26/04/2025
నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ,తెలుగుదేశం లో కీలక నేతగా ఎదుగుతున్న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యలో స్వపక్షంలోనే దేవేంద్రనాథ్ చౌదరిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు..
సoతనూతలపాడు నియోజకవర్గంలో కీలక నేతగా లోకేష్ టీమ్ లో మంచి గుర్తింపు ఉన్న వీరయ్య చౌదరి తనకి ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడని ఆక్రోషంతో దేవేంద్రనాథ్ చౌదరి సుఫారీ గ్యాంగ్ తో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిర్ధారణకి వచ్చారు..
చీమకుర్తిలో దొరికిన టు వీలర్ ఆధారంగా దానిపై రక్తపు మరకలను గమనించి ఆ దిశగా చేసిన ఇన్వెస్టిగేషన్లో దేవేంద్రనాథ్ చౌదరి ప్రధాన నిందితుడిగా నిర్ధారణకు వచ్చారు..
ఇంకా మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు..
అయితే లిక్కర్ తదితర వ్యాపార లావాదేవీలు రాజకీయంగా ఎదుగుతున్నాడనే కసి తదితర అంశాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని అంటున్నారు.
ఇక వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు తీవ్రంగా జరిగాయని ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కదిద్దుతున్నామని ఈ నేపథ్యంలో వైసిపి వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు..
ఈ వ్యాఖ్యానం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగాయి..
ఒకవైపు అక్రమంగా వైసిపి నాయకులపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తూ స్వపక్షంలో గొడవల కారణంగా జరిగిన హత్యను తమపై రుద్దడం ఎంతవరకు సమంజసమని వైసిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తూ ఆయన ప్రతి అంశాన్ని వైసిపి పై వేయడాన్ని తీవ్రంగా విమర్శించాయి..
ఇకనైనా రెడ్బుక్ పాలనకు స్వస్తి చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై శ్రద్ధ చూపాలని పలువురు కోరుతున్నారు