Asthram News

Asthram News జాతీయ వాదులకు, సనాతన ధర్మ పరులకు హ్రృ?

28/09/2025
26/09/2025

అది గుజరాత్‌ అక్కడ అలాంటివి సహించరు..
తోలు తీస్తారు గుజరాత్ పోలీసులు.

గర్బా నృత్యం చేస్తున్న హిందూ మహిళల గర్బా పండల్ పై దాడి ఒక బాలుడిని గాయపరిచిన 60 మంది శాంతి కాముకులిని అరెస్ట్ చేసి తొక్కి నార తీసిన గుజరాతి పోలీసులు.

ట్రంప్ చాబహర్ పోర్ట్ స్ట్రాటజీ భారత్‌కి నష్టాన్ని చేకూరుస్తుందా? పరిష్కారం ఒక్కటే...************************************...
22/09/2025

ట్రంప్ చాబహర్ పోర్ట్ స్ట్రాటజీ భారత్‌కి నష్టాన్ని చేకూరుస్తుందా? పరిష్కారం ఒక్కటే...
********************************************
డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య (Middle East) ప్రణాళికను చాలా శక్తివంతంగా మలచుకుంటున్నారు. దీనికి చాబహార్ పోర్ట్ కీలకంగా మారనుంది, ఇది భారత్ కి కొంత క్లిష్టమైన సమస్య కానుంది.. దీని గురించి మనం ఈ రోజు చర్చిద్దాం.

ట్రంప్ గేమ్ చాలా సింపుల్‌ అధిక సుంకాలు విధిస్తూనే మోడీజీ నాకు మంచి మిత్రుడు అంటూ పొగడటం. మరియు గంటల వ్యవధిలోనే భారత్ దీర్ఘకాల ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ఈ మధ్య ట్రంప్ కి రోజువారీ పనిగా మారింది. అమెరికా చాబహార్ పోర్ట్‌కి ఇచ్చిన సాంక్షన్స్ వెవర్‌ను రద్దు చేయడం కూడా ఇలాంటిదే.

2018లో భారత్‌కి ఒక ప్రత్యేక వెవర్ లభించింది. దాని ద్వారా ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టొచ్చు. ఇది దానం కాదు భారత్‌కి అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియా, రష్యా చేరుకోవడానికి పాకిస్తాన్‌ను బైపాస్ చేసే కీలక ద్వారం.

చాబహార్ పోర్ట్‌ ప్రాముఖ్యత: ఇది భారత్‌కి చాలా కీలకమైనది. వాజ్‌పేయి గారి కాలం నుంచే (2003) భారత్ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ భూ మార్గం ద్వారా రష్యాని చేరుకోవడానికి అడ్డుపడింది. అలాంటి పరిస్థితిలో చాబహార్ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. ఇది అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియా, రష్యా చేరుకోవడానికి కీలకం. INSTC కారిడార్‌లో ఇది ప్రధానమైన కనెక్టివిటి. 2016లో భారత్ – ఇరాన్ – అఫ్గానిస్తాన్ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2017లో తొలి షిప్‌మెంట్ అఫ్గానిస్తాన్ చేరింది. 2024లో భారత్ 10 ఏళ్ల ఆపరేషనల్ కంట్రోల్ పొందింది. ఒక కల నెరవేరినట్టే కనిపించింది.

కానీ ట్రంప్ సడన్ గా గేమ్ షురూ చేశాడు. అమెరికా విదేశాంగ విధానంలో ఒకటి మెచ్చుకోవచ్చు ఇజ్రాయెల్ కి అన్ని వేళలా రక్షణగా ఉండటం. ఇజ్రాయెల్ శత్రువు ఇరాన్ కావడంతో అమెరికా కొద్ది నెలల క్రితం కూడా చూశాం ఇరాన్ అణుస్తావరాలపై బాంబులు వేసింది. ఇప్పుడు ఇరాన్ ని ఆర్థికంగా దెబ్బతీయడం, పెట్టుబడులన్నీ ఆపివేయడం, ఇండియా – ఇరాన్ కనెక్టివిటీని బ్లాక్ చేయడం. అందుకే చాబహార్ వెవర్ రద్దు అంటే కేవలం ఇరాన్‌పై దెబ్బ కాదు, భారత్ వ్యూహాత్మక కలలపై కూడా దెబ్బతీయడమే.

ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ మళ్లీ పాకిస్తాన్‌తో దగ్గరవ్వడం. బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ రీ-ఓపెన్ కోసం పాకిస్తాన్ సాయం. సౌదీ–పాకిస్తాన్ కొత్త డిఫెన్స్ డీల్. గల్ఫ్‌లో గొడ్డు చాకిరీ చేయబోయేది పాకిస్తాన్ సైనికులే నేనయితే పాకిస్తాన్ మానవ వనరుల్ని అమ్ముకుంటుంది అంటాను. ( ఇటువంటి వ్యాసాల కోసం MegaMindsIndia వెబ్ సైట్ ని సందర్శించండి.)

అమెరికా విమానాలు మొన్న వరుసగా పాకిస్తాన్ చేరాయి,
దీని అర్థం భారత్‌ ని‌ ఇబ్బందులకి గురిచేయడమే. చాబహార్ ప్రాజెక్ట్‌కి అనిశ్చితి. రష్యా–సెంట్రల్ ఆసియా మార్గం కష్టతరమవుతుంది. ఇండియా ఇరాన్ సంబంధాలపై ఎంతోకొంత ప్రభావం. అమెరికా మాత్రం భారత్‌ను IMEC (India–Middle East–Europe Corridor) వైపు మరలేట్లు చేయాలని చూస్తోంది అది అత్యంత ఖర్చుతో కూడుకున్న మార్గం.

