08/02/2026
ఎల్వీ సుబ్రమణ్యం గారు, మాజీ టీటీడీ ఈఓ, మాజీ సీఎస్ స్పందిస్తూ "శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ కావడం అత్యంత దురదృష్టకరమని" ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన తప్పును మాజీ సీఎం జగన్ వెనకేసుకురావడం సరికాదని, దీనిపై పశ్చాత్తాపం లేకపోవడం విచారకరమన్నారు. తప్పు చేసిన వారు స్వామివారి క్షమాపణ కోరాలని సూచించారు. సామాన్య భక్తుడిగా ఈ అపచారాన్ని భరించలేమని, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం శ్రేయస్కరం కాదని అన్నారు.