
08/07/2025
ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా గారి మృతి బాధాకరం. తన అద్భుత రచనలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శివదత్తా మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన రాసిన పాటలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించాయంటే అది తెలుగువారికి దక్కిన గౌరవం. శివదత్తా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కీరవాణి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.