Navvatam Naa Hakku

Navvatam Naa Hakku Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Navvatam Naa Hakku, Media/News Company, Nellore.

05/11/2021
13/09/2018

మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ 2010లో చేసిన పోరాటానికి సంబంధించిన కేసు మళ్లీ తెరపైకొచ్చింది. బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. రేపోమాపో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకొచ్చింది. వారెంట్ ఎందుకు అమలు చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. బాబ్లీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందంటూ 2010లో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఆందోళన చేశారు. బాబ్లీ నిర్మాణం ఆపివేయాలని తెలంగాణ సరిహద్దు దాటి టీడీపీ బృందం చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో మహారాష్ట్రకు వెళ్లింది.

తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించగానే ధర్నా చేస్తున్న చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. 40మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఐటీఐ కళాశాలలో ఉంచారు. ఆ తర్వాత బలవంతంగా విమానం ఎక్కించి చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ పంపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలందరిపై లాఠీచార్జ్ కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు, ఆయన వెంట వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.

13/09/2018
బంగాళాఖాతంలో అల్పపీడనఅని ప్రకటించారు... జాగ్రత్తగా ఉండాలి కదా మరి...
12/08/2018

బంగాళాఖాతంలో అల్పపీడన
అని ప్రకటించారు...
జాగ్రత్తగా ఉండాలి కదా మరి...

నెల్లూరు లోని ఓ మెడికల్ కాలేజీలో ఈ బోర్డు కనిపించింది.. ఆ బోర్డు మీద రాసిన అక్షరాలకు అర్థం ఏంటో అర్థం కావడం లేదు.. తెలిస...
04/08/2018

నెల్లూరు లోని ఓ మెడికల్ కాలేజీలో ఈ బోర్డు కనిపించింది.. ఆ బోర్డు మీద రాసిన అక్షరాలకు అర్థం ఏంటో అర్థం కావడం లేదు.. తెలిస్తే మీరైనా చెప్పండి డియర్ ఫ్రెండ్స్...

14/07/2018

కాళ్ళు పట్టుకుంటే జీతాలు ఇస్తా.. - చిరుద్యోగులకు ఓ ఉన్నతాధికారి టార్చర్..

మీరు ఉద్యోగానికి రావొద్దు.. మీరు వచ్చినా జీతాలు మాత్రం ఇవ్వను.. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నిధులు లేవని చెప్తా.. మీరు నన్నేమి చెయ్యలేరు.. ఇంతకీ మీ కులమేంటి..? కాళ్ళు పట్టుకోండి ఒక నెల జీతం ఇస్తా.. ఇది సామాజిక వన విభాగంలో ఓ ఉన్నతాధికారి కింద స్థాయి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరు..
మీరు చదివింది అక్షరాల నిజం..
సామాజిక అటవీ విభాగంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన దాదాపు తొమ్మిది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఐదు మందికి జీతాలు ఇవ్వకుండా ఓ ఉన్నతస్థాయి అధికారి ఇబ్బందులు పెడుతున్నదంట.. తన సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తూ వారికి నెల నెలా జీతాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నారు. దీనితో జీతాలు తమకు ఎందుకు ఇవ్వడంలేదని సదరు ఉద్యోగులు ప్రశ్నింస్తే " నా కాళ్ళు పట్టుకోండి, మీకు జీతాలు వచ్చేలా చేస్తా అంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.. ప్రభుత్వం విధించిన టార్గెట్ లు చేరుకునేందుకు కష్టపడుతున్నా ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలి తమ మనసు కష్టపెడుతోందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జీతాలు ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా నిధులు లేవని తప్పుడు లెక్కలు చూపిస్తూ మముల్ని ఇబ్బంది పెడుతున్నారని వారు కన్నీతిపర్యంతం అవుతున్నారు..
దాదాపు ఏడాది గా జీతాలు లేకుండా ఆఫీస్ లో వెట్టి చాకిరి చేస్తున్నామని ఇంట్లో పూట గడవక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు..
తన సామాజిక వర్గానికి చెందిన కొందరికి ఆయన అండగా ఉంటూ మముల్ని పురుగులు చూసినట్లు చూస్తున్నారని, మాకు జీతాలు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు..
పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఇదే విషయం సదరు ఉన్నతాధికారి చెప్తే " మీది ఏ కులం అని అడుగుతున్నారని వారు వాపోతున్నారు..
ఆ శాఖలో పని చెయ్యని ఓ ఉద్యోగి ద్వారా ఆఫీస్ పనులు చేపించుకుంటు పర్సెంటేజ్ లంచాలు తీసుకుంటున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ సదరు ఉన్నతాధికారి అవినీతికి పాల్పడుతున్నాడని, తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు..

