తెలికదనం నా హృదయంలోనూ!
ప్రేమ కూడా మొలకెత్తేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన
మదిలో పుట్టింది ప్రేమేనని తెలిశాక, ఆ ప్రేమ హాయిని అనుభవించాక
ఎవరం మాత్రం ఎదగనీయకుండా ఉండగలం...
ఆ లేత ప్రేమ మొలకని !

నేను బాగుంటాను. నువ్వు నాకంటే బాగుంటావు.కాని పక్కింటి సరోజ ఇంకా బాగుంటుందా ?మరి తనవంకేందుకలా చూశావ్..?  నేనంటే ప్రాణం నీ...
08/04/2017

నేను బాగుంటాను. నువ్వు నాకంటే బాగుంటావు.
కాని పక్కింటి సరోజ ఇంకా బాగుంటుందా ?
మరి తనవంకేందుకలా చూశావ్..?

నేనంటే ప్రాణం నీకు. తెల్లని నా కళ్ళంటే
మరీనూ, నిజం చెప్పొద్దూ.. నువ్వు చెప్పాకే నా
కళ్ళు అందంగా ఉన్నాయనిపించింది. మరి...
సరోజ కళ్ళూ బానే ఉంటాయనుకుంటా...!

ఇవ్వన్నీ ఎందుకు..? పేస్ టు పేస్.. నువ్వు
నన్నే చూడాలి. నాతోనే మాట్లాడాలి. నా దగ్గరే
నవ్వాలి. డిక్టేటర్నైపోతున్నానా...?

ప్రేమలో నడక నేర్చుకుంటున్నదాన్ని...
తప్పటడుగులు పడటం సహజమేమో...!

ఎన్నో గులాబీలు... ఎన్నెన్నో రంగుల్లో...
మరెంతో అందమైన గులాబీలు.. బోకేల కొద్దీ
గుత్తులు గుత్తులుగా.

వాటిలో ఏ భావము, జీవము కనిపించదు.
వాటిని చూసీ చూడనట్టు చూసే నీ చూపు
తెలుసు నాకు. కాని ఇంట్లో నేను వేసిన
పసుపు గులాబీ మొగ్గ వేసినప్పుడు నీ కళ్ళ లోని
అపురూపం... దానికి పూసే ప్రతి పూవ్వుతో
నువ్వాడే బాసలు.. నాకుగాక మరెవరికి
తెలుసు....!
అందాన్ని చూసే చూపు వేరు, అందమైన
మనసుని చూసే చూపు వేరు.

నువ్వు ప్రేమించింది నన్ను, నా మనసునే
కదూ ! థాంక్ గాడ్... అందాన్నేమో అనుకున్నాను.

అందాన్ని ప్రేమిస్తే... అందం ఎక్కడుంటే
అక్కడ మాత్రమే ప్రేమ ఉంటుంది. అందం
మారితే ప్రేమ మారుతుంది. కాని నన్ను
ప్రేమిస్తే... నాకులాగా ఎవరుంటారు ?
నీ నేను తప్ప ....!
బి. గీతిక.

ప్రేమంటే...ప్రతి మనిషికీ జీవితంలో ప్రేమ కావాలి.గుండెకు ఊపిరిలా మనసుకు ప్రేమ.సప్తవర్ణాల్ని తనలో దాచుకుని పైకి మాత్రం శూన్...
08/04/2017

ప్రేమంటే...
ప్రతి మనిషికీ జీవితంలో ప్రేమ కావాలి.
గుండెకు ఊపిరిలా మనసుకు ప్రేమ.
సప్తవర్ణాల్ని తనలో దాచుకుని పైకి మాత్రం శూన్యంలా, వర్ణ రహితంగా కనిపించేదే ప్రేమ.
ప్రేమలో నిబంధనలు ఉండవు.
ఎల్లలు లేనిది ప్రేమ.
ఆ ప్రేమ ఒక్కలాగే ఉండదు.
ఒక్కరికే పరిమితం కాదు.
తీపి అనే పదం ప్రేమయితే ఆ తీపిలోని రకాలలాగే ప్రేమ భావాలు కూడా.
బెల్లంలోని తియ్యదనం, తేనెలోని మధురత్వం ..
వీటిలా ప్రేమ కూడా రకరకాల మధుర భావాలతో మనసుని నింపుతుంది.
ప్రేమంటే... ఉదయించే వెచ్చదనంలోని వెలుగే కాదు.. అస్తమించాక వచ్చే చల్లని చీకటి కూడా.
ఎన్నెన్నో చినుకులు..నీలాకాశపు గుండెలోని గమ్యం తెలీని వాటి పయనం ..! అవన్నీ భావాలైతే వాటిలో ఏ మూలో దాగి ఉన్న స్వాతిచినుకు ప్రేమ భావం.
ప్రేమంటే ఒక ఆర్ధ్రత. గుండెని సున్నితంగా తాకే భావావేశం..! ప్రేమంటే ఒక స్వచ్ఛత. కనుపాపల లోతుల్లోంచి హృదయాన్ని చూడగల స్పష్టత..!
ప్రేమంటే స్వేచ్చ... తనకి దగ్గరగా ఉంటూనే అంతులేని అంచుల్లోకి వెళ్ళిరాగలంత స్వాతంత్ర్యం.
ప్రేమంటే అవగాహన .. ప్రతి క్షణాన్ని ఎదుటివైపు నుంచీ చూడగల విశ్వసనీయత.
మనకే తెలియని మన ఆలోచనల అయోమాయంలో వెంటాడే ఏకాకితనంలో...మంచు కరిగి సుస్పష్టమైన ప్రకృతిలా ఓ చిరుదరహాసం మన భావోద్వేగాల్ని చీల్చుకుని మనసులో వెదికితే
ఆ గుర్తు ప్రేమదే.
- బి. గీతిక

15/03/2017

చాణక్య నవ్వితే నాలుగు ప్రళయాలు -
ఆచార్యా! మనిషి పతనానికి, దేశం అధోగతికి కారణాలు?
అవినీతి, అనైతికత, అనైక్యత, వ్యభిచారం.
ఆచార్యా, ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు లంచం తీసుకుంటాడు?
చేప ఎప్పుడు నీళ్లు తాగుతుందో ఎవరు చెప్పగలరు!
ఆచార్యా, మంచి ప్రభుత్వం ఎట్లా ఉండాలి?
స్వప్రయోజనాలు, స్వార్థపరత్వం లేని మంత్రులున్న ప్రభుత్వం మంచిగా ఉంటుంది.
ఆచార్యా, ప్రభుత్వ కర్తవ్యం ఏది?
దేశరక్షణ, సుపరిపాలన, ప్రజల యోగక్షేమాలు.
ఆచార్యా, న్యాయం, ధర్మం, చట్టం?
చట్టానికి చుట్టాలుండకూడదు
చట్టం తనపని తను చేసుకోగలగాలి.
అప్పుడే ధర్మం గీత దాటదు, నీతి నిలబడుతుంది.
ఇది చాణక్యుని అర్థశాస్త్రం
అర్థశాస్త్రం అంటే
ఆర్థికంతో ముడిపడ్డ రాజకీయం.

Address

Nalgonda
508001

Alerts

Be the first to know and let us send you an email when Telugu kavithalu - SP Raj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu kavithalu - SP Raj:

Share

Category