VVD Newstv

VVD Newstv Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VVD Newstv, Media/News Company, Nandyal.

01/03/2025

చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా కల్లు గీత కార్మికునికి పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందజేశారు.
వారి పరిస్థితి చూసి, ఇద్దరు మనవరాళ్లు రక్షిత, హేమ, ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4వేలు చొప్పున ఇద్దరూ ఆడపిల్లలకు మొత్తం రూ.8 వేలు, 18 సంవత్సరాలు నిండే వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు.

01/03/2025

మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.

01/03/2025

నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నేత్రదానం

నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు ( 74 ) అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెంకటేశ్వర్లు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందడంతో మృతుడి కళ్ళను నేత్రదానం చేసేందుకు కుటుంబ సభ్యులైన భార్య పద్మావతి, కుమార్తెలు లక్ష్మీ కుమారి, సుమలత,మంజు శ్రీ,మహేశ్వరి కర్ణ ముందుకు వచ్చారు. నంద్యాలలోని ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ప్రతినిధులు బాపూజీ నాయక్, కిషోర్ లను సంప్రదించారు. వారు వెంటనే కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు విషయం చెప్పడంతో మెడికల్ టెక్నీషియన్స్ నంద్యాలకు చేరుకొని నంద్యాలలోని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ దస్తగిరి సమక్షంలో రెండు కళ్ళను సేకరించి హైదరాబాదులోని ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. రెండు కళ్ళను దానం చేసి రెండు జీవితాలకు వెలుగులు నింపాలనే ఆలోచన చేసిన మృతుడి కుటుంబసభ్యులను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ డైరెక్టర్ ప్రదీప్,చైర్మన్ విష్ణు గాయత్రి,ఫౌండర్ ఫణీంద్ర సహకారం అందించారు.

ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో స్థానిక క్రాంతి నగర్ లో ఇసుక డ్రైవర్ తో బిజెపి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ నిలదీశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి చలాన్, రసీదు, కనీసం ఒక పేపర్ కూడా లేకుండా ఇసుక రవాణా జరుగుతోందని, కూటమి ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉచిత ఇసుక కార్యక్రమం చేస్తుంటే, కొంతమంది దళారీలు మాత్రం ఏదేచ్ఛగా ప్రకృతి సంపద అయిన ఇసుకను ఇష్టరాజ్యంగా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం మీద పూర్తి సమాచారం సేకరించి అక్రమ ఇసుక రవాణాను ఆపేందుకు త్వరలో సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయబోతున్నామని తెలియజేసిన బిజెపి నాయకులు విజయ్

01/03/2025

శివ నామస్మరణతో మారుమోగిన మహానంది క్షేత్రం.

నల్లమల అటవీ అందాల నడుమ వినీలాకాశం అందాల తోడుగా మహానందీశ్వరుడి రథోత్సవం కనులపండువగా సాగింది. మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సంద ర్భంగా మహానంది క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం రథోత్స వం వైభవంగా నిర్వహించారు. శ్రీ కామేశ్వరి సహిత మహానం దీశ్వర మహాశివరాత్రి రోజు శ్రీ కామేశ్వరి దేవిని వివాహ మాడిన స్వామివారు శుక్రవారం సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఓం నమశ్శివాయ, శంభో.. శంకర అని భక్తులు నినాదిస్తుండగా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథశాల వరకు పల్లకిలో మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం రథశాల వద్ద అర్చక వేద పండితులు ప్రధాన పూ జ, రథాంగ హెూమము నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను రథంలో ఆశీనులు చేశారు. ఈనంద్యాల ఏఎస్పి జావలి, ఈవో శ్రీనివా సరెడ్డి, రథోత్సవ పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వాతిక బలిగా కొబ్బరికాయ, గుమ్మడి కాయలు సమర్పించారు. ఆ త ర్వాత భక్తులు శివనామస్మరణ చేస్తుండగా.. కళాకారులు పద ర్శన కొనసాగుతుండగా రథం ముందుకు సాగింది.

06/07/2024
15/05/2024

ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై దాడి . || VVD NEWS TV ||

19/04/2024
19/04/2024

Address

Nandyal
518502

Telephone

+919392388379

Website

Alerts

Be the first to know and let us send you an email when VVD Newstv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VVD Newstv:

Share