YSRCP Sarvepalli

YSRCP Sarvepalli It contains updates of kakani garu and ysrcp party

17.09.2024-2
17/09/2024

17.09.2024-2

17.09.2024
17/09/2024

17.09.2024

" వైకాపా నాయకుడికి కాకాణి నివాళి"SPS నెల్లూరు జిల్లా:తేది:15-09-2024సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, వడ్లపూడి గ్రా...
15/09/2024

" వైకాపా నాయకుడికి కాకాణి నివాళి"

SPS నెల్లూరు జిల్లా:
తేది:15-09-2024

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, వడ్లపూడి గ్రామానికి చెందిన స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ, మాజీ మంత్రి కాకాణి వెంట నడిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన చిట్టేటి నారాయణ మృతి పట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేసి, పార్థివదేహానికి పూలమాలవేసి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

13.09.2024
13/09/2024

13.09.2024

"సీతారామ్ ఏచూరి మరణం దేశానికి తీరని లోటు" - కాకాణి.నిరాడంబరుడు, పేదల పక్షపాతి, ప్రజల సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడు సీతా...
12/09/2024

"సీతారామ్ ఏచూరి మరణం దేశానికి తీరని లోటు" - కాకాణి.

నిరాడంబరుడు, పేదల పక్షపాతి, ప్రజల సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడు సీతారామ్ ఏచూరి గారి మరణం తీరని లోటుగా భావిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...

౼ కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.

" ఇసుక దొంగ సోమిరెడ్డీ, నాటకాలు కట్టిబెట్టు"కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డీ.., అలియాస్ డూప్ షార్ట్ శ్రీధర్ రెడ్డి చిన్నప్పటిను...
12/09/2024

" ఇసుక దొంగ సోమిరెడ్డీ, నాటకాలు కట్టిబెట్టు"

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డీ.., అలియాస్ డూప్ షార్ట్ శ్రీధర్ రెడ్డి చిన్నప్పటినుండే నీ డూప్ షాట్లు నాకు తెలుసు.

తోడుదొంగలు, చిల్లర దొంగలు ఒకటై, సూరాయపాళెం వెళ్లి డ్రామా రక్తి కట్టించాలని విఫల యత్నం చేశారు.

అవినీతి సోమిరెడ్డికి, డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి తోడైనంత మాత్రాన ఏమి నష్టం లేదు.

చిల్లర దొంగల గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్లనే పట్టించుకోని నేను, వాళ్లు మాట్లాడే చిల్లర మాటలకు విలువ ఇవ్వను.

సోమిరెడ్డికి, శ్రీధర్ రెడ్డి కి నేను సవాలు విసురుతున్నా... అధికారులతో కలిసి వస్తే మేము వస్తాం, స్థానిక ప్రజలను పిలుద్దాం, ప్రజాభిప్రాయాన్ని సేకరించే దమ్ము, ధైర్యం మీకుందా!

సోమిరెడ్డి నోరు తెరిస్తే, భరించలేని డ్రైనేజీ కాలువ కంపు కొడుతుంది.

అవినీతి బ్రతుకు బ్రతికే సోమిరెడ్డీ... నీది ఒక బ్రతకేనా..నీవు ఒక మనిషివేనా!

సోమిరెడ్డి లాంటి నీచమైన అవినీతి బ్రతుకు బ్రతకడం కన్న... ఛీ.. ఛీ.. చావడం మేలు.

సూరాయపాళెం రీచ్ లో సోమిరెడ్డి అనుచరుల ఆగడాలకు దౌర్జన్యాలకు చెందిన ఆధారాలు.. ఫోటోలు, వీడియోలను ప్రదర్శించిన కాకాణి.

SPS నెల్లూరు జిల్లా:
తేది:12-09-2024

నెల్లూరు నగరంలో, డైకస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్...

👉రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు, యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.

👉చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పారు..

👉కానీ గతంలో కంటే ఐదు రేట్లు అధికంగా ధరను ఇసుకకు చెల్లించాల్సి వస్తోంది.

👉కానీ పేదవాడికి ఇసుక అందనివ్వకుండా టిడిపి కూటమి నేతలు దోపిడీ చేస్తున్నారు.

👉సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలోని సూరాయపాళెంలో సోమిరెడ్డి 100 కోట్లకు స్కెచ్ వేశాడు.

👉కొంతమంది తోడుదొంగలు.. చిల్లర దొంగలతో సోమిరెడ్డి సూరాయపాళెంకు వెళ్లాడు.

