Gunturmedia

Gunturmedia ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కు

Sri Reddy బాబుల్ తుమ్మ Durga Prasad Jammula గుంటూరు మీడియా ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు కామెంట్ చెయ్యండి
25/07/2025

Sri Reddy బాబుల్ తుమ్మ Durga Prasad Jammula గుంటూరు మీడియా ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు కామెంట్ చెయ్యండి

అప్పటి ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ఈవిఎం వివి ప్యాడ్స్ డేటా మొత్తం కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు దానికి గిఫ్ట...
14/07/2025

అప్పటి ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా
ఈవిఎం వివి ప్యాడ్స్ డేటా మొత్తం కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు దానికి గిఫ్ట్ ఈ పోస్టింగ్ As of July 14, 2025, Mukesh Kumar Meena (IAS: AP:1998) is currently posted as the Principal Secretary to the Government in the Revenue (Excise) Department. He also holds the full additional charge as the Principal Secretary to the Government for the Industries and Commerce (Mines) Department. This posting was ordered with immediate effect on July 12, 2024, relieving Dr. N. Yuvaraj, IAS (2005), from the additional charge of the Industries and Commerce (Mines) Department.
అని ప్రజలు అనుకుంటున్నారు

03/07/2025

మధ్యాంద్రప్రదేశ్

అప్పట్లో జగన్ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నారని గగ్గోలు పెట్టిన ప్రజాస్వామ్య వాదులు ఒకసారి ఇప్పుడు బాబుగారు స...
03/07/2025

అప్పట్లో జగన్ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నారని గగ్గోలు పెట్టిన ప్రజాస్వామ్య వాదులు ఒకసారి ఇప్పుడు బాబుగారు స్టిక్కర్లు అదే "ఇది మంచి ప్రభుత్వం" అని ఇంటింటికి అతికించిన స్టిక్కర్ల కోసం చేసిన ఖర్చు 5,67,00,000/- అక్షరాల ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు......🫢

1993 మార్చి 7 రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ డీలక...
27/06/2025

1993 మార్చి 7 రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు మార్చి 8 తెల్లవారు ఝామున నర్సరావుపేటలో ఆగి, 4:10 కి తిరిగి బయలుదేరింది. పట్టణం లోని రైల్వే క్రాసింగు వద్ద సాతులూరి చలపతిరావు, గెంటెల విజయవర్ధనరావు అనే ఇద్దరు వ్యక్తులు బస్సెక్కి చిలకలూరిపేటకు టిక్కెట్టు తీసుకున్నారు. కొంతదూరం ప్రయాణించాక వారిద్దరూ బస్సులో పెట్రోలు విరజిమ్మారు. అది గమనించి బస్సు డ్రైవరు లైట్లు వేసి, బస్సును ఆపాడు. వారిద్దరూ కిందికి దిగిపోతూ ఆగిప్పుల్ల వెలిగించి బస్సుకు నిప్పు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 32 మందిలో 23 మంది సజీవదహనమై పోయారు. మిగిలినవారు తప్పించుకోగలిగారు. తప్పించుకున్నవారిలో ఇద్దరిని దుండగులు వెంటాడి, వారివద్ద నున్న డబ్బును దోచుకున్నారు.

గుంటూరు సెషన్సు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రెండేళ్ళ విచారణ తరువాత, 1995 సెప్టెంబరు 7 న నిందితులిద్దరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. [3] దోషులు హైకోర్టుకు అప్పీలు చెయ్యగా అది కింది కోర్టు విధించిన శిక్షను ధ్రువీకరించింది. దోషులు తిరిగి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోగా, 1997 ఆగస్టు 28 న అక్కడ కూడా శిక్షను ధ్రువీకరించారు. తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ దోషులు రాష్ట్రపతికి విన్నవించుకోగా, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ దాన్ని తిరస్కరించాడు. 1998 మార్చి 29 న దోషులకు ఉరి వేసేందుకు సన్నద్ధమయ్యారు.