ఇరాన్ అమెరికాకు మూడు ప్రధాన సమస్యలు తెస్తుంది. అందుకే ఇలా ఇరాన్ ని ఆర్దిక ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. పనిలో పనిగా భారత్ కి కూడా ‌నష్టాన్ని చేకూరుస్తుంది. ఇరాన్ – ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు, ఇరాన్ ఇండియా - రష్యా మార్గానికి అనువైన ప్రదేశం, గల్ఫ్‌లో US ఆధిపత్యానికి ఇది సవాలు. అందుకే ఇరాన్ పై ట్రంప్ తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాడు. దీని వలన లాభం ఏమిటంటే ఇరాన్‌ని పూర్తిగా ఒంటరిని చేయడం, భారత్‌పై ఒత్తిడి పెంచడం.

ఇక మన ముందున్న ప్రశ్నలు – చాబహార్‌పై పనిచేస్తున్న భారత అధికారులపై US సాంక్షన్స్ ఉంటాయా? భారత్ వ్యుహాత్మకంగా వ్యవహరిస్తుందా? US ని ఎదురించి అక్కడే పోర్ట్ అభివృద్ధికై పనిచేస్తుందా? లేక ఇరాన్ తో స్నేహాన్ని వదిలేస్తుందా ఇలా అనేక సమస్యలు మన ముందున్నాయి.

రాబోయే సంవత్సరాల్లో గల్ఫ్ వార్స్‌లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ సౌదీ రియాద్ వైపు యుద్ధం చేస్తుంది. అమెరికా మళ్లీ అఫ్గానిస్తాన్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇరాన్‌తో అమెరికా ఢీకొనడం కూడా ఖాయం అనిపిస్తుంది.

ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తు ను నిర్ణయిస్తాయి. స్ట్రాటజిక్ ఆటానమీ కాపాడుకోవడం (అంటే భారత్ "ఏకపక్షంగా" ఏ దేశం పై ఆధారపడకుండా ఉండటం). అందుకే భారత ప్రధాని మోడీ జీ మనం విదేశాలపై ఆధారపడటమే మనకు ప్రధానమైన శత్రువు అంటూ‌ భావ్ నగర్ గుజరాత్ లో చిప్ అయినా షిప్ అయినా స్వదేశీయంగా తయారుచేసుకుందాం అంటూ స్వదేశీ పై తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక ఆయుధం స్వదేశీ. స్వదేశీ మన నిత్య జీవితం లో భాగమైన రోజు ఏ దేశం మనపై పెత్తనం చలాయించలేదు. జయ్ హిందురాష్ట్ర.

రాజశేఖర్ నన్నపనేని, Mega Minds
8500581928

08/09/2025

మీకు తెలుసా..??

ప్రస్తుతం రాహుల్ గదే మలేసియాలో ఉన్నాడు. అలాగే జార్జీ సోరెస్ కుమారుడైన అలెగ్జాండర్ సోరోస్ కూడా మలేసియాలోనే ఉన్నాడు..

భారత్ మొదలుపెట్టిన బిగ్ గేమ్ డీ-డాలరైజేషన్*************************************ప్రపంచ వ్యాపార రంగంలో ఈసారి భారత్ వేయబోయే...
02/09/2025

భారత్ మొదలుపెట్టిన బిగ్ గేమ్ డీ-డాలరైజేషన్
*************************************
ప్రపంచ వ్యాపార రంగంలో ఈసారి భారత్ వేయబోయే అడుగులు మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తరువాత తీసుకున్న నిర్ణయాలు మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అలాగే అమెరికా టారిఫ్ ల కి ప్రత్యామ్నాయంగా మనం చైనాతో కలిసి నడవడం మూలంగా, పొరుగు దేశం తో కనీస సత్సంబంధాలు కలిగి ఉండాల‌నే నియమంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎవరైన పొరుగున ఉన్న పెద్ద దేశం లేదా కుటుంబం తో హద్దుల తగాదా ఉంటే అది ఇద్దరికి మంచిది కాదు. ఈ నేపథ్యం లో భారత్ ముందు చైనాతో సరిహద్దు సమస్యలకు చెక్‌ పెట్టేందుకు. SCO మీటింగ్ లో పాల్గొని Security - Connectivity - Opportunity గురించి మాట్లాడి మన‌ ముఖ్య ఉద్దేశ్యం ను వెలిబుచ్చింది. పొరుగు పోరును ఒక కొలిక్కి తెచ్చింది.

ఇప్పుడు అమెరికా యొక్క నీతి మాలిన చర్యలను మనం ట్రంప్ తో ఆపరేషన్ సిందూర్ తరువాత విభేదించింట్లు అనిపించినా మన నాయకత్వం 2015 నుండే ఆలోచన చేసింది. మన దేశం లో అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి. అవి ఒక దానికి ఒకటి సంబంధాలు ఉండవు అనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా అనేక సంబంధాలు ఉంటాయి. భారత్ 2015 నుండి BRICS సభ్యత్వ దేశాలలో మన బలమైన వాణిని వినిపిస్తు‌‌న్నాము. ప్రపంచ మనుగడకు ఏది మేలో అది చేస్తున్నాము.