👉వీరితో పాటూ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డిని కూడా తీసుకెళ్లాడు.. ఆయన వద్ద ఏదేదో మాట్లాడించేందుకు ప్రయత్నించాడు.

👉వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లారు.. ఏమి చూశారు

👉కేవలం ఒకరి భుజాలు ఒకరు తట్టుకొని వచ్చారు

👉అధికారుల సమక్షంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటే అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తుంది.

👉సోమిరెడ్డి చేస్తున్న దోపిడీ కూడా వెలుగులోకి వస్తుంది

👉పెన్నా నదిలో ఇసుకను డ్రెడ్జింగ్ చేసి యార్డ్ కు తరలించేందుకు కలెక్టర్ టెండర్లు ఆహ్వానించారు.

👉టెండర్లు దక్కించుకున్న వారి బోట్లను నదిలోకి సోమిరెడ్డి దిగనివ్వడం లేదు

👉కలెక్టర్ తో పాటు, ఇతర అధికారులను సోమిరెడ్డి అనుచరులు తీవ్రంగా విమర్శించారు.

👉పేరుకు డ్రెడ్జింగ్ చేసినట్లు చెప్పి, చుట్టుపక్కల రీచ్ లలో ఇసుక నిల్వలను ఎత్తేయాలని ప్లాన్ వేశాడు.

👉వారితో బేరసారాలకు దిగారు.

👉అధికారులను కూడా రీచ్ వద్దకు తీసుకొస్తే, నేను వస్తా..

👉అక్రమాలకు స్కెచ్ వేశారా లేదా అనేది నిరూపిస్తా!

👉వై.సి.పి. హయాంలో సూరాయ పాళెంలో గత మూడేళ్లుగా ఇసుక రీచ్ లు నిర్వహించలేదు.

👉దమ్ముంటే కాదని నిరూపించండి.

👉సూరాయపాళెంలో సోమిరెడ్డి దోపిడి గురించి శ్రీధర్ రెడ్డికి ఏం తెలుసని అక్కడికి వెళ్ళాడు.

👉శ్రీధర్ రెడ్డి డూప్ షాట్ లను నేను చిన్నప్పటినుంచి చూశాను.

👉ఎవరైనా వ్యాపారస్తులు..లే ఔట్ యజమానులు ఉంటే వారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉంటారు.

👉నా దగ్గరికి అలాంటి వాళ్ళు రారు.

👉ఎవరైనా సమస్యలు ఉండే ప్రజలు మాత్రమే వస్తారు.

👉భవిష్యత్తులో తన దోపిడీకి సోమిరెడ్డి సహకారం అందిస్తారని శ్రీధర్ రెడ్డి వెళ్లాడా..!

👉మీరు వెళ్లి, మీ అంతకు మీరు క్లీన్ చిట్ ఇచ్చుకుంటే సరిపోతుందా!

👉పొదలకూరులో అక్రమ లేఔట్లు అని చెప్పిన సోమిరెడ్డి... 3కోట్లు దండుకొని ఇప్పుడు వాటిని సక్రమం చేశాడా!

👉 అక్రమ లేఔట్లని ఆరోపించిన సోమిరెడ్డి, సక్రమం ఎలా చేశాడో సోమిరెడ్డి చెప్పాలి.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారు

👉ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారా..!ఇది దోపిడీ కదా

👉ఒకవైపు ఇసుక లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, టిడిపి నేతలు బ్లాక్ లో విక్రయిస్తున్నారు.

👉 సర్వేపల్లి లో పోస్టుల అమ్మకాలను సోమిరెడ్డి జోరుగా కొనసాగిస్తున్నాడు.

👉 సోమిరెడ్డి పెద్ద పోస్టుకు ఒక ధర నిర్ణయించి డబ్బులు వసూలు చేసుకొని లెటర్లు జారీ చేస్తున్నాడు.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగస్వామి పార్టీ అయినా వెంకటాచలం బిజెపి కార్యదర్శి పిల్లిపోగు పెంచలయ్య దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి మూడు లక్షలు డిమాండ్ చేశాడన్న ఆరోపణకు మీ సమాధానం ఏంటో చెప్పాలి.

👉ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన లెటర్లను కూడా సోమిరెడ్డి అమ్ముకుంటున్నారు

👉సోమిరెడ్డి దోపిడీని ఎదుర్కొంటాం...అక్రమాలను సహించం.

