30/04/2023
శాస్త్రోక్తంగా కుంభాభిషేకం పూజలు
భక్తిశ్రద్ధలతో చండీ పారాయణం, హోమం,లఘు పూర్ణాహుతి, శ్రీ విద్యా హోమం..లలితా సహస్రనామ అర్చన
వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా వచ్చిన వీఐపీలు
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి. అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకల్లో భాగంగా నాలుగోవ రోజైన ఆదివారం భక్తిశ్రద్ధలతో చండి పారాయణం, హోమం,లఘు పూర్ణాహుతి,శ్రీవిద్యా హోమం, యాగశాల ప్రవేశం. లఘుపూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను చేపట్టారు. తొలి రోజు బండి వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సప్త గోశాల ప్రారంభంతో మొదలైన కుంభాభిషేకం వేడుకలు నాలుగోవ రోజు కూడా విభవపేతంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బండి వేణు గోపాల్ రెడ్డి, కొలను రాజారెడ్డి, పూజిత దంపతులు, జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి దంపతులు, లేబూరు భాను కిరణాకర్ రెడ్డి దంపతులు,ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మ ణ్యంనాయుడు దంపతులు,ఆలయ ఈఓ డబ్బుగుంట వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.