మనం 2015 నుండి డాలర్ తో కాకుండా రూపాయలతో లేదా దిరమ్, రూబుల్స్ తో వ్యాపారం చేయాలని భావించాము కానీ అది అమలులోకి తీసుకురావడానికి, BRICS దేశాలకు అర్దంకావడానికి దాదాపు పదేళ్లు పట్టింది. భారత్ 2016 లో De-Monetization చేసింది, అది కే‌ంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినా కొంత ఊపిరిపీల్చుకున్నట్లైంది. అదే తరహాలో ప్రపంచ వ్యాపారాలు, మూలధనం సంబంధించి కూడా మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాము. అదే De-Dollarization దీనిని చడీ చప్పుడు లేకుండా చేసేశాము, చేస్తున్నాము. నేను వారం క్రితం వ్రాసిన వ్యాసంలో భారత్ ప్రజానికం పదిటన్నుల బంగారాన్ని కొన్నది అమెరికా కి ఇది పెద్ద దెబ్బ అంటూ చర్చించాను. అలాగే డీ డాలరైజేషన్ ని BRICS దేశాలు అమలుపరచడం మొదలుపెట్టాయి. అది కూడా ఈ వ్యాసం లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దశాబ్దాలుగా, అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఆధిపత్యం చెలాయిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ శక్తి ప్రదర్శనకు ఆధారం. భారత చరిత్రలో స్వాతంత్య్రం రాక ముందు మన రూపాయికి, డాలర్ కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కాని అది ఇప్పుడు అత్యంత కనిష్ట పతనానినికి చేరింది. ఏ రిజర్వ్ కరెన్సీ శాశ్వతం కాదు. ఎలాగైతే కొన్ని సామ్రాజ్యాలు గొప్పగా వెలుగొంది కూలిపోయాయో, అలానే ద్రవ్య ఆధిపత్యం కూడా కూలిపోతుంది. డాలర్ కి కూడా కోలుకోలేని దెబ్బ తగలబోతుంది. September 1, 2025 నుండి మనం డీ-డాలరైజేషన్ ని చూస్తాము. నిశ్శబ్దంగా చడీ చప్పుడు లేకుండా క్రమంగా జరుగుతున్న అతిపెద్ద గేమ్ De-Dollarization.

బంగారం అమెరికా నిల్వలను మించింది: 1996 తర్వాత తొలిసారిగా, ప్రపంచ కేంద్ర బ్యాంకులు తమ నిల్వలలో అమెరికా నిల్వల కంటే ఎక్కువ బంగారం కలిగి ఉన్నాయి. అమెరికా ( రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం మొదలయిన తరువాత) రష్యా నిల్వలని ఆపేసిన ( ఫ్రీజ్ ) చేసిన కొద్ది నెలలకే, డాలర్ ఆధారిత ఆస్తులపై అనుమానం పెరిగి, బంగారం వైపు తిరిగి మొగ్గుచూపారనే విషయాలు మీరు చదివి ఉండవచ్చు. నిజంగా అదే జరిగింది.

బంగారం కొనుగోలు మనకు మరియు BRICS దేశాల పాలిట వరమయ్యింది. 2022 తరువాత గణాంకాలను ఒకసారి గమనిద్దాం..
▪️2022లో కేంద్ర బ్యాంకులు 182 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి.
▪️2023లో ఆ సంఖ్య 237 టన్నులకు పెరిగింది.
▪️2024లో అది 1,180 టన్నులకు ఎగబాకింది.
▪️2025లో కేవలం బ్రిక్స్ దేశాలు రెండో త్రైమాసికంలోనే 166 టన్నులు కొనుగోలు చేశాయి.

ఈ కొనుగోలు పెరుగుదల ఎదో అనుకోకుండా జరిగింది కాదు. డాలర్ ఆధారిత ఆస్తులపై పెరుగుతున్న అనుమానాలు, ఆంక్షల భయాన్ని ప్రతిబింబిస్తోంది.

ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ కూడా తన నిల్వలలను మార్చివేసింది. ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న విదేశీ మారక నిల్వలున్నప్పటికీ, భారత్ అమెరికా నిల్వలలోని వాటాను 2024లో $242 బిలియన్ ల నుండి 2025లో $227 బిలియన్‌ లకి తగ్గించింది. అదే సమయంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ 40 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. కేవలం మన ఒక్క దేశమే కాదు గ్లోబల్ సౌత్ అంతటా ఇదే ధోరణి. కేంద్ర బ్యాంకులు డాలర్ వాటాను తగ్గిస్తూ, చడీచప్పుడు లేకుండా బంగారం రూపంలోకి మార్చి వేసాయి.(ఇటువంటి వ్యాసాల కోసం MegaMindsIndia వెబ్‌సైట్ ని సందర్శించండి)

1990ల చివర్లో 70% పైగా ఉన్న డాలర్ వాటా, ఇప్పుడు 60% లోపుకు పడిపోయింది. కొంతమంది అంచనాల ప్రకారం ఇది 46–58% మధ్య ఉంది. అదే సమయంలో, బంగారం ప్రపంచ కేంద్ర బ్యాంకు రిజర్వుల్లో 20% వాటా సాధించింది, ఇది యూరో (16%) కంటే ఎక్కువ.

ఒకప్పుడు అమెరికా ఆస్తుల్లో $1 ట్రిలియన్ ల పైగా కలిగి ఉన్న చైనా, ఇప్పుడు దానిని $756 బిలియన్‌ లకి తగ్గించింది. గ్లోబల్ సౌత్ దేశాలు మొత్తం సుమారు $9 ట్రిలియన్ డాలర్ ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ, కొత్త కొనుగోళ్లు అమ్మకం కాకుండా తగ్గించడం ద్వారా డాలర్ తో సంబంధాలు తగ్గిస్తున్నాయి.

