29/12/2025
కూటమీ ప్రభుత్వం పేదలకు ఇస్తామన్న కానుకలను విస్మరించింది.గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్.
చిలకలూరిపేట/కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి అందజేస్తామని తెలిపారు. నేటికి దానిమీద మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. దానిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్న ఏ ఒక్క కానుక ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పే మాటలు నీటి మీద రాతలు లాంటివే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాస్టర్ లకు గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. జనవరి -2026 సంక్రాంతికి కానుక ఇస్తారో లేదో ఆందోళనలో ప్రజలు ఉన్నారన్నారు. తమ పాలన సంతృప్తిగా లేదని ఇటీవల కాలంలో ప్రజలకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రత్యేక నిదర్శనమన్నామని దుయ్యబట్టారు.ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా,నిరసన లాంటి కార్యక్రమాలు చేస్తామని కూటమి నేతలను హెచ్చరించారు.