👉 సోమిరెడ్డి పిల్లి శాపాలకు, ఉడుత బెదిరింపులకు భయపడం.

పచ్చనేతల కబ్జా పర్వం
12/09/2024

పచ్చనేతల కబ్జా పర్వం

12.09.2024
12/09/2024

12.09.2024

09.09.2024.నెల్లూరు.వరద సహాయక చర్యల్లో చంద్రబాబు వైఫల్యంవాటిని కప్పి పుచ్చుకోవడానికే డైవర్షన్‌ పాలిటిక్స్‌:మాజీ మంత్రి క...
09/09/2024

09.09.2024.
నెల్లూరు.

వరద సహాయక చర్యల్లో చంద్రబాబు వైఫల్యం
వాటిని కప్పి పుచ్చుకోవడానికే డైవర్షన్‌ పాలిటిక్స్‌
:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజం

నెల్లూరు, వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.

వరద మరణాలన్నీ కచ్చితంగా ప్రభుత్వ హత్యలే
ముందస్తు హెచ్చరికల్లోనూ ప్రభుత్వ వైఫల్యం
ఇప్పుడు కూడా పబ్లిసిటీ కోసం నానా హంగామా
అంతే తప్ప వరద బాధితులకు ఒరిగిందేమీలేదు
అయినా ఏదేదో చేస్తున్నట్లు ఎల్లో మీడియాలో ప్రచారం
ఇకనైనా వరద బాధితులపై దృష్టి పెట్టండి
:ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు:
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు జాగ్రత్తల్లోనే కాకుండా, సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ఎంతసేపూ గత ప్రభుత్వాన్ని, జగన్‌ను నిందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, తమ పార్టీ నేతలను టార్గెట్‌ చేసి కేసులతో వేధించడం సీఎం చంద్రబాబు దినచర్యగా మారిందని దుయ్యబట్టారు. బుడమేరుకు సరిగ్గా 60 ఏళ్ళ క్రితమే వరద వచ్చి అప్పట్లోనే పది మంది మరణించిన విషయాన్ని ప్రస్తావించిన కాకాణి, ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు.. మీది రియల్‌ టైం గవర్నెన్స్‌ అంటారు కదా?. మరి ఇవన్నీ ముందే ఎందుకు పసిగట్టలేదని కాకాణి ప్రశ్నించారు. కృష్ణానదిపై ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తే ఫ్లడ్‌ కుషన్‌ ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని గట్టిగా నిలదీసిన ఆయన, ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వానికి అలెర్ట్‌ ఇచ్చినా చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. లక్షలాది జనాన్ని గాలికొదిలేసి, చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పారిపోయి కలెక్టరేట్‌ను పునరావాస కేంద్రంగా మార్చుకున్నారన్నారు. జనాన్ని మాత్రం తరలించలేదని, పైగా తన ఇల్లు మునిగిపోయిందంటే పరువు పోతుందని కలెక్టరేట్‌లో ఉంటూ కలరింగ్‌ ఇచ్చారని కాకాణి ఎద్దేవా చేశారు.
వర్షాలు, వరదల వల్ల ఉద్యానపంటలు లక్షలాది ఎకరాలు నీట మునిగాయన్న కాకాణి, గతంలో తమ ప్రభుత్వంలో ఇలా జరిగితే, వెంటనే రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. చంద్రబాబు తక్షణమే రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ మొదలుపెట్టారన్న ఆయన, ఎక్కడో బోట్లు కొట్టుకుపోతే దానికి వైఎస్‌ఆర్‌సీపీకు ముడి పెట్టడం కుట్రలో భాగమేనన్నారు.
స్కిల్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేస్తే, అది అక్రమ అరెస్ట్‌ అంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందన్న మాజీ మంత్రి, అన్ని ఆధారాలు ఉండబట్టే, చంద్రబాబును జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారని చెప్పారు. చంద్రబాబుకు భజన చేసే మీడియా.. జాకీలు పెట్టి మరీ బాకాలు ఊదుతోందని, ఆయన ప్రాణాలు ఫణంగా పెట్టి వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారని అదేపనిగా ఊదరగొడుతున్నారని ఆక్షేపించారు.
ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మాని, వరద ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దాలని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మరుపూరు చెరువు నుండి యథేచ్ఛగా మట్టి తరలింపు
08/09/2024

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మరుపూరు చెరువు నుండి యథేచ్ఛగా మట్టి తరలింపు

Address

Nellore

Telephone

9849020556

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Sarvepalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category