డీ-డాలరైజేషన్ ఎందుకు జరుగుతోంది? ఈ మార్పుకు అనేక కారణాలు ఉన్నాయి: రష్యా నిల్వలు నిలిపివేయడం, చైనా మీద కూడా ఆంక్షలు విధిస్తారనే భయం కేంద్ర బ్యాంకులను అప్రమత్తం చేసింది. తైవాన్ సమస్య మరో ఆంక్షలకు దారితీస్తుందని భయాలు పెరుగుతున్నాయి. అమెరికాకి పెరుగుతున్న అప్పులు, క్వాంటిటేటివ్ ఈజింగ్, ఆర్థిక అనిశ్చితి అనేక కారణాలతో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. బ్రిక్స్ ఎదుగుదల ప్రపంచ జీడీపీ లో 40% జనాభాలో 46% చమురు ఉత్పత్తిలో 40% వాటా కలిగిన బ్రిక్స్ దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా పరస్పరం వాణిజ్యం చేసుకోగలుగుతున్నాయి.

డీ-డాలరైజేషన్ నేడు నెమ్మదిగా, స్తబ్దుగా జరుగుతోంది. కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి, మార్కెట్లు దెబ్బతినకుండా క్రమంగా డాలర్ బంధం తగ్గిస్తున్నాయి. కానీ చరిత్ర చెబుతున్నది ఏమిటంటే ఒక కీలక సంఘటన (యుద్ధం, ఆంక్షలు, ఆర్థిక సంక్షోభం) వస్తే ఈ మార్పు ఒక్కసారిగా వేగం అందుకుంటుంది.

అమెరికా అప్పుల ఊభిలో కూరుకుపోయింది. నిల్వల కోసం కొత్త కొనుగోలుదారులు దొరకకపోతే, అమెరికా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరింత ధనాన్ని ముద్రించాల్సి వస్తుంది. దీనికి తోడు అమెరికా ని డీప్ స్టేట్, ఓకిజం, ఎల్.జి.బి.టి, ముస్లిం లు, మెక్సికన్ లు అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదంతా అమెరికా స్వయంకృతాపరాధం.

మన ముందున్నది ఒక చారిత్రాత్మక ఆర్థిక పునర్నిర్మాణం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి, కేంద్ర బ్యాంకులు అమెరికా నిల్వల కన్నా బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్ సహా గ్లోబల్ సౌత్ దేశాలు నిశ్శబ్దంగా తమ రిజర్వులను మార్చుకుంటున్నాయి. బ్రిక్స్, జీ7కి ప్రతిబంధకంగా ఎదుగుతోంది.

డాలర్ ఒక్కసారిగా కనుమరుగవ్వదు, కానీ దాని ఆధిపత్యం క్రమంగా క్షీణించే దశలో నడుస్తోంది. గతంలో ఆ ప్రయత్నం చేసిన దేశాలు చివరకు అమెరికాకు వశమైపోయిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే, భారత్ మాత్రం ఈ విషయంలో తన అడుగులు స్పష్టంగా వేస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఒక మల్టీ–పోలార్ కరెన్సీ యుగం వైపు పరుగులు తీస్తోంది - అంటే డాలర్‌పై ఆధారపడకుండా పలు దేశాల కరెన్సీలు ప్రపంచ వాణిజ్యంలో సమాన ప్రాధాన్యం పొందే దశ. రాబోయే కొద్ది సంవత్సరాల్లో డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గిపోవడం మనం చూడబోతున్నాం.

-రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.
085005 81928

భారత్ ఎదుగుదల ముందు అమెరికా కుట్రలు కూలిపోతు‌‌న్నాయి...*******************************************అమెరికాకి ఎవరైనా పోటీ ...
01/09/2025

భారత్ ఎదుగుదల ముందు అమెరికా కుట్రలు కూలిపోతు‌‌న్నాయి...
*******************************************
అమెరికాకి ఎవరైనా పోటీ అనుకుంటే ఆ దేశాలను ఎలా దెబ్బకొడుతుంది, అలాగే భారత్ అమెరికాకి ప్రత్యామ్నాయంగా చైనాతో కలిసి వెళుతుంది. కానీ చైనా భారత్ తో ఎందుకు కలిసి నడవాలి, ఇలాంటి విషయాలపై ఈ వ్యాసంలో పరిశీలిద్దాం...

చైనా భారత్ తో ఎందుకు కలిసి నడవాలి:
లడాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యూహాత్మక స్థావరం. ఇది ఇప్పుడు భారత ఆర్మీకి అద్భుత బలం ఇస్తోంది. గతంలో లేహ్‌ నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి రెండు రోజులు పట్టేది. కానీ కొత్త రహదారి వలన కేవలం ఆరు గంటల్లోనే సైన్యం చేరుతోంది.

13,400 అడుగుల ఎత్తులో నిర్మాణంలో ఉన్న న్యోమా ALG పూర్తవగానే ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవుతాయి. ఇప్పటికే దౌలత్ బేగ్ ఓల్డీ, ఫుక్చే, చుషుల్ ఎయిర్‌స్ట్రిప్‌లు బలోపేతం అయ్యాయి. దీంతో ఇండియన్ ఆర్మీ ఎత్తైన ప్రాంతాల్లో 12 నెలలూ బలగాలను నిలుపగలుగుతోంది. ఆయుధాలు, ఇంధనం, ఆహారం, మెడికల్ సపోర్ట్ 365 రోజుల్లోనూ చేరడం సాధ్యమైంది.

