02/09/2026
అనారోగ్యం వచ్చింది.
హాస్పిటల్‌కి వెళ్లాం.
డాక్టర్‌ను చూపించుకున్నాం.
మందులు కొనుక్కున్నాం.
అక్కడ కూడా “చాయ్‌వాలా” గారి వాటా మర్చిపోలేదు!
రోగి కష్టాల్లో ఉన్నా,
మందులు కొనడానికి జేబు ఖాళీ అవుతున్నా.
మెడిసిన్స్‌పై కూడా టాక్స్ పేరుతో పన్ను వసూలే!
అంటే రోగి ఆరోగ్యం కోసం ఖర్చు చేసిన డబ్బులో కూడా పన్ను!
“రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం
మందులు కొంటే ట్యాక్స్ దగ్గరికి వెళ్తాం!”
ప్రజలకు కావాల్సింది
చౌకైన వైద్యం,అందుబాటులో మందులు.
కానీ ప్రతి అవసరమైన వస్తువుపై పన్నుల భారం పెడితే చివరికి సామాన్యుడి జేబుకే చికిత్స!
ప్రజల ఆరోగ్యం ముఖ్యం,
పన్నుల ఆదాయం మాత్రమే కాదు!