
17/07/2025
నర్సాపురం సబ్ డివిజన్ లో పోలీసులు ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల దృష్ట్యా సబ్ డివిజన్ అంత పోలీస్ యాక్ట్(Police Act)30ని అమలు చేస్తున్నారు. గురువారం (జులై 17 )నుండి ఆదివారం(ఆగస్టు 17 ) వరకు సబ్ డివిజన్ అంతా అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు డిఎస్పి డాక్టర్ జి శ్రీ వేద వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా సబ్ డివిజన్ లో ఎలాంటి బహిరంగ సమావేశాలు కానీ, ఊరేగింపులు, ధర్నాలు జరుపకూడదని తెలిపారు. నిషేధిత ఆయుధాలైన కత్తులు, చాకులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు,నేరాలు పురుగోల్పే ఎలాంటి ఆయుధాలను వాడకూడదని చెప్పారు. భారీగా జనసమూహాన్ని పోగుచేసే సమావేశాలు, లౌడు స్పీకర్లు, డిజేలపై కూడా నిషేధం ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు.ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరారు.
Source: Anantha Bobby