అరుణాచల్‌లోని సెలా టనెల్ వలన తవాంగ్‌ ప్రాంతానికి చలికాలంలో కూడా సైన్యం 24×7 చేరగలుగుతోంది. లదాఖ్‌లో నిర్మాణంలో ఉన్న శింకు లా టనెల్ 15,855 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యున్నత టనెల్‌గా నిలవనుంది.

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) గత ఐదేళ్లలో ₹16,000 కోట్లతో 450 ప్రాజెక్టులు పూర్తి చేసింది. రహదారులు, వంతెనలు, టనెల్లు, ఎయిర్‌ఫీల్డ్స్ ఇవన్నీ కలిపి భారత్ చైనాకు సమాధానం చెప్పే స్థాయికి తీసుకెళ్లాయి. మరియు చైనా కు భారత్ లో జరిగే వ్యాపారం గత పదేళ్లలో దారుణంగా పడిపోయింది, అందుకే చైనా మనతో కలిసి నడవాలనుకొంటోంది.

అమెరికా ఎవరైనా ఎదుగుతుంటే చూస్తూ తట్టుకోలేదు, ఎలాగైనా నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. మొదట జపాన్ తరువాత చైనా ఇప్పుడు భారత్?

ప్రపంచ రాజకీయాలను మనం నిశితంగా గమనిస్తే, ఏదైనా దేశం అమెరికాకి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దగ్గరగా వచ్చిందంటే దానిని అమెరికా వెంటనే ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తుంది. అమెరికా విధానం 1970ల నుండి ఇప్పటి వరకు అలానే వుంది.

మొదట జపాన్ ని కోలుకోలేని దెబ్బకొట్టింది. అదెలాగో చూద్దాం.. 1970-80 లలో జపాన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సోనీ, టయోటా, తోషిబా వంటి కంపెనీలు అమెరికన్ కంపెనీలను మించి వ్యాపారాన్ని చేశాయి. ఆటోమొబైల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ఆధిపత్యం సాధించింది. ఈ ఎదుగుదలతో అమెరికా ఆందోళన చెందింది. 1985 లో జపాన్ మరియు జర్మనీ దేశాలు తమ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ దాదాపు 50% పెరిగాయి. UK మరియు ఫ్రాన్స్ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. ప్లాజా అకార్డ్ అనేది డాలర్ విలువను తగ్గించడానికి మరియు ఈ 4 దేశాల మార్కెట్లలో US ఎగుమతులను మరింత పోటీతత్వంతో ఉండేలా చేయడానికి చేసిన ప్రయత్నం. 1985లో ప్లాజా అకార్డ్ ఒప్పందం ద్వారా యెన్ విలువను పెంచేలా బలవంతపెట్టింది అమెరికా. రెండు సంవత్సరాల్లో యెన్ 50% బలపడటంతో జపాన్ ఎగుమతులు కుప్పకూలాయి. ఆర్ధికంగా జపాన్ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ మిగతా మూడు దేశాలు అమెరికాతో జాగ్రత్తగా మసలుకొని బయటపడ్డాయి, మొన్న సమావేశం లో కూడా చూసుంటారు అమెరికా ఏదంటే అదే ఈ దేశాలు..
( ఇటువంటి వ్యాసాలకోసం MegaMindsIndia వెబ్‌సైట్ ని సందర్శించండి )
తరువాత చైనా వంతు వచ్చింది. 1980–2000 మధ్య చైనా GDP రెండంకెల వృద్ధి సాధించింది. WTO లో చేరి “ప్రపంచ కర్మాగారం” గా రూపాంతరం చెందింది. అమెరికా ఆశించినట్టుగా చైనా రాజకీయంగా మారిపోలేదు. బదులుగా, US మూలధనం, సాంకేతికత, మార్కెట్లను వాడుకొని తయారీ, 5G, AI, EVలు, సోలార్ వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించింది. 2014 నాటికి చైనా PPP పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. 2020 నాటికి ఆసియాలో అమెరికా సైనిక ప్రాధాన్యతకు సవాలు విసిరింది. దీనితో అమెరికా వ్యూహం మారింది. వాణిజ్య యుద్ధాలు, టెక్ ఆంక్షలు, ఇండో-పసిఫిక్ పొత్తులు అన్నీ చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా వచ్చాయి. కానీ జపాన్ లాగా చైనా లొంగలేదు. అమెరికా ఎన్నో ఎత్తులు వేసింది కానీ చైనా తట్టుకుని నిలబడింది. రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, బెల్ట్ రోడ్, BRICS, SCO వేదికలతో ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించింది.

