25/05/2022
అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం బడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాదు ప్రతి భారతీయుడికి సొంతం. ప్రతి భారతీయుడికి, భారత స్త్రీ కి ఈ రోజు ఇన్ని హక్కులు ఉన్నాయి అంటే దానికి కారణం అంబేద్కర్ . ఇవాళ ప్రతి పని చేసే వ్వక్తి 8 గంటల వర్కింగ్ అవర్స్ ను ప్రవేశపెట్టాడు. అలాంటి అంబెద్కర్ ని అందరూ ఇష్టపడాలి అనే rule ఏమి లేదు. మీకు నచ్చకపోతే మీ అభిప్రాయాన్ని శాంతియుతంగా నిరసన తెలుపవచ్చు.
అంతే గానీ, పోలీసుల మీద రాళ్ళు రువ్వి ప్రైవేట్ ఆస్తులు పబ్లిక్ ఆస్తులు తగల పెట్టి, మినిస్టర్ ఇంటి పై దాడి చేసి, ప్రజలను భయాందోళనలకు గురిచేయడమా. ఇలానా నిరసన చూపేది?
20 మంది పోలీసులు గాయ పడ్డారు, DSP గాయపడ్డాడు, బస్సులు తగలపెట్టారు, పబ్లిక్ ఆస్తులను పాడుచేసారు. కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళను తగలబెట్టడమా మీ పోరాటానికి ఉన్న చిత్తశుద్ధి.
ఒకవేళ ఎవరి ప్రాణం అయినా పోయుంటే? అప్పుడు మిమ్మల్ని ఎవరూ క్షమించరు.
ఎవడు చేసిన పనికి వాడే నవ్వుల పాలు అవుతారు. ఇంకా చెప్పాలి అంటే మీ సంకుచిత స్వభావానికి సమాజం ఉమ్మివెస్తుంది మీ మీద.
గోదావరి ప్రాంతం అంటే పచ్చని అందమైన ప్రకృతి.అంతే మంచి ప్రజలు అని బయటి ప్రాంతాల వారు అనుకుంటారు. ఈ స్వార్థ రాజకీయాల మధ్య ఆ ప్రదేశం కి జరిగే నష్టాన్ని, దాని మీద పడి మచ్చ నీ ఎవరూ చెరపలేరు.
Delhi లో రాళ్ళు రువ్విన వాళ్ళని సంఘ విద్రోహులు, మత తత్వవాదులు అని మీడియా లో ప్రచారం చేశారే; మరి ఇవాళ కోన సీమ లో రాళ్ళు రువ్విన వాళ్ళని ఏమనాలి? కులగజ్జి నింపుకున్న రాడికల్స్ అనా? లేదా సమాజ వ్వతిరేకులు అనాలా?
పోలీసులు కాస్త anti riot treatment ఇచ్చి వాయించి case లు పెట్టీ లోపలకి తోస్తే ఇక కెరీర్,పరువు లాంటివి ఉండవు. ఇక్కడ నష్టపోయేది సొంత జీవితం మరియు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలే.
కానీ ఇక్కడ వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు రెచ్చగొట్టిన వ్వక్తులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని కొన్నాళ్ళకు రాజకీయ నాయకులుగా చెలామణి అవుతారు. అది ఏ పార్టీ అయినా. మీ కుల దురహంకారం చూపించాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా చేతులు కట్టుకుని ఉండే బానిసలు లేరు.అందరూ సమానమే.