DCN News

DCN News 10-06-1983

12/09/2025

#ధాన్యానికి గిట్టుబాటు కనుమరుగు - రైతును ఆదుకోండి -mla కి మొరపెట్టుకున్నా రైతులు

27/08/2025

#దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతలకు త్రోవ ... అన్నదాత సుఖీభవ.

16/08/2025
16/08/2025

#బారి హర్ హర్ తిరంగ్ తో ర్యాలీ - శ్రీ సాయిరామ్ హైస్కూల్ సేవలు అభినందనీయం - వక్తలు

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ సారథ్యంలో ఇందుకూరుపేట మండలంలోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వరకు విద్యార్థిని , విద్యార్థులు స్కెటింగ్ చేసుకుంటూ బారి జాతీయ జెండాతో హర్ హర్ తిరంగ్ నిర్వహించారు. అనంతరం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని , విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరిని అబ్బుర పరిచారు. అనంతరం విజేతలైన పలువురు విద్యార్థిని , విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ గవిని పాలేంద్ర జగదీష్ బాబు , డైరెక్టర్ మారుబోయిన రాధారాణి , గాంధీ ఆశ్రమ కమిటీ నిర్వాహుకులు రవింద్ర రెడ్డి , అల్లాబక్ష్ , పలువురు విద్యార్థిని , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

 # పాలకవర్గం పత్తా లేదు...అధికారులు పవలించారు    #ఇందుకూరుపేట   NELLORE ఇందుకూరుపేట మండల సర్వసభ్య సమావేశం నిరుగారింది. మ...
27/06/2025

# పాలకవర్గం పత్తా లేదు...అధికారులు పవలించారు #ఇందుకూరుపేట NELLORE

ఇందుకూరుపేట మండల సర్వసభ్య సమావేశం నిరుగారింది. మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు ప్రారంభం అవ్వవలసిన సమావేశంకు పూర్తి స్థాయిలో ఎంపీటీసీ మెంబర్లు , మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు g శంకరయ్య 3గంటల 30 నిమిషాలైన హాజరు కాకపోవడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ కనిపిస్తున్న RTC అధికారి సమావేశ మందిరంలో నీలా సేదతీరుతున్నారు.

     #మద్యం మత్తులో వివాదం ఉత్తరప్రదేశ్ వ్యక్తి - నెల్లూరులో మృతి  #నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీనివాస నగర్ 1వ ...
17/06/2025

#మద్యం మత్తులో వివాదం ఉత్తరప్రదేశ్ వ్యక్తి - నెల్లూరులో మృతి

#నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీనివాస నగర్ 1వ వీధిలో అద్దెకు నివసిస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన జైహింద్ అనే పెయింట్ కార్మికుడు సహా కార్మికుడు పరదేశి చేయితో మృతి చెందినట్లు రెండోవ నగర పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు.

17/05/2025

#వాడవాడలా సలివేంద్రాలు - DPO రమణయ్య

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట లో బీట్ దా హీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ DPO రమణయ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిట్ దా హిట్ కార్యక్రమంతో వేసవి సమయంలో పశు పక్షాదులుకు సైతం నీరు అందించాలనే లక్ష్యంతో ఇటువంటి బుహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సలివేంద్రంను ప్రారంభించారు. వేసవి సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రతి పంచాయితీలో సలివేంద్రాలను ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ ఆదేశాలు చేశారని గుర్తుచేశారు.

04/05/2025

#ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా AIYF ఆవిర్భావం

నెల్లూరు జిల్లా సంతపేట సిపిఐ కార్యాలయం ఆవర్ణంలో AIYF 66వ ఆవిర్భవ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షానవాజ్ జండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ మున్న మాట్లాడుతూ యువత హక్కులు , ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా AIYF ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామవెంకయ్య , పలువురు నాయకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

04/05/2025

#నాయకుల వాగ్దానాలు నల్లెరుకెరుక - ప్రజల ప్రాణాలు భగవంతునికెరుక

నాయకుల వాగ్దానాలు నల్లెరుకెరుక . ఎన్నికల సమయంలో ప్రజలకు కల్లబొల్లి వాగ్దానాలతో పబ్బం గడుపుకొంటూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయితీ పాగావారిపాలెం గ్రామంలో శ్రీ రామ మందిరం శిథిలావస్థకు చేరుకోవడంతో పెక్కులు పడి పలువురు వృద్దులకు తీవ్రగాయాలు అవ్వడం జరిగిందని స్థానిక ప్రజలు తెలిపారు.