ఇప్పుడు భారత్‌ పై అమెరికా దృష్టి పెట్టింది. ఈ దశాబ్దంలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది. IT, ఫార్మా, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష రంగంలోనే కాకుండా తయారీలో కూడా అగ్రగామిగా నిలుస్తోంది. 2035-40 నాటికి PPP (Purchasing Power Parity) GDPలో అమెరికాను కూడా అధిగమించే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే అమెరికా ఒత్తిళ్లు ప్రారంభించింది. 2019లో భారతదేశానికి ఉన్న GSP వాణిజ్య ప్రయోజనాలను తొలగించింది. రష్యన్ ఆయుధాల కొనుగోలుపై CAATSA ఆంక్షల బెదిరింపు వచ్చింది. చౌకైన రష్యన్ చమురుపై ఒత్తిడి తెస్తోంది. 50 % సుంకాలు విధించింది. రక్షణలో అమెరికన్ ఆయుధాలను కొనమని బలవంతం చేస్తోంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఇలాంటి వాటిని భూచిగా చూపుతోంది. అమెరికా సలహాదారుడు నవారే రష్యన్ ఆయిల్ కొని బ్రాహ్మణులు కోట్లు గడిస్తున్నారు అంటూ కులాల మధ్య గొడవలకు ప్రయత్నం చేస్తోంది. అలాగే డీప్ స్టేట్, వోకిజం ఇలా అనేకం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లలో అస్థిరత తీసుకొచ్చి, భారత్ పైకి అక్రమ వలసలని ప్రోత్సహిస్తుంది, డాలర్ ఆధిపత్యం ద్వారా ఒత్తిడి, NGOలు, మీడియా ద్వారా రాజకీయ జోక్యం, ఇలా ఒకటేమిటి అనేకం ఇవన్నీ భవిష్యత్తులో భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్లే.

ఈ పరిస్థితిలో రష్యా మనకు కీలకం. రాయితీ చమురు, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, BRICS-SCO వేదికల ద్వారా అమెరికా నియంత్రణ వెలుపల మన స్థానం బలపడుతోంది. రష్యాతో సంబంధాలు తెగిపోతే, భారత్ కూడా జపాన్ లాగా ఆధారపడే పరిస్థితిలో పడిపోవచ్చు.

జపాన్ అమెరికాను నమ్మి తన భవిష్యత్తును కోల్పోయింది. చైనా తన స్వంత మార్గాన్ని నిర్మించుకొని, రష్యాపై ఆధారపడుతూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. భారత్ ఈ రెండింటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు అమెరికాకి చుక్కలు చూపించే ప్రక్రియ కుడా మొదలుపెట్టింది. BRICS, RIC (Russia-Indi-China) బలోపేతం చేస్తుంది. గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించే దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. కాబట్టి మనమంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిద్దాం..

Nannapaneni Rajasekhar
Mega Minds
8500581928

"దేశం ధర్మసత్రం కాదు" – చొరబాటుదారులపై కేంద్రం కఠిన చర్యలు*****************************************రోహింగ్యా చొరబాటు దార...
31/08/2025

"దేశం ధర్మసత్రం కాదు"
– చొరబాటుదారులపై కేంద్రం కఠిన చర్యలు
*****************************************

రోహింగ్యా చొరబాటు దారుల్ని తిప్పి పంపిస్తున్న భారత ప్రభుత్వం. భారతదేశం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముప్పు రోహింగ్యా చొరబాటుదారులు, బాంగ్లాదేశీ అక్రమవలసలు. బాంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా ప్రవేశించిన ఈ చొరబాటుదారులు సాధారణ పేదవాళ్లు కాదని అనేక ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు చెబుతున్నాయి. అక్రమ వ్యాపారాలు, మత్తు పదార్థాల రవాణా, నేరగాళ్లతో సంబంధాలు ఇవన్నీ రోహింగ్యా శిబిరాల చుట్టూ ఉన్న అంశాలుగా బయటపడ్డాయి.

ఓటు బ్యాంకు కోసం నీచ రాజకీయాలు:
భయబ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే, కొందరు ప్రతిపక్ష నేతలు వీరిని శాశ్వత ఓటర్లుగా మార్చేందుకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు చొరబాటుదారులకి అక్రమంగా జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దేశ భద్రతను పక్కన పెట్టి, కేవలం ఓటు రాజకీయాల కోసం ఈ విధానాన్ని అనుసరించడం దేశద్రోహం.

కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం:
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశ ప్రజలకు నిశ్చింతను కలిగించింది. ఢిల్లీలో పట్టుబడిన రోహింగ్యాలను ఆండమాన్ మార్గం ద్వారా మయన్మార్ తీరానికి పంపే నిర్ణయం ‘అక్రమ వలసదారులకు జీరో టాలరెన్స్’ అన్న సందేశం ఇస్తోంది. చాలామంది దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొదట అండమాన్ పంపి అక్కడ నుండి పడవల్లో మయన్మార్ బీచ్ లకి దగ్గరకు తీసుకెళ్లి పడవనుండి దింపేస్తున్నారు. దేశం లో ఉన్న ఏ ఒక్క అక్రమవలసదారుణ్ని వదలమని, చివరి రోహింగ్యా వరకు వెతికి పంపుతామని గృహ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మానవత్వం పేరుతో మోసం:
ప్రతిపక్షాలు దీన్ని “మానవత్వం లేని చర్య” అంటూ విమర్శిస్తున్నాయి. కానీ నిజం ఏమిటంటే భారత్ ఎన్నో దశాబ్దాలుగా శరణార్థులకు, అక్రమవలసదారులకి ఆశ్రయం ఇస్తూనే ఉంది. టిబెట్లు, శ్రీలంక తమిళులు ఎవరినీ వదలలేదు. కానీ చట్టబద్ధంగా వచ్చినవారికి, మనస్పూర్తిగా సమాజంలో కలిసిపోయినవారికి మాత్రమే సాయం చేయాలి. నకిలీ పత్రాలతో దేశాన్ని మోసం చేసేవారికి కాదు.

