APUWJ

APUWJ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from APUWJ, News & Media Website, Penukonda.

25/03/2023
APUWJ ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే
24/03/2023

APUWJ ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే

వీడియో జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది - వీడియో జర్నలిస్టుల యూనియన్ ఎన్నికలో నేతల హామీ- గౌరవాధ్యక్షులుగా ఎస్క...
23/03/2023

వీడియో జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది
- వీడియో జర్నలిస్టుల యూనియన్ ఎన్నికలో నేతల హామీ
- గౌరవాధ్యక్షులుగా ఎస్కే మహేష్
- అధ్యక్షులుగా స్నేహల్, కార్యదర్శి గా కిరణ్
కర్నూల్, మార్చి 23:
వీడియో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చిన ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది అని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జీ. కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్. రాజు, శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అనుబంధంగా కర్నూల్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని మీడియా రూం దగ్గర జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తల సేకరణలో కొంతమంది అక్రమార్కుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని, వీడియో జర్నలిస్టులు కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే వీడియో జర్నలిస్టులకు ఇబ్బంది ఎదురైన యూనియన్ అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు. అనంతరం వీడియో జర్నలిస్టుల నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.
*నూతన కార్యవర్గం :*
యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎస్కే మహేష్, గౌరవ సలహాదారులు
ఎం.వీరేశం, అధ్యక్షుడిగా
జె.స్నేహల్ ఉపాధ్యక్షులుగా కె.రాజు, వి.రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి గా ఎన్జీ. కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా ఎ.సూర్యబాబు,
కె.అనిల్ కుమార్, కోశాధికారి
ఇ.చంద్ర శేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గా ఎ.చెన్నయ్య, కార్యవర్గ సభ్యులుగా సురేంద్ర బాబు, చాంద్ బాషా, సురేష్, రమేష్, రామకృష్ణా రెడ్డి, నాగేష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూ జే నాయకులు, సభ్యులు పాల్గొన్నారు

ఏపీయూడబ్ల్యూజే కు అనుబంధంగా కర్నూల్ నగరం లో మీడియా రూం దగ్గర వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్...
23/03/2023

ఏపీయూడబ్ల్యూజే కు అనుబంధంగా కర్నూల్ నగరం లో మీడియా రూం దగ్గర వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఐజేయూ నాయకులు కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, శ్రీనివాస్ గౌడ్, కోశాదికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి శివ, కార్యవర్గ సభ్యులు చిరంజీవి, వీడియో జర్నలిస్టు నాయకులు స్నేహల్, కిరణ్, చాంద్, సూరి, రాజు, రామోహన్, రమేష్, నాగేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవ్ జర్నలిజం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రప...
23/03/2023

కర్నూలు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవ్ జర్నలిజం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందించిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు.......

23/03/2023

రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి
సార్...
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో ఈరోజు 'సేవ్ జర్నలిజం డే' గా పాటిస్తున్నాము. మార్చి 23వ తేదీ స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ సేవ్ జర్నలిజం డే ను జరుపుకుంటున్నాము.

దేశంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మీడియా పరిస్థితి పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి దేశవ్యాప్తంగా IJU ఈ 'సేవ్ జర్నలిజం' దినోత్సవాన్ని పాటిస్తోంది.

పాలక శక్తుల ఇష్టాయిష్టాలకు లొంగని స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసహన వైఖరి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.

*మా చార్టర్ ఆఫ్ డిమాండ్స్:*

1. బడా కార్పొరేట్ సంస్థల భారి నుండి మీడియాను విడుదల చేయాలి.
2. సంపాదకులు మరియు జర్నలిస్టుల స్వతంత్రతను కాపాడాలి.

