18/08/2025
కురుక్షేత్ర మహాసంగ్రామం భీష్ముడు పడిపోయాడు. ద్రోణుడు సైన్యాధ్యక్ష పదవి స్వీకరించి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.. ఆరోజు అర్జునుడు వేరే వైపుకు వెళ్ళడంతో అర్జునుడిని చంపలేం కనుక కనీసం అభిమన్యుడిని చంపేద్దాం. దాంతో అర్జునుడు ఏడుస్తాడు. మనం గెలిచినట్లేనని దుర్యోధనుడి ప్రేరణతో పద్మవ్యూహం పన్నాడు. దానికి అండగా సైంధవుడు "నేను శివుడి వరం వల్ల ఒకరోజు పాండవుల్ని అపగలను" ఈవరం నేడు ఉపయోగపడుతుంది. అభిమన్యుడు వ్యాహంలోకి ప్రవేశించగానే వెనుక పాండవులు వస్తారు. నేను వారిని అడ్డుకుంటాను. నన్ను ప్రతిఘటించి ఎవరు లోనికి ప్రవేశించలేరు. అని వ్యూహానికి బయట నిలుచున్నాడు.
ఒక్కోసారి చాలామంది చేసే చెడు కూడా గొప్పగా భావిస్తారు. తదనంతర పరిణామాలు ఎంత తీవ్రమవుతాయో ఆలోచన చేయరు. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అందరూ వెన్నంటి ఉన్నా ప్రమాదం ఏదో రూపంలో నాశనం చేస్తుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేరు.
ఉదయాన్నే ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతున్నారని తెలిసి పాండవులు అర్జునుడు, శ్రీకృష్ణుడు వేరే వైపు వెళుతున్నారు. మిగిలింది మనం. పద్మవ్యూహం తెలిసినవారు మనలో ఎవరు లేరు అనగానే నేనున్నాను అని అభిమన్యుడు వచ్చాడు. దాంతో ప్రాణం లేచివచ్చింది ధర్మరాజుకి.. అయితే ఒకపని చేద్దాం. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధిస్తూ లోపలికి వెళుతుంటే మనం వెనుక నుండి అభిమన్యుడికి రక్షణ కల్పిద్దాం అని సన్నాహాలు చేసుకున్నారు.
యుద్ధం ప్రారంభమయింది. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించి లోపలికి ప్రవేశించాడు. వేలాదిమంది సైన్యాన్ని సంహరిస్తూ వెళుతున్నాడు. వెనుక నుండి వ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవులు ప్రయత్నిస్తుండగా సరిగ్గా సైంధవుడు అడ్డుపడ్డాడు. శివుడి వరం వల్ల పాండవుల ఎదురు నిలబడలేని వాడు ఆపూట పాండవుల్ని నిలువరించాడు. ఎవరెంత పోరినా సైంధవుడిని జయించలేకపోయారు.. లోపలికి ప్రవేశించిన అభిమన్యుడు మలయమారుతంలా విరుచుకుపడి సైన్యాన్ని చీల్చి చెందుతూ, మరోప్రక్క దుర్యోధన, కర్ణ, ద్రోణ, కృపాచార్య, శకుని వంటి వారిని ఒళ్ళు తూట్లు పడేలా కొడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడి పారిపోతున్నారు.
దుర్యోధనుడు ద్రోణుడు వద్దకు వచ్చి నీదగ్గర అస్త్ర శస్త్ర విద్యలు ఉన్నా ఎందుకని అభిమన్యుడిని ఏమి చేయలేకపోతున్నావని దూషించడం మొదలుపెట్టాడు. నేను అర్జునుడికి కవచ ధారణ విద్య నేర్పాను. బహుశా అది తన కొడుక్కి ఉపదేశించినట్లు ఉన్నాడు. ఆ విద్య ఉన్నంతవరకు ముక్కంటే దిగివచ్చిన అభిమన్యుడి ఏమి చేయలేరు అన్నాడు. అయితే ఎలా వాడిని చంపడం అంటే.. చేతిలో ఉన్న విల్లు విరిస్తే నేను కవచం ధారణ తొలగిస్తాను. అప్పుడు ఒకడు గుర్రాలను, మరొకడు సారధిని చంపండి పని సులువు అవుతుంది అన్నాడు..
అందరూ పోరాడుతున్నారు. ఒళ్ళు తూట్లు పడటం తప్ప అభిమన్యుడిని మాత్రం ఏమి చేయలేకపోతున్నారు. అప్పుడు కర్ణుడు అభిమన్యుడినతో పోరాడి ఒళ్ళంతా గుల్లగుల్ల అయిపోయి పారిపోయాడు. అలా వెళ్ళి అభిమన్యుడికి తెలియకుండా వెనుక చాటుగా అభిమన్యుడి చేతిలోకి విల్లు అల్లెతాడు ఒక బాణంతో తెంచాడు. మరోవైపు ఇదే అదునుగా కవచం ధారణ తొలగించాడు. వెంటనే అశ్వాల్ని కూల్చారు, వెనువెంటనే సారధిని చంపారు. ఆ వెంటనే రథచక్రాల్ని విరగొట్టారు. ఇదంతా క్షణకాలంలో జరిగిపోయింది. అయినా మరో చక్రం తీసుకొని వేలాదిమంది సైన్యాన్ని సంహరించాడు. ఆ ధాటికి తట్టుకోలేక రణరంగ నీతిని తప్పిన దుర్యోధనాది వీరులు చుట్టుముట్టి బాణాలు గుప్పించి, కత్తులతో పొడిచి పొడిచి ఒంట్లో రక్తపు బొట్టులేకుండా చేసినా, అభిమన్యుడు ఎక్కడ బెసకకుండా దుర్యోధనుడి కొడుకుతో పోరాడి వాడి తల బద్దలు కొట్టి మరీ వీరుడిలా ప్రాణాలు వదిలాడు. కుటిల యుద్ధనీతి అనుసరించి ఎలాగైతే అభిమన్యుడిని, 16ఏళ్ల పసి బాలుడిని చంపారు.. ఇక్కడ ఒక అద్భుత సన్నివేశం ఉంటుంది. తరువాత పోస్ట్ లో చూడవండి...
ఇంకా ఉంది..