జాతీయ భద్రతే ప్రధానం:
ఇంటెలిజెన్స్‌ సంస్థలు అనేకసార్లు హెచ్చరించాయి రోహింగ్యా శిబిరాలు ఉగ్రవాద సంస్థలకు వసతి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని. హైదరాబాదు, జమ్మూ, ఢిల్లీ వంటి పట్టణాల్లో వీరి స్థావరాలు పెరుగుతుండటం గమనార్హం. ఇది కేవలం శరణార్థి సమస్య కాదు, జాతీయ భద్రత సమస్య.

భారత పౌరులుగా మారినట్టు నకిలీ ఆధార్, రేషన్ కార్డులు కలిగి ఉన్నవారిని నిజంగా భారత పౌరులా లేక రోహింగ్యాలా అనేది గుర్తించలేని స్థితి వచ్చింది. పౌరసత్వం నకిలీగా పొందడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే.

భద్రత, అభివృద్ధి ద్వంద్వ సూత్రం:
మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది “భద్రత లేకుండా అభివృద్ధి ఉండదు.” ఈ సూత్రాన్ని ఆచరణలో చూపుతూ, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇది కేవలం ఓ ప్రభుత్వ నిర్ణయం కాదు, దేశ భవిష్యత్తును రక్షించే చర్య.

ప్రతిపక్షాల కపట వైఖరి:
ఓటు బ్యాంకు కోసం దేశాన్ని బలిపశువుగా మార్చడం ప్రతిపక్షాల అసలు స్వరూపం. ఈ దేశంలో కోట్లాది నిరుద్యోగులు, పేదలు సహాయం కోసం ఎదురుచూస్తుంటే రోహింగ్యాలకే ప్రత్యేక సాయం చేయాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాలు కేవలం నినాదాలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.

ప్రభుత్వం సాహాసోపేతమైన నిర్ణయం:
భారత దేశం ఎవడుపడితే వాడు వచ్చి అక్రమంగా ఉండటానికి సత్రం కాదని, రోహింగ్యాలను వెనక్కి పంపించడం ద్వారా మోదీ సర్కార్ మరోసారి నిరూపించింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా దేశమే ప్రథమంగా భావించడం నిజమైన నాయకత్వానికి కొలమానం.

రోహింగ్యా చొరబాటు అరికట్టడం కేవలం ఒక సరిహద్దు సమస్య కాదు, ఇది భారత భవిష్యత్తును కాపాడే యుద్ధం. నిజమైన పౌరుల హక్కులను రక్షించడం, జాతీయ భద్రతను బలపరచడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. ఇవన్నీ ఈ నిర్ణయంతో సాధ్యమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం, భారత్‌ను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడుతుంది.

రాజశేఖర్ నన్నపనేని. Mega Minds
085005 81928

హిందూ యువ చైతన్య మహా పాదయాత్ర: దేవాలయాల పునరుజ్జీవనానికి నూతన శంఖారావం.********************************************తిరుప...
27/07/2025

హిందూ యువ చైతన్య మహా పాదయాత్ర: దేవాలయాల పునరుజ్జీవనానికి నూతన శంఖారావం.
********************************************
తిరుపతి జిల్లా తలకోన సిద్దేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభమైన హిందూ యువ చైతన్య మహా పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ జూలై 12న ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇప్పటికే రెండు వారాల మైలురాయిని దాటింది. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం రగిలించడం, గ్రామ దేవాలయాల పునరుద్ధరణపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ యాత్ర సాగుతోంది.

దేవాలయం – పల్లెల ఆత్మ
మన గ్రామ దేవాలయాలు కేవలం పూజలు, హారతులు జరిగే ప్రదేశాలే కావు. అవి మన సంస్కృతికి ప్రతిబింబం, సమాజానికి ఐక్యకేంద్రం. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో సాంస్కృతిక మూలాలను దెబ్బతీసే చర్యలు పెరుగుతున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ధర్మవ్యతిరేకులు ప్రవేశించడం ద్వారా విభజన వాదాలు నాటడం మూలాన గ్రామాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో దేవాలయాల ద్వారా సమాజంలో ధర్మస్ఫూర్తిని మేల్కొలపాలన్న సంకల్పంతో హిందూ యువ చైతన్య పాదయాత్ర ప్రథానమైన కారణం.

యువతలో ధర్మ చైతన్యం
వందల ఏళ్లుగా నిరాశలో మగ్గిన హిందూ సమాజం, గత పదేళ్లగా మళ్లీ స్ఫూర్తిని సంతరించుకుంటోంది. ఈ సమయంలో స్వామీజీ పాదయాత్ర మరింత ఉత్సాహాన్నిస్తుంది. యువతను ఆధారంగా చేసుకుని దేవాలయ కేంద్రంగా హిందూ ధర్మ చైతన్యానికి కమలానంద స్వామీజీ బాటలు వేస్తున్నారు. దేవాలయం కేవలం ఆరాధన స్థలం కాకుండా, సమాజ సమస్యలకు పరిష్కార కేంద్రమని ఈ యాత్ర మళ్ళీ గుర్తు చేస్తోంది.

పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
స్వామీజీ పాదయాత్రలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కలను నాటడం, పచ్చదనం కాపాడటం, నీటి వనరులను సంరక్షించడం, గోవుల ప్రాముఖ్యతని వివరిస్తూ ఇవన్నీ ఆధ్యాత్మిక జీవనంలో భాగమని ఆయన స్పష్టం చేస్తున్నారు. భూమాతను కాపాడటం కోసం కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రేరేపిస్తున్నారు. ఇవన్నీ జరిగితే మన భవిష్యత్తు బావుంటుందని గ్రామస్తులకు చాటి చెబుతున్నారు.

