13/07/2025
పెడన టౌన్,
వాసవి కళ్యాణ మండపం,
13 జులై 2025..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం పెడన నియోజకవర్గం లో గ్రాండ్ సక్సెస్...!!!
ముందుగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు...!!!
"బాబు షూరిటీ మోసం గ్యారెంటీ"
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలు తెలుస్తాయి అని అన్నా మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ పేర్ని కిట్టు గారు వివరించారు...
కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారి అధ్యక్షతన, పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉప్పాల రాము గారు ఆధ్వర్యంలో"బాబు షూరిటీ - మోసం గ్యారంటీ" పెడన టౌన్ వాసవి కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది...
అదేవిధంగా నియోజకవర్గ స్థాయి,మండల స్థాయి మరియు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ గ్రామానికి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు....
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పేర్ని నాని గారు, మచిలీపట్నం పార్లమెంటరీ పరిశీలికులు శ్రీ జెట్టి గురునాధం గారు, మాజీ హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు, ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి గారు, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జ్, శ్రీ కైలే అనిల్ కుమార్ గారు, అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సింహాద్రి రమేష్ గారు, మచిలీపట్నం ఇంచార్జ్ శ్రీ పేర్ని కిట్టు గారు, కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...