Praja TV

Praja TV Prajaa TV - AP&TG

నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న బి9 గ్రాండ్ హోటల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి (ట్రైనింగ్ ఆఫ్ ...
02/04/2026

నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న బి9 గ్రాండ్ హోటల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) - కన్వర్జెన్స్ విభాగాల సమన్వయ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పాణ్యం మండల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గారు**కార్యాలయం...
01/04/2026

పాణ్యం మండల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గారు*

*కార్యాలయంలో అందిస్తున్న సేవలు, సౌకర్యాలు ఎంత సమయంలో అందిస్తున్నారో, ప్రజల సంతృప్తి స్థాయి ఎలా వుందో సంబంధిత అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు.*

*అలాగే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని డాక్యుమెంట్ రైటర్స్ దుకాణాలు ఖాళీగా ఉండటంతో, సంబంధిత షాపులను సీజ్ చేయించిన జిల్లా కలెక్టర్ గారు*

15/03/2026

బడుగు బలహీనవర్గాలను సైతం రాజకీయంగా అభివృద్ధి చేసేందుకే జనసేన పార్టీ స్థాపన..

జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, నాయకులకు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణలో 2014 మార్చి 14న పురుడు పోసుకోవడం జరిగిందని బడుగు బలహీన వర్గాలకు సైతం రాజకీయంగా పైకి తీసుకుని వచ్చేందుకు ఎంతో మహోన్నత ఆశయంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని వివరించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ ద్వారా అందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
జనసేన నాయకులు షేక్ జమాల్ బాషా, వేముల కోటి, రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, దేవా ఆంజనేయులు, కొండపేట వీరయ్య, మైలారు శ్రీరాములు, బ్రహ్మేంద్ర కుమార్, గంతి సుబ్బయ్య, రామాచారి, బావికాడి గుర్రప్ప, ఆవుల జగదీష్, పోల రమేష్, జింక వెంకట స్వామి, రాటాల ప్రసాద్, ఆకుల నడిపి వెంకటసుబ్బయ్య, దుర్వేసుల ప్రతాప్, సూర్య నరసింహులు, మంగమ్మగారి ప్రసాద్, మైలారు శ్రీనివాసులు, దేవ శ్రీనివాసులు, పొన్నంపల్లె వెంకటరాముడు, తదితరులు పాల్గొన్నారు.

15/03/2026

అహోబిలం మఠం CAO గా కీడాంబి వేణుగోపాల్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం మఠం ముఖ్య పరిపాలన అధికారిగా కీడాంబి వేణుగోపాల్ స్వామి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆదేశాల మేరకు అహోబిలం మఠం సీఈఓ గా ఆయన చార్జి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ వైద్యులు, వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఎం.డి, అహోబిలం స్వాతి వైద్యశాల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి, మేనేజర్ మాధవన్, గ్రామస్తులు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.

15/03/2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్  రాజకుమారి గణియా ఈ సందర్భంగ...
03/01/2026

నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను స్వయంగా పర్యవేక్షించి, బోధన విధానం మరియు పాఠ్యాంశాల అమలును పరిశీలించిన జిల్లా కలెక్టర్.

సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా కలెక్టర్

జిల్లాలోని 281 పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి.... ఇందుకోసం అధికారులను నియమించి, నిరంతర సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ సూచించిన జిల్లా కలెక్టర్

ఇందులో భాగంగా తనకు కేటాయించిన ఏపీ మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థుల అభ్యాసన పద్ధతులు, బోధన విధానం మరియు పాఠ్యాంశాల అమలును పరిశీలించి జిల్లా కలెక్టర్

05/11/2025

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డి.ఎస్.పి సోమన్న ఆధ్వర్యంలో సోదాలను నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

01/11/2025

చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఏటిలో నీరు చెరువులోకి రాకుండా ముగ్గురు వ్యక్తులు నీటిలోకి దిగి తూము వద్ద గేట్ అడ్డు పెట్టి మరమ్మత్తులు చేస్తుండగా రంగయ్య అనే వ్యక్తి నీటిలో గల్లంతు అయి మృతి చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

* *కొలిమిగుండ్లలోని బెలూమ్ గుహల సమీపంలో నాపరాతి గనుల యజమానులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేసం #
01/11/2025

* *కొలిమిగుండ్లలోని బెలూమ్ గుహల సమీపంలో నాపరాతి గనుల యజమానులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేసం #

కోయిలకుంట్ల లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఆర్ అండ్ బి మినిస్టర్ బీసీ జనార్దనరెడ్డి    #నంద్యాలన్యూస్
01/11/2025

కోయిలకుంట్ల లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఆర్ అండ్ బి మినిస్టర్ బీసీ జనార్దనరెడ్డి #నంద్యాలన్యూస్

31/10/2025

నంద్యాల మండలంలో తుఫాను ప్రభావంతో కానాల, పాండురంగాపురం గ్రామాలలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి భాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన నంద్యాల మాజీ ఎమ్ ఎల్ ఏ భూమా బ్రహ్మానందరెడ్డి #నంద్యాలన్యూస్

Address

Chabolu Road. . Near Journalist Colony, Nunepalli
Nandyal
518501

Alerts

Be the first to know and let us send you an email when Praja TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja TV:

Share