Addanki Local News

Addanki Local News News

02/02/2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

31/01/2026
31/01/2026

వేటపాలెం లో తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అంబంటి రాంబాబు దూషించడానికి ఖండిస్తూ శనివారం రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు అరచేతిలో కర్పూరాన్ని వెలిగించి హారతి ఇచ్చారు. జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు.

23/01/2026

అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్సీ కాలనీలో హ్యాపీ బర్తడే నారా లోకేష్ అనే అక్షరాలను భూమిపై చెక్కించి గురువారం అర్ధరాత్రి వెలుగుల మధ్య మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.

కొరిశపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై మహమ్మద్ రఫీ మందుబాబులు బహిరంగ మద్యం సేవించే మందు ప్రదేశా...
20/01/2026

కొరిశపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై మహమ్మద్ రఫీ మందుబాబులు బహిరంగ మద్యం సేవించే మందు ప్రదేశాలను గుర్తించారు. పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలతో కలసి అక్కడ మద్యం సేవించి ఉన్న సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లను ఆయన తీసివేయించారు. బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా మద్యం సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ మహమ్మద్ రఫీ హెచ్చరించారు.

కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కనగాలవారి పాలెం పోలింగ్ బూత్ నెంబర్ 296 కు బూత్ లెవెల్ ఆఫీసర్ గా పని చ...
19/01/2026

కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కనగాలవారి పాలెం పోలింగ్ బూత్ నెంబర్ 296 కు బూత్ లెవెల్ ఆఫీసర్ గా పని చేస్తున్న కుంభ శిరీష కు ఉత్తమ అవార్డు ను ప్రకటిస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడ లో తుమ్మపల్లి కళాక్షేత్రం నందు ఆమె అవార్డును అందుకొని ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో సుబ్బారెడ్డి మరియు వీఆర్వోలు ఆమెకు అభినందనలు తెలిపారు.

కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దగ్గుబాడు, పోతినవారి పాలెం, స్వర్ణ గ్రామాలకు చెందిన వీరయ్య, రాజేష్, అశోక్ రాములు వారి ...
19/01/2026

కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దగ్గుబాడు, పోతినవారి పాలెం, స్వర్ణ గ్రామాలకు చెందిన వీరయ్య, రాజేష్, అశోక్ రాములు వారి అకౌంట్లో సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని1930 కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సోమవారం ఎస్సై ఖాదర్ బాషా సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న బాధితులకు తిరిగి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయించారు. ఈ సందర్భంగా వారు ఎస్సై కు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఆధార్ ఓటీపీలు చెప్పవద్దని ఎస్ఐ సూచించారు. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

19/01/2026

కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో రైతులు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. పలువురు రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసేందుకు విత్తనాలు ఎదజల్లే చిన్న యంత్రాల ద్వారా కేవలం ఇద్దరు కూలీలతో విత్తనాలు నాటిస్తున్నారు. ఈ చిన్న యంత్రాల ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో విత్తనాలు నాటటం లాభదాయకంగా ఉందని పలువురు రైతులు చెబుతున్నారు.

12/01/2026

కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు సామాజిక భవనం నిర్మాణ పనులు సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని పలువురు కాలనీవాసులు సోమవారం తెలిపారు. మార్చిలోగా సామాజిక భవనం ప్రజలందరికీ వాడుక లోకి వస్తున్నట్లు వారు చెప్పారు. జయ కృష్ణ సారధ్యంలో తమ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు, సైడ్ కాలువలు నిర్మాణాలు పూర్తి అయినట్లు వారు తెలియజేశారు. మంత్రి రవికుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు చెప్పారు.

Address

Pamidipadu, Korisapadu(md)
Ongole
523213

Website

Alerts

Be the first to know and let us send you an email when Addanki Local News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share