అయితే ఒక్క రోజు ముందు, మార్చి 28 న, రచయిత్రి మహాశ్వేతాదేవి, రాష్ట్రపతి నుండి జ్ఞానపీఠ పురస్కారం అందుకునే సందర్భంలో, దోషుల తరపున మరొక క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతికి సమర్పించింది. ఆ వెంటనే, క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నందున, దానిపై నిర్ణయం వెలువడే వరకు ఉరితీతను ఆపాలని సుప్రీం కోర్టులో ఒక కేసు వేసారు. సుప్రీం కోర్టు వెంటనే దాన్ని విచారించి, ఉరిని ఆపాలని తీర్పునిచ్చింది. [2]

ఆ రాత్రే ఈ తీర్పును జైలు అధికారులకు పంపగా, మరుసటిరోజు తెల్లవారుఝామున అమలు చెయ్యాల్సిన ఉరిని ఆపారు. ఆ తరువాత వచ్చిన రాష్ట్రపతి, కె.ఆర్. నారాయణన్ ఆ క్షమాభిక్ష అభ్యర్థనపై స్పందించి, దోషులిద్దరికీ క్షమాభిక్ష ప్రసాదించాడు. దానితో ఉరిశిక్షను యావజ్జీవ జైలుశిక్షగా మార్చారు.
సేకరణ : ఆన్లైన్ ప్లాట్ ఫామ్

18/06/2025

కోర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసి పోలీసులని ఉపయొగించి ఆత్మహత్య చేసుకునేలా వేదించడమే కాకుండ నేడు జగన్ పరామర్శకు...
18/06/2025

కోర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసి పోలీసులని ఉపయొగించి ఆత్మహత్య చేసుకునేలా వేదించడమే కాకుండ నేడు జగన్ పరామర్శకు వస్తుంటే అతనో జూదకారిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ దుర్మార్గపు టీడీపీ పార్టీ

నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు దారితీసిన ఘటనలు.

2024 ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 2024 జూన్ 4న పాకాలపాడు పీఏసీఎస్‌ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లు కౌంటింగ్‌కు వెళ్లాడు. ఆయన కుమారుడు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్నాడు.

సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు 2024 జూన్ 4వ తేదీ ఉదయం ఏడుగంటల సమయంలో నాగమల్లేశ్వరరావును ట్రబుల్‌ మంగర్స్‌ బైండోవర్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. మధ్యా­హ్నం ఎన్నికల ఫలితాలు ఎన్‌డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో రెంటపాళ్లలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులకు దిగారు. నాగమల్లేశ్వరరావు ఇంట్లో ఆయన భార్య నందిని, కుమార్తె యశస్విని ఉన్నారు. ఇంటిమీద దాడిచేస్తున్న విషయాన్ని యశస్విని తన తండ్రి నాగమల్లేశ్వరరావుకు ఫోన్‌చేసి చెప్పింది.

పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయన ఫోన్‌ మాట్లాడబోతుండగా పోలీ­సులు ఫోన్‌ లాక్కున్నారు. 2024 జూన్ 5న సాయంత్రం మర్యాదగా గ్రామం విడిచి వెళ్లు .. లేకుంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపిస్తానంటూ సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాజేష్ కుమార్‌ బెదిరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు దూరంగా ఉంటే గొడవలు సర్దుబాటవుతాయని భావించిన తండ్రి వెంకటేశ్వర్లు కూడా నాగమల్లేశ్వరరావును గుంటూరులో సోదరుడు కొర్లకుంట శ్రీకాంత్‌ వద్దకు పంపాడు.

తనపై ఒక్క కేసు కూడా లేకపోయినా, ఇంటిపైకి వచ్చి గొడవచేసి దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులను వదిలేసి పోలీసులు తనను బెదిరించటంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు 2024 జూన్ 6న పేరేచర్ల వద్ద గడ్డిమందు కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడిన నాగమల్లేశ్వరరావు చివరికి మరణించాడు.