భాష, సంస్కృతి పునరుద్ధరణ
పాదయాత్రలో తెలుగు, సంస్కృత భాషల ప్రాధాన్యం ప్రత్యేకంగా చర్చించబడుతోంది. భాషల పరిరక్షణ లేకపోతే సంస్కృతి నిలవదని స్వామీజీ హెచ్చరిస్తున్నారు. యువత తమ భాషపై గర్వపడుతూ, దాని అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సామాజిక ఐక్యత – యాత్ర సారాంశం
దేవాలయ పునర్నిర్మాణం, సాంస్కృతిక విలువల పునరుద్ధరణ, కుటుంబాలలో విలువలు పెంచడం, గ్రామల్లోని కులాల మధ్య సద్భావనను తీసుకురావడం – ఇవన్నీ ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యాలు. ఉమ్మడి విలువలతో సమాజం బలపడుతుందని, గ్రామాలు సాంస్కృతిక కేంద్రాలుగా మళ్లీ వెలుగొందుతాయని స్వామీజీ హితవు పలికారు.

హిందూయువచైతన్య మహా పాదయాత్ర యువతలో భక్తిని, కర్తవ్యాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పే మహత్తర కార్యక్రమం. దేవాలయాల పునరుజ్జీవనం ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేస్తోంది. “దేవాలయం మన ఆత్మ, ప్రాణస్వరూపం. దాన్ని కాపాడటం ప్రతి హిందువు బాధ్యత” ఈ యాత్ర సారాంశం.

మన సంస్కృతిని కాపాడదాం – దేవాలయాలను నిలబెట్టుదాం – హిందూ చైతన్యాన్ని పునరుద్ధరించుకుందాం..

రాజశేఖర్ నన్నపనేని, మెగామైండ్స్.

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సోదర సోదరీమణులకు, పెద్దలకు నమస్కారం....*************************************మెగామైండ్స్ వెబ్...
11/06/2025

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సోదర సోదరీమణులకు, పెద్దలకు నమస్కారం....
*************************************
మెగామైండ్స్ వెబ్‌సైట్ ని గత పదేళ్లగా ఇష్టం తో, శ్రద్ధాభక్తులతో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ కోటి మందికి పైగా మన వెబ్‌సైట్ ని సందర్శించారు. రోజూ ఐదువేల మంది వీక్షిస్రున్నారు. నెలకు రెండు లక్షల మంది పైబడి వీక్షిస్తున్నారు.

పోయిన సంవత్సరం అత్యధికంగా ఒకే రోజు 60 వేల మంది యోగా దినోత్సవం రోజు వీక్షించడం జరిగింది. ఈ సారి కూడా ఒక లక్ష్యం తో జూన్ 21 యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున మన విశాఖపట్నం లో నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కనీసం ఆరు యోగాసనాలైనా నేర్పాలనే సంకల్పంతో మెగామైండ్స్ నుండి సుమారు యాబై ఆసనాలు పైబడి తెలుగు మరుయు English లలో వెబ్‌సైట్ ద్వారా యోగా ఆసనాలు ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాము.

ఈ సారి జూన్ 21 కి ఒక లక్షమందికి పైగా మన వెబ్‌సైట్ ని వీక్షించాలని ఆశిస్తున్నాము. దీనిలో భాగంగా రోజూ మన వెబ్‌సైట్ కనీసం ఒకసారైనా సందర్శించి యోగా దినోత్సవం కు సంబంధిత ఆసనాలు, ప్రాణాయామం, యమ నియమాలు ఇలా అష్టాంగ యోగ ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు.

మీ అందరికీ మా విన్నపం ఒక్కటే మెగామైండ్స్ ని ఇక నుండి రోజూ ఒక్కసారైనా వీక్షించండి.

దేశం కోసం మన ఆరోగ్యం కోసం మెగామైండ్స్ ని సందర్శించండి...

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి ఆరోగ్య భారత్ సమర్థవంతమైన భారత్ గా ఎదుగుతుంది.

తప్పక వీక్షించండి...

www.megaminsaindia.in

ధన్యవాదాలు... మీ రాజశేఖర్ మెగామైండ్స్.

International Day of Yoga 2025 - యోగ దినోత్సవం 2025 June 21
16/05/2025

International Day of Yoga 2025 - యోగ దినోత్సవం 2025 June 21

International Day of Yoga 2025 - యోగ దినోత్సవం 2025 June 21 yoga day 2025 yoga day 2025 theme yoga day quotes yoga day article yoga day telugu images

27/04/2025

ముంబైలో ఓ దేశభక్తుడు పాకిస్తాన్ జండా ని కాల్చేస్తే... యువకుడి పై బీకర దాడి చేసిన పాకిస్తాన్ ప్రేమికులైన శాంతి కాముకులు... 15 మంది‌ని ముల్లాస్ అరెస్ట్... ఇది మనదేశ పరిస్థితి...

17/04/2025

సుప్రిమ్ కోర్ట్ శిఖరాలపై మండిపడ్డ సామాన్యుడు... వక్ఫ్ చట్టం పై సంచలన వ్యాక్యలు చేసిన సుప్రిమ్ కోర్ట్

Address

Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when Asthram News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Asthram News:

Share