
27/05/2024
ఏటీఎం లో చోరీ
=======================
* రూ.3 మూడు లక్షలు దోచుకెళ్లిన దొంగలు
* పడాపల్లిలో ఘటన
నెల్లూరు నగరంలోనే 23 డివిజన్ పరిధిలోని ఓ ఏటిఎం ను చోరీ చేశారు. అందులో ఉన్న దాదాపు 3 లక్షల రూపాయలను నగదును దోచు వెళ్ళినట్లు పోలీసుల అనుమానం. ఈ ఘటన నెల్లూరు రూరల్ పడారుపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వేదాయపాలెం సిఐ నారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. అదేవిధంగా క్లూస్ టీం సిబ్బంది వేలు ముద్దలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.