నాగమల్లేశ్వరరావుపై ఏ కేసు లేకపోయినా జూదకారిగా చూపే ప్రయత్నం చేయడం తెలుగుదేశం దగుల్బాజీ రాజకీయానికి నిదర్శనం. రౌడీషీటర్ అయిన వీరయ్య చౌదరీ దగ్గరికి లోకేష్ వెళితే తప్పు కాదు, ఏ కేసు లేని నాగమల్లేశ్వరరావు దగ్గరికి జగన్ వెళితే చనిపోయిన వ్యక్తిపై బురద జల్లుతూ తప్పు పడుతున్నాతంటే,.. ఈ తెలుగుదేశం వాళ్ళకన్నా సైకోలు ఉంటారా?








26/05/2025

నడి రోడ్డు పై రౌడీ లకు ట్రీట్మెంట్ అంటు పోలీస్ వీడియో

బాధితుల కథనం వేరు
ππππππππππππππππππππππππ
వారి మాటల్లో విందాం!
అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులుం!

భయభ్రాంతులకు గురవుతున్న తెనాలి ఐతానగర్ ప్రజలు!

ఆలస్యంగా ఆధారాలతో వెలుగులోకి వచ్చిన వీడియో!

కంప్లైంట్ ఇచ్చిన పోలీసు కానిస్టేబుల్ కన్నా చిరంజీవి PC: 6068 :

కన్నా చిరంజీవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్ కి సంబంధం లేదు. పోలీసు కానిస్టేబుల్ PC: 6068 కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని లేకపోతే మీ మీద అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు గారు చెప్పమన్నారని బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని యొక్క అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి ఈ యొక్క యువకులపై అబద్ధపు కేసు పెట్టినాడు. ఈ విధంగా 2 టౌన్ నకు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేసినారు.

Cr.No: 52/2025 గా నమోదు చేసి 3 రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేసినారు.

ది. 25-04-2025 నే ముద్దాయిలను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా తెనాలి 2 టౌన్ రాముల నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు దాష్టీకం ప్రదర్శించారు.

చేబ్రోలు జాన్ విక్టర్ S/O ఇజ్రాయెల్, 25 సంవత్సరాలు, మాల, చెంచుపేట, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా.

షేక్ బాబులాల్ @ కరిముల్లా @ కల్లా S/O అమీర్ భాషా, 21 సంవత్సరాలు, ముస్లిమ్, తిప్పర్ల బజార్ మంగళగిరి, గుంటూరు జిల్లా.

దోమా రాకేష్ S/O వాసు, 25 సంవత్సరాలు, మాల ఐతానగర్, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా.

అను వారలపై, వీరు ఇద్దరు మాల కులం, ఒకరు ముస్లిమ్ కమ్యూనిటీకి చెందిన యువకులపై తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు అతిక్రూరంగా బహిరంగంగా రోడ్లు మీదకు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టినారు. దోమ రాకేష్ అను అతనికి చేతులలో కాళ్ళలో రాడ్లు ఉన్నాయని చెప్పి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా 2 టౌన్ CI రాములు నాయక్ అతి కర్కశంగా అతని కాళ్ళపై ఎక్కి తొక్కి పెట్టగా 3 టౌన్ CI రమేష్ బాబు అతికిరాతకంగా అతనికి అలుపు వచ్చే వరకు విచక్షణారహితంగా కొట్టినారు. పోలీసు స్టేషన్ లో ముద్దాయిలను కొడతారని చంపుతారని తెలుసుగాని ఈ విధంగా బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా రోడ్ల మీదకు తీసుకొచ్చి వాళ్ళయొక్క పోలీసు దాష్టీకం ప్రదర్శించి చుట్టుప్రక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినారు.

నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి గాని, ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. కొట్టే హక్కు మీకు లేదు అని చెప్పిననూ పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.

ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని వాపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకుని పోలీసులు జులుం చూపిస్తున్నారు. ఈ విధమైన దాష్టీకం కేవలం దళితుల మీదే చూపిస్తున్నారు. 2 టౌన్ CI రాముల నాయక్ ఐతనగర్ కు చెందిన వారిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అమాయకపు వ్యక్తులపై అబద్ధపు మరియు అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా కర్కశత్వం చూపిస్తున్నారు. 3 టౌన్ CI రమేష్ బాబు నకు ఏ సంబంధం లేకపోయినా ఐతానగర్ 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ CI ఈ 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఎక్కడా ముద్దాయిలను కొట్టవలసిన అవసరం పని లేదు. ఈ చర్యలపై ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి బాధితులు వెళ్ళడానికి కూడా భయపడేలా చేస్తున్నారు. ఒకవైపు గౌరవ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ జరపమని చెప్తున్నా ఎక్కడన్నా కూడా అటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రబలంగా వున్నా కూడా పోలీసు వారు బహిరంగంగా ముద్దాయిలను తీసుకువచ్చి కొడుతున్నారు అంటే కేవలం ఒక తెనాలి ఐతానగర్ ప్రదేశాన్ని ఎన్నుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోటే ఇలాంటి చర్యలకు గురిచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

ఇప్పటికైనా పోలీసులు మీ పైఅధికారుల మరియు రాజకీయ నాయకుల మెప్పులు పొందడానికి అమాయకమైన దళిత, మైనారిటీలపై మీ జులుం చూపిస్తున్నారు. వేరే అగ్రకుల లేక రాజకీయ నాయకులకు లోబడి ఉన్న వ్యక్తులను యదేచ్ఛగా వదిలేస్తున్నారు. వారు చేసే అక్రమాలకు మీరు తోడ్పడుతున్నారు. ఒక దళితులు, మైనారిటీల పైనే పోలీసులు జులం సాగిస్తున్నారు.

ఈ విధంగా కానిస్టేబుల్స్ వారికి ఇష్టమైన వారి చేత గంజాయి, మత్తు పదార్థాలు యదేచ్ఛగా కానిస్టేబుల్స్ కనుసన్నలలో అక్రమ రవాణా విక్రయాలు జరుగుతున్నాయి!

పేకాట, జూదం, వ్యభిచారం, గంజాయి వీరి కనుసన్నలలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ
పైఅధికారులకు తెలుసు. వీరు కేవలం డబ్బులు ఇచ్చుకోలేని అమాయక ప్రజలపై అక్రమ కేసులు, అబద్దపు కేసులు బనాయించి విచక్షణారహితంగా కొట్టుచున్నారు.

ఈ విషయం మీద మీరు మీ చర్యలు మానుకుని ప్రజలకు దగ్గరగా ఉండి స్నేహపూర్వకంగా వ్యవహరించమని ప్రజలు కోరుతున్నారు. దీని మీద ప్రజా సంఘాలు, మైనారిటీ సంఘాలు, కుల సంఘాలు అంతా కూడా పెద్దయెత్తున ప్రతిఘటించగలరు!

25/05/2025

కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దొమ్మిలు,కబ్జాలు ఎక్కువయ్యాయ్

23/05/2025

🚨

రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ APMDCకి బదలాయించారు. ఆ గనుల విలువను రూ.1,98,000 కోట్లుగా లెక్కగట్టారు. ఈ గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేసి రూ.9,000 కోట్లు అప్పు తెస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడం దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. రాజ్యాంగంలోని 293/1 ప్రకారం ఇది తప్పు..చట్టవిరుద్ధం.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





22/05/2025

వైసీపీ హయాంలో మొత్తం రూ. 3,32,761 కోట్ల అప్పు చేస్తే..

కేవలం 12 నెలల కాలంలోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేశాడు.

వైఎస్ఆర్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులో.. 41% అప్పు కేవలం ఒక్క సంవత్సరంలోనే, ఇప్పటికే చంద్రబాబు చేశాడు

YS Jagan Mohan Reddy

22/05/2025

స్టేట్ ఓన్ రెవెన్యూలను గమనిస్తే చంద్రబాబు పాలనలో గ్రోత్ రేట్ 3% మాత్రమే ఉంది. రాష్ట్ర ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడం లేదు..చంద్రబాబు జేబులోకి పోతున్నాయి.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు





Address

Nuzvid

Website

Alerts

Be the first to know and let us send you an email when Gunturmedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share