ఈ వ్యవహారం పై కలెక్టర్ దృష్టి పెట్టి తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకువాలని కాంట్రాక్ ఉద్యోగులు కోరుతున్నారు..

01/07/2018

#ఉచిత_సలహాలు



#వర్షాకాలంలో_మందు_ప్రియులు_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు..

#దయచేసి అతి చల్లగా ఉన్న బీర్లను త్రాగకండి.

#మందులోకి శుభ్రమైన మంచి నీరే కలపండి.వాటర్ ప్యాకెట్స్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం.

#కల్తీ మందు గుర్తించడానికి సీనియర్ డ్రింకర్స్ సలహాలు తీసుకోగలరు.

#ఈ కాలంలో బార్లలో శుభ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే మంచి అడ్డా ఎంచుకోవాలి. వీలైతే భార్య పుట్టింటికి వెళ్లిన ఫ్యామిలీ అడ్డా అయితే బెటర్.

#ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసుకుంటే వర్షం పడినా ఒక్క పెగ్గు కుడా మిస్ అవ్వకుండా ఉంటారు.

#ఇక స్టఫ్ విషయానికి వస్తే..ఎక్కువగా ఆయిల్ లేనివి అయితే బెటర్.

#కిక్ కోసం వాడే ఫిష్ ఫ్రై,ఎగ్స్,నాన్ వెజ్ ఐటమ్స్ బదులు బాదాం లాంటి బలమైన ఫుడ్ సౌకర్యంగా ఉంటుంది.లేకపోతే కడుపులో షేర్ ఆటో తిరిగే ప్రమాదం ఉంది.

#పర్మిట్ రూమ్స్ దగ్గర అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి ముందుగానే అన్ని చెక్ చేసుకొని సిట్టింగ్ ప్రారంభించాలి.

#ముఖ్య_గమనిక : పెళ్ళానికి భయపడే వాళ్ళు తాగకుండా ఉండడం వీలైతే మందే మానేయడం బెటర్. లేక పోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు.

#ఒకవేళ మందు ఎక్కువైనంకా " టూ వీలర్" పై
లాంగ్ డ్రైవ్ చేయలనిపిస్తే "హెల్మెట్"తప్పనిసరి గా వాడండి ఏ కంపనీ హెల్మెట్ అనేది మీ ఇష్టం...

#ప్రధాన_డిమాండ్ : శని,ఆదివారాలని మందుడేలుగా గుర్తించి డ్రంకెన్&డ్రైవ్ లేకుండా చూడాలి.

#చివరగా..తాగి శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటూ రాష్ట్రాన్ని చల్లగా ఉంచే మందుబాబులు వర్ధిల్లాలి..!
😋😆😂😝😉😍😛😃😀😊

The Bullet News...ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో వెళుతున్నారు. వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడ...
11/05/2018

The Bullet News...

ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో వెళుతున్నారు. వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.
సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు .మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.
మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది...... చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.
కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు – అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.
లేదు అర్జునా....... ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు.
అతని హృదయం ద్రవించింది.
కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.
నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది…దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.
ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా........, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా.........., అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.
అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Address

Nellore

Telephone

9490245458

Website

Alerts

Be the first to know and let us send you an email when Navvatam Naa Hakku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share