Palnadu News

Palnadu News Newspaper

19/08/2026

*పల్నాడు జిల్లాలో బీసీలకు 179 సర్పంచ్ స్థానాలు*

*పల్నాడు:* జిల్లాలో 425 ఎంపీటీసీల్లో 114, 28 జడ్పీటీసీల్లో 9 స్థానాలను బీసీలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది.

527 సర్పంచ్‌లకు 179 స్థానాలు బీసీలకు కేటాయించారు. 5440 వార్డులకు 1,849 స్థానాల్లో బీసీలు పోటీ చేసే అవకాశం ఏర్పడింది.

మున్సిపాలిటీల్లో 199 వార్డులు ఉండగా 66 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి.

వినుకొండలో 36, సత్తెనపల్లిలో 36, మాచర్లలో 36 వార్డులు ఉండగా 11 నుంచి 12, పిడుగురాళ్లలో 40 వార్డులకు 13, దాచేపల్లిలో 28కి 9, గురజాలలో 23 వార్డులకు 7 స్థానాలకు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. చిలకలూరిపేట, నరసరావుపేటలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేదు.

---

1. *సర్పంచ్ స్థానాలు:* 527 లో 179 బీసీలకు రిజర్వ్
2. *ఎంపీటీసీ:* 425 లో 114 స్థానాలు
3. *జడ్పీటీసీ:* 28 లో 9 స్థానాలు
4. *మున్సిపల్ వార్డులు:* 199 లో 66 స్థానాలు
5. *గ్రామ వార్డులు:* 5440 లో 1,849 స్థానాలు

17/08/2026

సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ లో చనిపోయిన దానయ్య యాదవ్ కుటుంబానికి టీడీపీ తరపున మొత్తం ₹15,50,000 సాయం.

ఇప్పటికే స్థానిక MLA ₹50,000 సహాయం,
మంత్రి పార్థసారధి గారు ₹ 5,00,000 సహాయం,
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ₹5,00,000 సహాయం, అందించగా.. నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరొక ₹5,00,000 సాయం పార్టీ తరపున అందజేశారు.

12/08/2026

*గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం*

AP: రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం 'అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్' కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిధులతో 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధి పనులు చేపడతారు. ప్రయాగ్జ్లో జరిగిన మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పుష్కరఘాట్లను ఆధునీకరించి, నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

12/08/2026

*👉అమరావతి : ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన..!*

*అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి.. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదు.*

*ఎమ్మెల్యే సీట్లకు కెమెరాలు ఏర్పాటు చేశాం.. సీట్లో ఉంటేనే ఎమ్మెల్యే హాజరైనట్టు పరిగణిస్తాం.*

*డీఎస్సీపై వివాదం చేయడం సరికాదు.*

*అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‍పై ఈ నెల 17న అఖిలపక్ష భేటీలో నిర్ణయం.*

*: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు*

12/08/2026

*ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారులు..!!*

*AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, పురపాలక ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.*

*ఏపీ స్థానిక ఎన్నికలకు సన్నాహాలు*

*అధికారులు సిద్ధం చేసిన నివేదికలు*

*కోర్టు కేసులు తొలగితే నోటిఫికేషన్*

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, పురపాలక ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తమ పూర్తిస్థాయి సన్నద్ధత నివేదికలను అందజేశారు. కోర్టుల్లో చిక్కుకున్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతే, తక్షణమే ఎన్నికల ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి.

*పురపాలికలు, కోర్టు కేసుల పరిస్థితి..*

వార్డుల పునర్విభజనపై కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తే కేవలం 20 రోజుల్లోనే 100 పురపాలికల్లో అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పదవీకాలం పూర్తయిన 87 పురపాలక సంస్థల్లో ఎన్నికలు(Ap Local Body Elections) జరిపేందుకు ఎస్‌ఈసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ సహా పలు పురపాలికలపై దాఖలైన రిట్ పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి.

*గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రణాళిక..*

పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 13,341 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాల రూపకల్పన వేగవంతంగా సాగుతోంది. కోర్టు వివాదాల కారణంగా గతంలో ఆగిపోయిన సుమారు 100 పంచాయతీలను మినహాయించి, మిగిలిన చోట్ల ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం సర్వసిద్ధంగా ఉంది. న్యాయ చిక్కులన్నీ పరిష్కారమైతే రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

12/08/2026

అమరావతి: శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష..!*

*నేడు మధ్యాహ్నం 03:30 గంటలకు సచివాలయంలో హై లెవల్ మీటింగ్.*

డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు 1,300 మంది పోలీస్ అధికారులు హాజరు

శాంతిభద్రతలు, మహిళలు-చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి

పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల నమోదుపై క్షేత్రస్థాయి నివేదికలతో సమీక్ష

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు

12/08/2026

పల్నాడు జిల్లాలో దారుణ హత్య

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో ఘటన

కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య

అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దాడి

గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి

సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా

పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

11/08/2026

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను చేబ్రోలు పోలీసులు ఈరోజు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు
ముద్దాయిల వద్ద నుండి నగదు మరియు దొంగిలించబడిన ఇత్తడి ట్యాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఫిర్యాది అయిన వెలగపూడి సాయి బాబు అను అతను చేబ్రోలు మండలం, గరువుపాలెం గ్రామ పరిదిలో VK Engineers shop అను పేరుతో ఒక శానిటరీ షాపు పెట్టుకొని జీవిస్తూఉంటాడు. ప్రతీ రోజు ఉదయం 9.30 గంటలకు ఫిర్యాది షాపుకు వచ్చి సాయంత్రం 6.30 గంటలకు షాపు మూసివేసి ఇంటికి వెళ్తాడు. రోజు మాదిరిగానే ది. 14.03.2026 వ తేదీన ఉదయం 9.30 గంటలకు షాపుకు వచ్చి సాయంత్రం 6.30 గంటలకు షాపు ఇంటికి వెళ్ళినాడు. మరుసటి రోజు ది.15.03.2026 వ తేదీన ఆదివారం షాపు తీయలేదు.
ఈ క్రమంలోనే ముద్దాయి లు అయిన A1-ప్రశాంత్, A2-జైపాల్, A3- దార్ల తిరుపతమ్మ, A4- మింగి మేరమ్మ అను వారు సదరు షాప్ తాళాలు పగలగొట్టి షాపులోని ఇత్తడి ట్యాపులు మరియు ఇతర శానిటరీ వస్తువులను నిందితులు చోరీచేసినారు.

▶️గుంటూరు జిల్లా SP గారు అయిన గౌరవ శ్రీ వాకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు, తెనాలి DSP గారు అయిన బి. జనార్ధనరావు గారు సుచనలమేరకు, పొన్నూరు రూరల్ CI గారు అయిన శ్రీ పి.కృష్ణయ్యా గారి అద్వర్యంలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ SI గారు అయిన శ్రీ P.వీరనారాయణ గారు వారి సిబ్బంది సహాయంతో సదరు కేసు ని దర్యాప్తు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసినారు.





11/08/2026

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం..!

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 20కి పైగా కేసులు నమోదు.

అసభ్యకర పోస్టులు పెట్టిన పలువురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక

11/08/2026

సుబాబుల్ లారీ ఢీకొని మహిళ మృతి
రొంపిచర్ల (11.08.2026)
సుబాబుల్ లారీ ఢీ కొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో అన్నవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.మండల కేంద్రమైన రొంపిచర్లకు చెందిన వెంగళరాజు సైదమ్మ (55)తన భర్త సుబ్బరాజుతో కలిసి నరసరావుపేట నుండి బైక్ మీద స్వగ్రామానికి బయలు దేరారు.మార్గమధ్యలో అన్నవరం గ్రామం దాటిన తర్వాత రొంపిచర్ల వైపుకు వేగంగా వెళుతున్న సుబాబుల్ లారీ వీరు వెళ్ళుతున్న బైక్ ను ఢీకొనడంతో వెనుక వైపు ఉన్న సైదమ్మ(55)లారీటైర్ల క్రింద పడి తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతిచెందారు.మృతురాలి భర్త సుబ్బారాజుకు స్వల్ప గాయాలయ్యాయి.సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారు అయ్యారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.కాగా మృతురాలు సిపిఎం నాయకురాలు.గతంలో ఐద్వా లో పనిచేశారు.మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు.

Address

Palnadu District
Narasaraopet

Website

Alerts

Be the first to know and let us send you an email when Palnadu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share