04/05/2025

ిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల - రైతు సంఘం నాయకుడు షాన్వాజ్


అసలే అద్వానపు రోడ్డు చిన్నపాటి చినుకు పడితే చిత్తూ చిత్తే . డ్రైనేజి నీరు సైతం రోడ్లపైనే. అధికారుల నిర్లక్షానికి నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణ రెడ్డి పేటలో పాత సిమెంట్ రోడ్డుపై , కొత్తగా మరోమారు సిమెంట్ రోడ్డు వేసి ప్రభుత్వ నిధులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో ఉర్దూ పాఠశాల రోడ్డు గుంతలమైంతో నిర్మాణం చేసి , అదే రోడ్డు పై నాణ్యత ప్రమాణాలు గాలికొదిలి , మరోమారు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారని రైతు సంఘం నాయకుడు షాన్వాజ్ ఆరోపించారు. ఎత్తులు దూకుల్లో రోడ్డు వేసి, మండు వేసవిలో సిమెంట్ రోడ్డు కు చుక్క నీరు తడపకుండా కాంట్రాక్టర్ గాలికొదిలితే సంబంధిత అధికారులు సాపాకింద నీరులా వ్యవహరిస్తున్నారని అయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ చేయవలసిన పని , స్థానిక ప్రజలు స్వచందంగా సిమెంట్ రోడ్డు ను నీటితో తడుపు కొంటున్నారని గుర్తుచేశారు. లక్షల రూపాయలతో రోడ్డు పనులు కాంట్రాక్ట్ తీసుకొన్న కాంట్రాక్టర్ కనుచూపుమేర కనబడటంలేదని ఎద్దేవాచేశారు. జిల్లా కలెక్టర్ నాణ్యత లేకుండా నిర్మాణం చేస్తున్న సిమెంట్ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరారు.

27/04/2025

ముంగర సుధాకర్ సహకారం నేటి అభివృద్ధికి తార్కాణం- కిశోర్ యాదవ్
https://www.youtube.com/watch?v=HFswlvRlzas

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామాభివృద్ధిలో భాగంగా చెరువు ఆధునీకరణ పనులు కోవూరు నియోజకవర్గం శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో వేగవంతంగా చేపట్టడం జరుగుతుందని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచు కిశోర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా చెరువు లో చేపడుతున్న ఆధునీకరణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ స్థానిక రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాడు ముంగర సుధాకర్ రైతుల అభివృద్ధి కొరకు చెరువు లో బాటను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. నాటి బాట నేడు ఎందరో రైతులకు ఉపయోగకరంగా మారిందని అన్నారు. చెరువు అభివృద్ధి కొరకు కోవూరు నియోజకవర్గం శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకరించడంతో ఆధునీకరణ పనులు శరవేగంగా చేపడుతున్నామని తెలిపారు. చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు , పలురకాల పండ్ల చెట్లు నాటి అభివృద్ధికి మారుపేరుగా పున్నూరు గ్రామాన్ని తయారుచేస్తామని గుర్తుచేశారు. చెరువు పరిసరప్రాంతాన్ని ఆహ్లదకరంగా తయారుచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు , కార్యకర్తలు , ప్రజలు , రైతులు , తదితరులు పాల్గొన్నారు.

16/04/2025

#పంచాయితీ ఆస్థి ఆక్రమణ వాస్తవమే నివేదిక కలెక్టర్ కి సమర్పిస్తా - DLPO రమణయ్య
https://www.youtube.com/watch?v=E177n1Tz6ng

Address

NarayanaReddypeta Nellore
Nellore
524314

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when DCN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share