
01/07/2025
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ మంజూరు చేసింది.. బుధవారం జిల్లా జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం..
2019లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గన్నవరం నుండి యార్లగడ్డ వెంకట్రావు పై గెలుపొందిన వంశీ తదనంతర పరిణామాల్లో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు..
అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించాయి..
ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ టార్గెట్గా టిడిపి ప్రభుత్వం కేసుల మీద కేసులు పెట్టి ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసింది..
ప్రస్తుతం అన్ని కేసులలో వంశీకి బెయిల్ మంజూరు అయింది..రేపు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం..
అయితే మట్టి తవ్వకాల కేసులో ముందస్తు బేయిలు హైకోర్టు వంశీకి మంజూరు చేయగా దానిపై టిడిపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది..
ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది ఒకవేళ సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఉంటే మరల జైలులోనే ఆ కేసు విషయమై ఉండవలసిన పరిస్థితి వంశీకి ఏర్పడుతుంది..ఈ నేపథ్యంలో రేపు ఏమి జరుగుతుంది అనే ఆసక్తి నెలకొని ఉంది..