3. ప్రకటనల జారీ విషయంలో డీలింక్ చేయాలి.
4. జర్నలిస్టులపై UAPA మరియు దేశద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం ఆపాలి.
5. అధికార కేంద్రాల శ్రేణిలో జర్నలిస్టులు దూసుకుపోనందున వారిని దేశ వ్యతిరేకులుగా పేర్కొనడం మానుకోవాలి
6. ఐటీ నిబంధనల ముసుగులో డిజిటల్ మీడియాకు సమస్యలు సృష్టించడం మానుకోవాలి
7. మీడియాకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసేందుకు వెంటనే మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
8. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) మరియు సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ (CMAC)లోని అన్ని గుర్తింపు పొందిన జర్నలిస్టు యూనియన్‌లకు ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించాలి.
9. జర్నలిస్టులు మరియు మీడియా సంస్థలపై దాడులను ఆపాలి.
10. జర్నలిస్టుల రక్షణ చట్టం
కేంద్రంలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఉండాలి
11. రైల్వేలో జర్నలిస్టులకు అన్ని రాయితీలను పునరుద్ధరించాలి.
12. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ను ఇవ్వాలి మరియు ఆంధ్రప్రదేశ్‌లో గతంలోని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని ఇతర సౌకర్యాలను పునరుద్ధరించాలి.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే స్వేచ్ఛా, మీడియా చేసే పనికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే పై డిమాండ్లను మీరు పరిగణనలోకి తీసుకుంటారని మరియు సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము.

థాంక్యూ సార్...

ఇట్లు..
తమ విధేయులు...

✊✊✊✊✊✊✊✊*మార్చ్ 23 న "సేవ్ జర్నలిజం డే"* జయప్రదం చేద్దాం! *కామ్రేడ్స్!** *పత్రికాస్వేచ్ఛను  కాపాడాలని..* * *పత్రికా రంగ ...
22/03/2023

✊✊✊✊✊✊✊✊
*మార్చ్ 23 న "సేవ్ జర్నలిజం డే"*
జయప్రదం చేద్దాం!

*కామ్రేడ్స్!*

* *పత్రికాస్వేచ్ఛను కాపాడాలని..*
* *పత్రికా రంగ అస్తిత్వాన్ని పరిరక్షించాలని..*
* *పాత్రికేయుల వృత్తి.. వేతన భద్రతలను హాక్కులను రక్షించాలని..*
* *పాత్రికేయుల పై దాడులను అరికట్టాలని కోరుతూ..*
మార్చ్ 23న దేశవ్యాప్తంగా *"సేవ్ జర్నలిజం డే"* కార్యక్రమాన్ని చేపట్టాలని *ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు)* పిలుపు ఇచ్చినసంగతి మీ అందరికీ తెలిసిందే!

స్వయంగా పాత్రికేయుడుగా పనిచేసి ఎన్నో రచనలు చేసిన అమరవీరుడు *సర్దార్ భగత్ సింగ్,* ఆయన సహచరులు అమరులు *రాజగురు, సుఖదేవ్* దేశమాత స్వేచ్ఛకోసం దైర్యంగా ఉరికంబాన్ని ముద్దాడి ఆత్మబలిదానం చేసిన *మార్చ్ 23న* వారి పోరాటస్పూర్తితో *"సేవ్ జర్నలిజం డే"* పాటించాలని ఐ.జే.యు. నిర్ణయించింది.

చెన్నై ప్లీనరీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని విస్తృతస్థాయిలో అమలు చేయాలని చండీఘర్ లో జరిగిన జాతీయకార్యవర్గ సమావేశం పునరుద్ఘాటించింది .
నేడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య మనుగడకు జర్నలిజాన్ని , పాత్రికేయులను , పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఐజేయూ దృఢంగా భావిస్తోంది.
ఈఅంశాన్ని పౌరసమాజం ముందుంచడానికి, వారి మద్దతు సమీకరించడానికి *"సేవ్ జర్నలిజం డే"* కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము.
సభలు , సమావేశాలు , సెమినార్లు ,
నిరసనప్రదర్శనలు , ఇంకా వినూత్నంగా వివిధరూపాలలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గసభ్యులను , జిల్లా అధ్యక్ష కార్యదర్శులను , జిల్లా కన్వీనర్లను కోరుతున్నాము.
ఇట్లు

ఐ.వి.సుబ్బారావు ,
అధ్యక్షుడు.
చందు జనార్ధన్,
ప్రధానకార్యదర్శి.
*ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏ.పి.యు.డబ్ల్యు.జే.)
✊✊✊✊✊✊✊✊

22/03/2023

అగ్రసేని ఆస్పత్రి గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని కర్నూలు జిల్లాలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు....

Address

Penukonda

Website

Alerts

Be the first to know and let us send you an email when APUWJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share