30/06/2025
ప్రెస్ నోట్
నెల్లూరు,తేది: 30/06/2025: సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు షేక్ ఇమామ్ బాషా, SDPI నెల్లూరు జిల్లా నాయకులు స్వర్ణాల చెరువు ఆక్రమణ జరగకుండా చూడాలని, చెరువును పరిరక్షించాలని, దాని పై ఆధారపడ్డ మత్స్య కారులకు అన్యాయం జరగకుండా చూడాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
స్వర్ణాల చెరువు ను ఇప్పటికే కొన్ని గట్టు ప్రాంతాలలో ఆక్రమణలు చేసి దళారులు అమ్ముకొంటున్నారని, భవిషత్తు లో ఈ ఆక్రమిత భూమి ని కొన్న మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతారని, భవిష్యత్తు లో వరదలు, భారీ వర్షాలు వస్తే ఆక్రమణకు గురైనా చెరువు వల్ల నెల్లూరు జిల్లా ప్రజలకు ఇబ్బంది కలుగును అని విన్నపించటం జరిగింది. ఈ కార్యక్రమం లో SDPI పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ అజిజ్, అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్,, పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రఫీ, ముఫ్తి అబ్దుర్ రహమాన్ గారు, కార్యదర్శులు సయ్యద్ ఫాజిల్, మొగల్ ఉస్మాన్ పాల్గొన్నారు.
విషయం: నెల్లూరు స్వర్ణాల చెరువును పరిరక్షిస్తూ – మత్స్యకారుల జీవనాధారం, రొట్టెల పండుగ ప్రాధాన్యత, హద్దుగా గోడ నిర్మాణం అంశాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
గౌరవనీయులైన కలెక్టర్ గారికి,
నెల్లూరు నగరానికి విశిష్టతను అందించే స్వర్ణాల చెరువు, మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం మాత్రమే కాకుండా, సామాజిక, ఆధ్యాత్మిక ఉత్సవాలకు ముఖ్య కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా రొట్టెల పండుగ రాష్ట్రస్థాయిలో ప్రాముఖ్యతను పొందినది. కానీ ఇటీవల నీటి మట్టం తగ్గుదల, నీటి కలుషితత,మత్స్యకారుల ఆదాయనష్టాలు,స్థిర హద్దుల లేమి వలన ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్వర్ణాల చెరువు కొత్తూరు, అంబపురం వైపు అక్రమణకు గురి ఐవుంది. ఇప్పడు స్వర్ణాల చెరువు ఇంకా ఆక్రమణలు జరుగుతున్నాయి, ఈ ఆక్రమణల వల్ల భవిష్యత్తు లో వర్షాలు, వరదలు ఎక్కువైతే నెల్లూరు కు ముప్పు ఉంది మరియు ఈ ఆక్రమణ స్థాలేములను కొన్న మధ్య తరగతి ప్రజలు భవిష్యత్తు లో భూమి కోల్పోయే పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా కె నీళ్ల నిలువ ఉన్న ఈ చెరువు ఆక్రమణకు గురికాకుండా ఉండాలని, ఈ చెరువు పై ఆధారపడ్డ వారికి నష్టం జరగకుండా చూడాలని SDPI తమరిని విన్నాపిస్తుయి.
మీ సహకారాన్ని కోరుతూ, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
వినయపూర్వకంగా,
షేక్ ఇమామ్ బాషా
SDPI పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు