21/10/2025
లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే, సీఎం చంద్రబాబు గారు చూపిన చొరవ, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం... రెండూ సఫలీకృతమై ఏపీ ఆక్వా రైతుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పొట్టు తీయని ఏపీ రొయ్య దిగుమతిపై ఇంత వరకు ఉన్న ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తేసింది. రొయ్యల దిగుమతిపై అమెరికా భారీగా సుంకాలు విధించగా, మరో దేశంతో మాట్లాడమని కేంద్రానికి చంద్రబాబు గారు గతంలో సూచించారు.