21/09/2025
అన్యాయాన్ని ఎదిరించే దళితులపై కేసులా?
మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, అంతుచూస్తాం.
=============================
కోవూరు నియోజకవర్గ వైసిపి నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిని జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళి పరామర్శించారు .ఒక కేసు కు సంబంధించి నెల్లూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న వీరి చలపతిని ఈ ముగ్గురు నేతలు పరామర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. దళితుడుగా ప్రభుత్వ దుర్మార్గాలను ,అన్యాయాలను ఎదిరించి ప్రశ్నిస్తున్నాడన్న ఏకైక కారణంతో రెండున్నర ఏళ్ల నాటి కేసును తిరగపెట్టీ మళ్లీ ఇప్పుడు అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కూటమి ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారు చేసే అక్రమాలు అన్యాయాలలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు . రాబోయేది తమ ప్రభుత్వమేనని వై నాట్ 175 అనేది ఈ దఫా జరగబోతుందని అన్నారు . తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకి ఇంత అక్రమాలు చేసిన వాళ్ళు అనుభవిస్తారని హెచ్చరించారు.